Fashion : రాజస్థానీ హంగుల్లో...
ABN , First Publish Date - 2023-11-21T23:00:40+05:30 IST
రాజస్థానీ చీరలు మనోహరమైన రంగులతో ఆకట్టుకుంటాయి. పట్టు, సింథటిక్... కలబోతతో, అందమైన అద్దకాలతో అతివల అందాలను రెండింతలు చేసే ఈ చీరలు
రాజస్థానీ చీరలు మనోహరమైన రంగులతో ఆకట్టుకుంటాయి. పట్టు, సింథటిక్... కలబోతతో, అందమైన అద్దకాలతో అతివల అందాలను రెండింతలు చేసే ఈ చీరలు ప్రతి వార్డ్‌రోబ్‌లో కచ్చితంగా ఉండాల్సిందే!
జరీ అంచు ధగధగలతో మెరిసిపోయే చీరకు, మ్యాచింగ్ బ్లౌజు కూడా జరీదే ఉండడం ఈ చీర ప్రత్యేకత. నారింజ, ఎరుపు ముదురు రంగుల్లో ఫేడెడ్ డిజైన్ కలిగి ఉండే ఈ చీర కట్టుకుంటే ముద్దబంతి పువ్వులా వెలిగిపోవడం ఖాయం!
లంగా, ఓణీ డిజైన్‌తో ఉన్న రాజస్థానీ చీర ఎలాంటి వయసువారికైనా నప్పుతుంది. ప్లెయిన్ కలర్ చీరకు, భారీ డిజైన్ ఉన్న పవిట కొంగును ఎంచుకోవాలి.
అద్దకాలతో అదరగొట్టే చీరకు కాంట్రాస్ట్ కలర్స్ అదనపు ఆకర్షణ. పసుపు, కుంకుమల మేళవింపులా కనిపించే ఈ తరహా చీరలను వేడుకల్లో ధరిస్తే అందరి దృష్టీ మీ వైపే!
చీర మొత్తం తెలుపు రంగు అద్దకాలతో వెలిగిపోయే చీరీలకు రెండు వైపులా జరీ అంచులుంటే అదనపు అందం సమకూరుతుంది. ఆ అంచుకు తగ్గట్టు అదే మోడల్ బ్లౌజ్ వేసుకుంటే అందమే అందం!
భారీ బార్డర్‌తో ఏ చీరకు అందం రాదు? సెక్విన్ వర్క్‌తో హెవీ లుక్ తెచ్చుకున్న రాజస్థానీ చీరలు కడితే వేడుకల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలవడం ఖాయం!