America : విలేకరిపై మండిపడ్డ జో బైడెన్
ABN , First Publish Date - 2023-02-17T20:35:50+05:30 IST
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (United States President Joe Biden) శుక్రవారం (భారత కాలమానం ప్రకారం) ఓ విలేకరిపై మండిపడ్డారు.
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (United States President Joe Biden) శుక్రవారం (భారత కాలమానం ప్రకారం) ఓ విలేకరిపై మండిపడ్డారు. బైడెన్ కుటుంబ సభ్యులకు చైనాతో వ్యాపార సంబంధాలు ఉండటం వల్ల అమెరికా ప్రయోజనాలకు విఘాతం కలుగుతోందా? అని ప్రశ్నించినపుడు ఆయన చిరాకు ప్రదర్శించారు. ఇటీవల అనుమానిత చైనీస్ స్పై బెలూన్స్‌ను కూల్చేసిన నేపథ్యంలో బైడెన్ మీడియాను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా విలేకర్లు ఆయనను అనేక ప్రశ్నలు వేశారు.
అయితే ఓ విలేకరి మాట్లాడుతూ, ‘‘చైనాలో మీ కుటుంబ సభ్యులకు ఉన్న వ్యాపార సంబంధాలు ఆ దేశంతో మీరు వ్యవహరించే సామర్థ్యాన్ని దెబ్బతీశాయా, ప్రెసిడెంట్ బైడెన్?’’ అని ప్రశ్నించారు. వెంటనే బైడెన్ ఆ విలేకరివైపు చూస్తూ, ‘‘నాకు కాస్త విరామం ఇయ్యి, బాబూ’’ అన్నారు. (అన్యాయంగా మాట్లాడి, బాధపెట్టవద్దని కోరారు).
మరో విలేకరి మాట్లాడుతూ, చైనీస్ బెలూన్స్‌పై అమెరికా స్పందించిన తీరుపై వస్తున్న విమర్శలపై స్పందించాలని కోరారు. దీనిపై బైడెన్ స్పందిస్తూ, ‘‘మీరు మా కార్యాలయానికి రండి, గొప్ప మర్యాదగలవారు ఉండే చోట మీరు ప్రశ్నించండి’’ అన్నారు.
అలాస్కా నుంచి దక్షిణ కరోలినావైపు వెళ్తున్న ఓ చైనీస్ బెలూన్‌ను ఫిబ్రవరి నాలుగున అమెరికా కూల్చేసిన సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి :
Bhiwani murders: భివానీ హత్యల కేసులో ఆరుగురి అరెస్ట్
Ramcharitmanas Row : సమాజ్‌వాదీ పార్టీ బహిష్కృత నేత సంచలన వ్యాఖ్యలు