Kerala Story: కేరళ స్టోరీ సినిమా డైరెక్టరుకు బెదిరింపు...ముంబయి పోలీసుల భద్రత
ABN , First Publish Date - 2023-05-09T07:41:55+05:30 IST
‘ది కేరళ స్టోరీ’ చిత్ర దర్శకుడు సుదీప్తో సేన్, చిత్ర నిర్మాణ సిబ్బందిలో మరొకరికి గుర్తుతెలియని ఫోన్ నంబరు నుంచి బెదిరింపులు...
ముంబయి: ‘ది కేరళ స్టోరీ’ చిత్ర దర్శకుడు సుదీప్తో సేన్, చిత్ర నిర్మాణ సిబ్బందిలో మరొకరికి గుర్తుతెలియని ఫోన్ నంబరు నుంచి బెదిరింపు సందేశం వచ్చింది.(The Kerala Story) దేశంలో వివాదం రేపిన ‘ది కేరళ స్టోరీ’ దర్శకుడు సుదీప్తో సేన్ తనకు బెదిరింపులు వచ్చాయని ముంబయి పోలీసులకు ఫిర్యాదు చేశారు.(crew member receives threat) దీంతో ముంబయి పోలీసులు డైరెక్టర్ సుదీప్తోకు భద్రత కల్పించారు. ఇంటి నుంచి బయటకు రావద్దని బెదిరింపులో హెచ్చరించారు. పోలీసులు డైరెక్టర్ సుదీప్తోకు భద్రత కల్పించినా(Mumbai Police provides security), దీనిపై ఇంకా కేసు నమోదు చేయలేదు. కాగా ద్వేషం, హింస సంఘటనలను నివారించడానికి శాంతి భద్రతల పరిరక్షణ కోసం తాము పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో ది కేరళ స్టోరీ సినిమాను నిషేధిస్తున్నట్లు ఆ రాష్ట్ర సర్కారు ప్రకటించింది.
ఇది కూడా చదవండి : Apple : ఆపిల్స్ దిగుమతులపై కేంద్రం నిషేధాస్త్రం
‘ది కేరళ స్టోరీ’ ముగ్గురు హిందూ యువతులు వివాహం ద్వారా ఇస్లాం మతంలోకి మారిన తర్వాత ఐఎస్ఐఎస్ శిబిరాలకు అక్రమంగా రవాణా చేయడంతో వారి కష్టాలను తెలిపేదే ఈ చిత్ర కథ.దీంతో ఈ చిత్రాన్ని దేశంలోనే మొట్టమొదటిసారి పశ్చిమబెంగాల్ నిషేధించింది. బీజేపీ పాలిత మధ్యప్రదేశ్‌లో ఈ చిత్రానికి పన్ను ఎత్తివేశారు. దీంతో ఈ చిత్రం చుట్టూ రాజకీయ దుమారం నెలకొంది. పశ్చిమబెంగాల్ రాష్ట్రం తీసుకున్న నిషేధ నిర్ణయంపై తాము న్యాయపోరాటం చేస్తామని చిత్ర నిర్మాత విపుల్ అమృత్‌లాల్ షా చెప్పారు.సుదీప్తో సేన్ నేతృత్వంలో విపుల్ అమృతలాల్ షా నిర్మించిన ఈ చిత్రంపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.ఈ చిత్రాన్నిఆర్ఎస్ఎస్ ప్రచారంగా పిలిచారు. అని పిలిచారు.‘ది కేరళ స్టోరీ’ చిత్రంలో అదా శర్మ, యోగితా బిహానీ, సిద్ధి ఇద్నానీ, సోనియా బలానీ ప్రధాన పాత్రలు పోషించారు.