Salman Khan: సల్మాన్‌ ఖాన్‌కు మరోసారి బెదిరింపులు

ABN , First Publish Date - 2023-03-19T23:06:41+05:30 IST

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్‌(Bollywood film actor Salman Khan)కు మరోసారి బెదిరింపులు వచ్చాయి.

Salman Khan: సల్మాన్‌ ఖాన్‌కు మరోసారి బెదిరింపులు
Salman Khan receives threat e mail

ముంబై: బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్‌(Bollywood film actor Salman Khan)కు మరోసారి బెదిరింపులు వచ్చాయి. ఈమెయిల్ ద్వారా బెదిరింపులు వచ్చాయని సల్మాన్ పోలీసులకు తెలియజేశారు. దీనికి సంబంధించి ఇప్పటికే జైలులో ఉన్న గ్యాంగ్‌స్టర్(gangster) లారెన్స్ బిష్ణోయ్( Lawrence Bishnoi), గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్‌(Goldy Brar)లపై ముంబై పోలీసులు(Mumbai Police) ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. సల్మాన్ సన్నిహితుడు ప్రశాంత్ గుంజాల్కర్(Prashant Gunjalkar) ఫిర్యాదుపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.

శనివారం మధ్యాహ్న సమయంలో ఈ మెయిల్ ద్వారా బెదిరింపు వచ్చినట్లు పోలీసులకు సల్మాన్ కార్యాలయం తెలిపింది. గోల్డీ బ్రార్ అనుచరుడు మోహిత్ గార్గ్(Mohit Garg) ద్వారా వచ్చిన మెయిల్‌లో సల్మాన్‌ను తమ బాస్ గోల్డీ బ్రార్ నేరుగా కలవాలనుకుంటున్నట్లు మెయిల్‌లో వెల్లడించాడు. సల్మాన్‌ను చంపేస్తామనే బెదిరింపు అందులో ఉందని ప్రశాంత్ గుంజాల్కర్ పోలీసులకు చెప్పారు. దీంతో పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి విచారణ ప్రారంభించారు. సల్మాన్‌కు గతంలో కూడా అనేకసార్లు బెదిరింపులు వచ్చాయి.

Updated Date - 2023-03-19T23:06:45+05:30 IST