TANA: 'తానా' బోర్డ్ చైర్మన్‌గా డాక్టర్ నాగేంద్ర శ్రీనివాస్ కొడాలి
ABN , First Publish Date - 2023-08-12T10:34:01+05:30 IST
'తానా' బోర్డుకి జరిగిన ఎన్నికలలో డాక్టర్ నాగేంద్ర శ్రీనివాస్ కొడాలి బోర్డ్ చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వారితో పాటు కార్యదర్శిగా లక్ష్మి దేవినేని, కోశాధికారిగా జనార్దన్ (జూనీ) నిమ్మలపూడి కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
TANA: 'తానా' బోర్డుకి జరిగిన ఎన్నికలలో డాక్టర్ నాగేంద్ర శ్రీనివాస్ కొడాలి బోర్డ్ చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వారితో పాటు కార్యదర్శిగా లక్ష్మి దేవినేని, కోశాధికారిగా జనార్దన్ (జూనీ) నిమ్మలపూడి కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
డాక్టర్ నాగేంద్ర శ్రీనివాస్ కొడాలి
ప్రపంచ ప్రతిష్టాకరమైన టెక్సాస్ చిల్డ్రన్స్ హాస్పటిల్‌లో పీడియాట్రిక్ కార్డియోవాస్క్యూలర్ అనేస్తేషలోజిలో డాక్టర్ శ్రీనివాస్ సేవలందిస్తున్నారు. అలాగే బేలోర్ కాలేజీ ఆఫ్ మెడిసిన్‌లో వైద్య విద్యను బోధిస్తున్నారు. గతంలో తానా బోర్డు కార్యదర్శిగా మరియు ప్రతిష్టాకరమైన తానా- బసవతారకం ప్రాజెక్ట్‌కి ముందు ఉండి మార్గదర్శకాలతో పాటు కోటి రూపాయిల నిధిని సమకూర్చి బసవతారకం ఇండో అమెరికన్ కాన్సర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్‌కి వైద్య పరికరాల కొనుగోలుకు తానా ఫౌండేషన్ తరుపున అందించటంలో ముఖ్య భూమిక పోషించారు. అలాగే సనాతన హిందూ ధార్మిక కార్యక్రమాలు అయిన వేద పాఠశాలలు, గోశాలలు, గురుకులాల, దేవాలయాల అభివృద్ధికి ఆర్ధిక వనరులు సమకూర్చటంతో పాటు విశేష సేవలందిస్తున్నారు.
బోర్డు కార్యదర్శిగా ఎన్నికైన లక్ష్మి దేవినేని గతంలో తానా బోర్డు కోశాధికారిగా, న్యూజెర్సీ రీజినల్ కోఆర్డినేటర్‌గా, విమెన్ సర్వీసెస్ కోఆర్డినేటర్‌గా, అలాగే ఇటీవలే జరిగిన 23వ తానా మహా సభలలో పలు కమిటీలలో ఆమె సేవలందించారు. బోర్డు కోశాధికారిగా ఎన్నికైన జనార్దన్ నిమ్మలపూడి గతంలో 21వ తానా మహాసభల కార్యదర్శిగా, కాపిటల్ రీజియన్ కోఆర్డినేటర్ గానే కాకుండా కాన్సర్ అవగాహన మరియు నిధుల సమీకరణం కోసం ప్రపంచంలో ఎత్తైన కిలి మంజారో పర్వతాన్ని అధిరోహించారు. అలాగే ఈ మధ్య జరిగిన 23వ తానా మహాసభలలో ఎన్‌టీఆర్ మెమోరియల్ ట్రస్ట్‌కి కోటి రూపాయల నిధిని సమకూర్చడంలో ప్రత్యేక పాత్ర ఫోషించారు.
తానా బోర్డు చైర్మన్‌గా ఎన్నికైన డాక్టర్ నాగేంద్ర శ్రీనివాస్ కొడాలి తానా ఎగ్జిక్యూటివ్ కమిటీ, తానా ఫౌండేషన్‌ను సమన్వయ పరుచుకుంటూ, సరైన దిశలో మార్గ నిర్దేశం చేస్తున్నారు. అలాగే తానా సేవలను, ప్రతిష్టని సమర్ధవంతంగా మరింత ముందుకు తీసుకు వెళ్తామని, బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ తమ మీద పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామన్నారు. తానాని తెలుగు వారికి మరింత చేరువ చేయటానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని తెలిపారు.