NATS: ఫిలడెల్ఫియాలో ఘనంగా 'నాట్స్' బాలల సంబరాలు
ABN , First Publish Date - 2023-12-13T07:23:32+05:30 IST
అమెరికాలో తెలుగు వారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) తాజాగా ఫిలడెల్ఫియాలో బాలల సంబరాలను ఘనంగా నిర్వహించింది.
ఔరా అనిపించిన తెలుగు చిన్నారుల ప్రతిభ ప్రదర్శనలు
NRI News: అమెరికాలో తెలుగు వారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) తాజాగా ఫిలడెల్ఫియాలో బాలల సంబరాలను ఘనంగా నిర్వహించింది. ఫిలడెల్ఫియాలోని స్థానిక భారతీయ టెంపుల్ కల్చరల్ సెంటర్ వేదికగా ఈ బాలల సంబరాలు జరిగాయి. ప్రతియేటా పండిట్ జవహర్ లాల్ నెహ్రూ జన్మదినం సందర్భంగా నాట్స్ బాలల సంబరాలను నిర్వహిస్తూ వస్తుంది. తెలుగు చిన్నారుల్లో ఉన్న ప్రతిభ పాటవాలను ప్రోత్సహించేందుకు నిర్వహిస్తున్న ఈ బాలల సంబరాలకు అద్భుతమైన స్పందన లభించింది. దాదాపు 160 మందికి పైగా బాల బాలికలు ఈ సంబరాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. బాలల సంబరాలను పురస్కరించుకుని తెలుగు సంప్రదాయ నృత్యం, సినీ నృత్యం, సంప్రదాయ సంగీతం, సినీ సంగీతం, గణితం, తెలుగు వక్తృత్వం, తెలుగు పదకేళి, చిత్రలేఖనం అంశాల్లో నాట్స్ పోటీలు నిర్వహించింది. ఎనిమిది ఏళ్ళలోపు, పన్నెండు ఏళ్ళలోపు, పన్నెండు ఏళ్లపైన ఉన్న చిన్నారులను మూడు వర్గాలుగా విభజించి నిర్వహించిన ఈ పోటీల్లో అనేక మంది పిల్లలు తమ ప్రతిభను ప్రదర్శించారు. ఈ పోటీల్లో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన వారికి నాట్స్ బహుమతులు అందించింది.
నాట్స్ వైస్ ప్రెసిడెంట్ ప్రోగ్రామ్స్ హరినాథ్ బుంగటావుల, రవి ఇంద్రకంటి, రమణ రాకోతు, బాబు మేడి, సరోజ సాగరం, వెంకట్ శాఖమూరి, విశ్వనాథ్ కోగంటి, సురేష్ బొందుగుల, అప్పారావు మల్లిపూడి, రాజశ్రీ జమ్మలమడక, హిమ బిందు తోట, అపర్ణ సాగరం, మాలిని గట్టు, చైతన్య పెద్దు, శ్రీకాంత్ చుండూరి, వెంకట్ పాలడుగు, పార్ధ మాదాల, సాయి సుదర్శన్ లింగుట్ల, నిర్మల రాజ్, సతీష్ పుల్యపూడి, ఆశిష్ చెరువు ఈ బాలల సంబరాలు కార్యక్రమ నిర్వహణలో కీలక పాత్ర పోషించారు. నాట్స్ జాతీయ కార్యవర్గ సభ్యులు శ్రీహరి మందాడి, రాజ్ అల్లాడ, చంద్రశేఖర్ కొణిదెల, రామ్ నరేష్ కొమ్మనబోయిన, శ్రీనివాస్ భీమినేని, మురళీ మేడిచెర్ల తదితరులు ఈ సంబరాలకు తమ మద్దతు అందించారు. ఇంకా ఈ కార్యక్రమంలో నాట్స్ సంబరాల కల్చరల్ టీం సభ్యులు బిందు యలమంచిలి, శ్రీదేవి పులిపాక, తానా మిడ్ అట్లాంటిక్ రిప్రజెంటేటివ్స్ సునీల్ కోగంటి, భాస్కర్ మలినేని, వెంకట్ సింగు, ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ ఫిలడెల్ఫియా ప్రెసిడెంట్ బద్రి కునాపులి, రవితేజ మారినేని, టిఏజిడివి అధ్యక్షులు ముజీబుర్ రెహ్మాన్ షేక్, ఉపాధ్యక్షులు రామ్మోహన్ తాళ్లూరి, పూర్వ అధ్యక్షులు హరనాథ్ దొడ్డపనేని, తదితరులు పాల్గొని వారి తోడ్పాటుని అందించారు.
స్థానికంగా ప్రసిద్దులైన ప్రముఖ సంగీత, నృత్య గురువులు శ్రీనివాస్ చాగంటి, అన్నపూర్ణ చాగంటి, రాధా గుంటూరి, నీలవేణి కందుకూరి, శ్రీదేవి ముంగర, భారతి అశోక్, సంయుక్త పుత్రయ, అనిషా ధరణిప్రగడ, విద్య షాపుష్కర్, వసంత తమ్మినేని, రిద్ధిమ, సౌజన్య కోగంటి, రఘు షాపుష్కర్, శిరీష వేదుల, ఈ సంబరాల్లో న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. సంజన చామర్తి గణేశ ప్రార్ధనతో ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమం రాత్రి పది గంటల వరకు నిర్విరామంగా 160 మందికిపైగా పిల్లల ప్రదర్శనలతో కొనసాగింది. ఈ కార్యక్రమానికి సుమన చాగంటి, సుమేధ గవరవరపు, అక్షయ పాల్యపూడి, స్నేహ ఇంద్రకంటి, అవంతిక మన్న వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. ప్రేక్షకుల కేరింతల మధ్య తెలుగు సినీగీతాల గానంతో పాటు నృత్యంతో చిన్నారులు అద్వైత్ బొందుగుల, శ్లోక విద్ధం, సాత్విక ప్రభ, స్నేహ ఇంద్రకంటిలు అలరించారు.
తెలుగు బాల బాలికలను ప్రోత్సహించడానికి, వారిలో నాయకత్వ లక్షణాలను పెంపొందించడానికి నాట్స్ బాలల సంబరాలు నిర్వహిస్తుందని నాట్స్ మాజీ చైర్మన్ శ్రీధర్ అప్పసాని అన్నారు. బాలల సంబరాలను దిగ్విజయవంతంగా నిర్వహించిన నాట్స్ ఫిలడెల్ఫియా చాప్టర్ కార్యవర్గ సభ్యులందరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. బాలల సంబరాల కోసం పని చేసిన ప్రతి ఒక్కరికి నాట్స్ ప్రెసిడెంట్ బాపయ్య చౌదరి (బాపు) నూతి కృతజ్ఞతలు తెలిపారు. తెలుగు చిన్నారుల కోసం నాట్స్ ఫిలడెల్ఫియా విభాగం బాలల సంబరాలను ఘనంగా నిర్వహించింనందుకు నాట్స్ చైర్ ఉమెన్ అరుణ గంటి నాట్స్ ఫిలడెల్ఫియా సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు. గ్రాండ్ స్పాన్సర్ బావర్చి బిర్యానీస్, స్పాన్సర్స్ డివైన్ ఐటీ సర్వీసెస్, లావణ్య, సురేష్ బొందుగుల, సాఫ్ట్ స్కూల్స్.కామ్ ఈ కార్యక్రమ నిర్వహణకు తమ సహాయాన్ని అందించారు.
మరిన్ని NRI NEWS కోసం ఇక్కడ క్లిక్ చేయండి.