Tripura Assembly Elections Results 2023 : త్రిపురలో బీజేపీ కూటమి ముందంజ... సుదూరంగా కాంగ్రెస్-వామపక్షాలు...

ABN , First Publish Date - 2023-03-02T11:27:40+05:30 IST

త్రిపుర శాసన సభ ఎన్నికల ఫలితాల్లో (Tripura Assembly Elections Results 2023) బీజేపీ కూటమి భారీ ఆధిక్యంతో దూసుకెళ్తోంది.

Tripura Assembly Elections Results 2023 : త్రిపురలో బీజేపీ కూటమి ముందంజ... సుదూరంగా కాంగ్రెస్-వామపక్షాలు...
BJP Workers in Tripura

న్యూఢిల్లీ : త్రిపుర శాసన సభ ఎన్నికల ఫలితాల్లో (Tripura Assembly Elections Results 2023) బీజేపీ కూటమి భారీ ఆధిక్యంతో దూసుకెళ్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ కూటమికి 40.6 శాతం ఓట్ షేర్ లభించినట్లు తెలుస్తోంది. ఎన్నికల కమిషన్ వెల్లడించిన వివరాల ప్రకారం ప్రముఖులు వెనుకంజలో కనిపిస్తున్నారు.

త్రిపుర ఉప ముఖ్యమంత్రి జిష్ణు దెబ్బర్మ, మంత్రులు రామ్ ప్రసాద్ పౌల్, భాగ్బన్ దాస్, బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు రాజీబ్ భట్టాచార్య వెనుకంజలో ఉన్నారు. మరో మంత్రి, ఐపీఎఫ్‌టీ నేత ప్రేమ్ కుమార్ రియాంగ్ తన నియోజకవర్గంలో మూడో స్థానంలో ఉన్నారు.

ఎన్నికల కమిషన్ వెల్లడించిన సమాచారం ప్రకారం, బీజేపీ 18, కాంగ్రెస్-వామపక్షాలు 14, తిప్ర మోత పార్టీ 12 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి.

జాతీయ మీడియా కథనాల ప్రకారం, అగర్తలలో కాంగ్రెస్ అభ్యర్థి సుదీప్ రాయ్ బర్మన్ ముందంజలో ఉన్నారు. ఆయన తన సమీప ప్రత్యర్థి కన్నా 3,668 ఓట్ల ఆధిక్యంలో కనిపిస్తున్నారు. ఎన్నికల కమిషన్ 40 స్థానాల్లో ట్రెండ్స్‌ను ప్రకటించింది. వీటిలో 10 స్థానాల్లో కాంగ్రెస్-వామపక్షాలు ముందంజలో ఉన్నాయి.

బీజేపీ కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు. త్రిపురలో మరోసారి తామే విజయం సాధిస్తామని చెప్తూ, బాణసంచా కాల్చుతూ ఒకరినొకరు అభినందించుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి :

Meghalaya Results : మేఘాలయలో రసవత్తర పోరు... టీఎంసీ జోరు...

Meghalaya Poll Results : అందరి చూపు ముకుల్ సంగ్మావైపు!

Updated Date - 2023-03-02T11:27:40+05:30 IST