Commissioner of Police: రెండోమారు పరీక్ష నిర్వహించాల్సిందే..

ABN , First Publish Date - 2023-03-30T10:37:28+05:30 IST

‘డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌’ కేసులో పట్టుబడిన వారి కోరిక రెండోమారు కూడా పరీక్ష నిర్వహించాలని పోలీసులకు గ్రేటర్‌ చెన్నై పోలీసు

Commissioner of Police: రెండోమారు పరీక్ష నిర్వహించాల్సిందే..

- ‘డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌’పై చెన్నై కమిషనర్‌ ఆదేశం

చెన్నై, (ఆంధ్రజ్యోతి): ‘డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌’ కేసులో పట్టుబడిన వారి కోరిక రెండోమారు కూడా పరీక్ష నిర్వహించాలని పోలీసులకు గ్రేటర్‌ చెన్నై పోలీసు కమిషనర్‌ శంకర్‌ జివాల్‌(Greater Chennai Police Commissioner Shankar Jival) ఆదేశించారు. ఈ మేరకు ఆయన బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. స్థానిక రాయపేటలో సోమవారం రాత్రి కారులో వెళ్లిన ఓ యువకుడిని అడ్డుకున్న పోలీసులు ‘బ్రీత్‌ అనలైజర్‌’ ద్వారా పరీక్షించారు. ఆ సమయంలో ఆ యువకుడు 45 శాతం మత్తులో వున్నట్లు ఆ పరికరం నిర్ధారించడంతో పోలీసులు అతనికి జరిమానా విధించారు. దీంతో దిగ్ర్భాంతి చెందిన ఆ యువకుడు తనకు మద్యం సేవించే అలవాటు లేదని వాగ్వివాదానికి దిగాడు. అంతేగాక తనకు ఆసుపత్రిలో వైద్య పరీక్ష నిర్వహించాల్సిందేనని పట్టుబట్టాడు. ఇందుకు పోలీసులు నిరాకరించడంతో ఇరువురి మధ్య ఘర్షణకు దారి తీసింది. ఈ ఘటనను వీడియో తీసిన కొందరు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ చేశారు. మద్యపానం అలవాటు లేని వ్యక్తి మద్యం తాగినట్లుగా ‘బ్రీత్‌ అనలైజర్‌’ ఎలా చూపించిందంటూ పలువురు నెటిజన్లు తూర్పారబట్టారు. ఈ వ్యవహారం తన దృష్టికి రావడంతో శంకర్‌ జివాల్‌ స్పందించారు. ఈ కేసులో పట్టుబడే వారు రెండోమారు పరీక్ష అడిగితే తప్పనిసరిగా చేయించాల్సిందేనని ఆదేశించారు. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులో 3ఎంజీ/100ఎంఎల్‌కి పైగా కొలమానం చూపిస్తే, సదరు వ్యక్తి కోరిక మేరకు బ్రీత్‌ అనలైజర్‌ ద్వారా పరీక్షించడం గానీ, లేదా ఆసుపత్రికి తీసుకెళ్లి పరీక్షించడం గానీ చేయాల్సిందేనని పోలీసుల్ని ఆదేశించారు.

Updated Date - 2023-03-30T10:37:28+05:30 IST