NATS: కాన్సాస్‌‌లో ఘనంగా 'నాట్స్ తెలుగమ్మాయి' పోటీలు

ABN , First Publish Date - 2023-04-28T07:42:10+05:30 IST

అమెరికాలో తెలుగు వారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం 'నాట్స్' (NATS) తాజాగా కాన్సాస్‌‌లో 'నాట్స్ తెలుగమ్మాయి' పోటీలు ఘనంగా నిర్వహించింది.

NATS: కాన్సాస్‌‌లో ఘనంగా 'నాట్స్ తెలుగమ్మాయి' పోటీలు

ఆటపాటలతో అలరించిన తెలుగు మహిళలు

కాన్సాస్, ఏప్రిల్ 27: అమెరికాలో తెలుగు వారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం 'నాట్స్' (NATS) తాజాగా కాన్సాస్‌‌లో 'నాట్స్ తెలుగమ్మాయి' పోటీలు ఘనంగా నిర్వహించింది. ఈ పోటీల్లో భాగంగా బాలికలు, మహిళలు ఆట, పాటలతో ఉత్సాహాన్ని నింపారు. ఇందులో శాస్త్రీయ నృత్యాలు, జానపద నాట్యాలు, ఏక పాత్రాభినయం, టాలీవుడ్ డ్యాన్సులు, పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. అలాగే అలనాటి మేటి తెలుగు సినీతారలైన జమున, సూపర్ స్టార్ కృష్ణలను గుర్తు చేసుకుంటూ వారికి నివాళిగా ప్రదర్శించిన నృత్యాలకు మంచి స్పందన లభించింది. విశ్వమోహన్ అమ్ముల పాత పాటలు పాడి మంత్ర ముగ్ధుల్ని చేశారు. అమెరికాలో పుట్టి పెరిగిన పిల్లలకి, మహిళలకి మన సంస్కృతి, సంప్రదాయాలు తెలియచేయడమే లక్ష్యంగా 'నాట్స్' తెలుగమ్మాయి కార్యక్రమాన్ని జాతీయ స్థాయిలో నిర్వహిస్తోంది. తెలుగు భాష, మన కట్టు, బొట్టు, తెలుగుదనం రేపటి తరానికి అలవరచడం కోసం 'నాట్స్ తెలుగమ్మాయి' పోటీలు దోహదపడుతున్నాయి.

ఈ పోటీల్లో భాగంగా 'ముద్దుగుమ్మ'(18 సంవత్సరములు లోపు), 'కిన్నరసాని' (19+ సంవత్సరములు), 'కావ్యనాయకి' (19+ సంవత్సరములు పైబడిన వివాహిత) మహిళలకి వివిధ విభాగాలలో పోటీలు నిర్వహించారు. ఎంతోమంది మంది మహిళలతో నిర్వహించిన ఈ పోటీల్లో ప్రతిభ, సంస్కృతి మీద అవగాహన, రూపకాలు, ఆటపాటలు, భగవథ్గీత పఠనం లాంటి ఎన్నో అంశాలు ఉన్నాయి. కాన్సాస్‌లో విజేతలకి జాతీయ స్థాయి పోటీలలో పాల్గొనే అర్హత లభించింది. న్యాయ నిర్ణేతలుగా చైతన్య రంగిని, రేణుక గుమ్మడిపూడి, రమాదేవి కీలక పాత్ర పోషించారు.

NN.jpg

తెలుగమ్మాయి కార్యక్రమాన్ని 'నాట్స్' నేషనల్ కోఆర్డినేటర్ వెంకట్ మంత్రి, రవి గుమ్మడి పూడి, నాట్స్ కాన్సస్ చాప్టర్ కోఆర్డినేటర్ ప్రసాద్ ఇసుకపల్లి ఆధ్వర్యంలో దిగ్విజయంగా నిర్వహించారు. 'నాట్స్ తెలుగమ్మాయి' పోటీల నిర్వహణకు ఈవెంట్ కోఆర్డినేటర్‌గా పార్వతి చిల్లర వ్యవహరించారు. రవి ఆయాసల, వెన్నెల నీతిపూడిలు తెలుగమ్మాయి కార్యక్రమానికి వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. రాధికా మంత్రి, రమాదేవి పొట్టం, సాయిరాం గండ్రోతుల, వేణు రవికాంత్ గార, మదన్ సానీ, విజయ్ రంగిని, సూర్య కాగడం, వెంకట్ వల్లూరిపల్లి, సౌజన్య రావు, శ్రీనివాస్ అబ్బూరి, రిత్విక్ అమ్మిరెడ్డి, చైతలీక మంత్రి, చరని రంగిని, రామ్ సంగేమ్, జావిద్ మహ్మద్ తదితరులు ఈ ఈవెంట్ విజయంలో క్రియాశీలక పాత్ర పోషించారు.

కాన్సాస్ నాట్స్ తెలుగమ్మాయి విజేతల్లో చిట్టి చిలకమ్మ విభాగంలో అక్షర రేపల్లె, మీనాక్షి అయ్యల సోమయాజుల, రిత్వి మహంకాళి, లౌక్య జమిలి ఉన్నారు. నాట్స్ కాన్సాస్ ముద్దుగుమ్మ విభాగంలో క్రిష కరే, సాయి సాత్విక చాడ, సాయి స్వప్నిక చాడ, అక్షర బొగ్గవరపు విజేతలుగా నిలిచారు. మిసెస్ నాట్స్ కాన్సస్ కిన్నెరసాని విభాగంలో విజేతలుగా శ్రీనిథి రావు.. మిసెస్ నాట్స్ కాన్సస్ కావ్యనాయకి విభాగంలో సోనాలిక పడాల, నీలిమ పుండ్ల, సౌమ్య గిరి నిలిచారు.

NNN.jpg

కాన్సాస్ నాట్స్ జాయింట్ కోఆర్డినేటర్ గిరి చుండూరు, నాట్స్ కాన్సస్ కార్యవర్గం సభ్యులు భారతి రెడ్డి, శ్రీనివాస్ అబ్బూరి, శ్రీనివాస్ దామ, కమలాకర్ అనంతనేని, సంతోష్ తల్లాప్రగడ, ప్రకాష్ కుట్టి, భారతి రెడ్డి రియల్ ఎస్టేట్, మంత్రి ఇంక్, ఓటీఎస్‌ఐ, కృష్ణ రియాలిటీ, సోహమ్ సిస్టమ్స్, పక్షి మీడియా, చింకా స్కూల్ ఆఫ్ డ్యాన్స్, కమ్యూనిటీ లెండింగ్ అమెరికా, స్తఫ్ఫింగ్ త్రీ స్థానిక భారతీయ తదితరులు నాట్స్‌కు తమ వంతు విరాళాలు అందించడంతో పాటు పూర్తి సహకారం అందించి ఈవెంట్‌ను జయప్రదం చేశారు. కాన్సాస్‌లో తెలుగమ్మాయి కార్యక్రమం విజయవంతం చేయడంలో పనిచేసిన ప్రతి ఒక్కరికి నాట్స్ చైర్ విమెన్ అరుణ గంటి, నాట్స్ అధ్యక్షులు బాపయ్య చౌదరి(బాపు) నూతి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

NNNN.jpg

Updated Date - 2023-04-28T07:42:10+05:30 IST