TANA: తానా ఆధ్వర్యంలో ‘కథా కేళి’ కథల పోటీలు

ABN , First Publish Date - 2023-05-05T12:24:56+05:30 IST

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా).. తెలుగు భాష, సాహిత్యం మరియు పరివ్యాప్తిపై చేస్తున్న కృషి అనిర్వచనీయం.

TANA: తానా ఆధ్వర్యంలో ‘కథా కేళి’ కథల పోటీలు

TANA: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా).. తెలుగు భాష, సాహిత్యం మరియు పరివ్యాప్తిపై చేస్తున్న కృషి అనిర్వచనీయం. అమెరికాలో నివసిస్తున్న పిల్లలు, పెద్దలకు తెలుగు భాషపై మక్కువ, పటిష్ఠత, అభిరుచి పెంచడంతో పాటు పిల్లలకు భావ ప్రకటన పెంపుదల కోసం ‘తానా - తెలుగు పరివ్యాప్తి కమిటీ’ ఆధ్వర్యంలో ‘కథా కేళి’ కథలు చెప్పే పోటీలు’ నిర్వహిస్తోంది. కథలు చెప్పడం మన ప్రాచీన సంస్కృతి. ఈ ‘కథా కేళి’ పోటీలకు నమూనాగా 100 చిట్టి నీతి కథలను అందరూ సులువుగా చదివి, పోటీకి ప్రిపేర్ అవ్వడానికి అనువుగా పీడీఎఫ్ (pdf) పుస్తక రూపంలో పొందుపరచి ఇవ్వడం జరుగుతుంది. ఇక ఈ పోటీల్లో ఉత్తర అమెరికాలో నివసిస్తున్న వారు ఎవరైనా పాల్గొనవచ్చు. ఈ పోటీలలో పెద్దలతో పాటు వారి పిల్లలను ప్రోత్సహించి భాగస్వాములు చేయవలసిందిగా తానా కోరింది. కాగా, ఈ పోటీలకు దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరు తేది మే 21, 2023. జూన్ 24, 25 తేదీల్లో ఆన్‌లైన్ వేదికగా జూమ్‌లో పోటీలను నిర్వహిస్తారు. దరఖాస్తు మరియు నియమ నిబంధనలు కోసం https://forms.gle/LCwLxCXjSRfubJ6S9 లింక్‌పై క్లిక్ చేయండి.

T.jpg

TTT.jpg

TT.jpg

Updated Date - 2023-05-05T12:24:56+05:30 IST