TS Politics : పొంగులేటి ‘పాలేరు’ నుంచి పోటీచేస్తే తుమ్మల పరిస్థితేంటి.. ఖమ్మం కాంగ్రెస్‌లో ఏం జరుగుతోంది..!?

ABN , First Publish Date - 2023-09-29T20:12:45+05:30 IST

పొంగులేటి.. పొంగులేటి.. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ పేరే వినిపిస్తోంది.. కనిపిస్తోంది కూడా! పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivasa Reddy) ఎక్కడ్నుంచి పోటీచేస్తారు.. అసలు పోటీచేస్తారా.. లేదా..?..

TS Politics : పొంగులేటి ‘పాలేరు’ నుంచి పోటీచేస్తే తుమ్మల పరిస్థితేంటి.. ఖమ్మం కాంగ్రెస్‌లో ఏం జరుగుతోంది..!?

పొంగులేటి.. పొంగులేటి.. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ పేరే వినిపిస్తోంది.. కనిపిస్తోంది కూడా! పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivasa Reddy) ఎక్కడ్నుంచి పోటీచేస్తారు.. అసలు పోటీచేస్తారా.. లేదా..? ఒకవేళ పోటీచేస్తే ఎంపీగానా.. ఎమ్మెల్యేగానా..? ఇప్పుడు ఆయన అభిమానులు, ప్రధాన అనుచరులు.. తెలుగు రాష్ట్రాల్లో వీరాభిమానుల మనసుల్లో మెదులుతున్న ప్రశ్నలివే. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’కి ఎక్స్‌క్లూజివ్‌గా (ABN Andhrajyothy Exclusive) ఓ విషయం తెలిసిందే. ఇంకెందుకు ఆలస్యం.. ఈ ప్రత్యేక కథనం చకచకా చదివేయండి మరి..


Ponguleti Congress.jpeg

ఇదీ అసలు కథ..

‘ఏబీఎన్ ఆంధ్రజ్యోతి’కి తెలిసిన సమాచారం మేరకు రానున్న ఎన్నికల్లో ఖమ్మంకు కూతవేటు దూరంలో ఉన్న పాలేరు నియోజకవర్గం (Palair Constituency) నుంచి ఎమ్మెల్యేగా బరిలోకి దిగుతున్నారని తెలియవచ్చింది. ఎందుకంటే.. పొంగులేటి కాంగ్రెస్ కండువా కప్పుకున్న మరుసటి రోజు నుంచే సామాజిక కార్యక్రమాలు చేపట్టడం, వరుసగా ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేయడం.. ఇక పొంగులేటి సోదరుడు ప్రసాదరెడ్డి, క్యాంప్ కార్యాలయ ఇంచార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి.. ఇద్దరూ పాలేరుకు అన్నీతామై చూసుకోవడం చేస్తున్నారు. ఇక వినాయక చవితి సీజన్ ప్రారంభం మొదలుకుని నిమజ్జనం వరకూ నియోజకవర్గ స్థాయిలో చందాలు అడిగిందే ఆలస్యం ఇచ్చేయడం.. కొన్ని ప్రాంతాల్లో స్వతహాగా పొంగులేటి పర్యటించి చేతికొచ్చినంత డబ్బులు ఇవ్వడం లాంటివి చేస్తూ వచ్చారు. వాస్తవానికి ఈయన ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పలుకుబడి ఉన్నప్పటికీ.. పాలేరులో మాత్రమే ప్రత్యేక చొరవ చూపిస్తుండటంతో తమ అభిమాన నేత ఇక్కడ్నుంచే పోటీచేస్తున్నారని కార్యకర్తలు, అనుచరులు తెగ సంబరపడిపోతున్నారు. వాస్తవానికి ఖమ్మం (Khammam) నుంచి ఎంపీగా లేదా ఎమ్మెల్యేగా.. వీలుకాని పక్షంలో కొత్తగూడెం (Kothagudem) అభ్యర్థిగా ఉంటారని అనుచరులు భావించారు కానీ.. గత నెలన్నర రోజులుగా పాలేరులో జరుగుతున్న రాజకీయ పరిణామాలతో క్లియర్ కట్‌గా సీన్ అందరికీ అర్థమైపోయింది.

Thummala-N.jpg

తుమ్మల పరిస్థితేంటి..?

వాస్తవానికి సత్తుపల్లి తర్వాత పాలేరు నియోజకవర్గం మాజీ మంత్రి, సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావుకు (Thummala Nageswara rao) కంచుకోట లాంటింది. అయితే.. కాంగ్రెస్‌లో చేరిన తుమ్మల ఖమ్మం అసెంబ్లీ (Khammam Assembly) నుంచి పోటీచేయడానికి ఆసక్తి చూపిస్తున్నారట. అభిమానులు, అనుచరుల కోరిక మేరకు పాలేరును వదిలి.. ఖమ్మం నుంచి పోటీచేయాలని భావించి.. ఇదే విషయాన్ని కాంగ్రెస్ హైకమాండ్‌కు చెప్పగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని టాక్. పైగా ఖమ్మంలో తన సామాజిక వర్గం కూడా కలిసొస్తుందన్నది తుమ్మల ప్లానట. మరోవైపు.. మంత్రిగా ఉన్న పువ్వాడ అజయ్‌కు ధీటైన వ్యక్తి తుమ్మల మాత్రమేనని కాంగ్రెస్ అధిష్టానం బలంగా నమ్ముతోందట. దీంతో పొంగులేటి పాలేరు నుంచి పోటీచేయడానికి లైన్ క్లియర్ అయ్యింది. పైగా.. పాలేరులో రెడ్డి సామాజిక వర్గం ఓటు బ్యాంకు కూడా పదిలంగా ఉండటం, కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉండటం కలిసొచ్చే అంశాలని ఢిల్లీ హైకమాండ్ భావిస్తోందట. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. తుమ్మల, పొంగులేటి ఇద్దరి పేర్లు మొదటి జాబితాలోనే ఉంటాయని తెలియవచ్చింది. దీంతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని జిల్లాలోని మరో నాలుగు అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులు కూడా తొలి జాబితాలోనే ఉంటారని సమాచారం.

congress.jpg

మొత్తమ్మీద.. మధిర నుంచి భట్టీ విక్రమార్క, ఖమ్మం నుంచి తుమ్మల, పాలేరు నుంచి పొంగులేటి, భద్రాచలం నుంచి పొదెం వీరయ్యల పేర్లు తొలి అభ్యర్థల జాబితాలో ఉంటాయని తెలుస్తోంది. ఎందుకంటే ఈ నాలుగు నియోజకవర్గాల్లోని అభ్యర్థులు గెలుపు గుర్రాలని.. మిగిలిన నియోజకవర్గాల్లో కాస్త కష్టపడితే కాంగ్రెస్‌కు క్లీన్ స్వీప్ అని హైకమాండ్ గట్టిగా నమ్ముతోందట. పైగా.. జిల్లాలో కీలక నేతలైన తుమ్మల, పొంగులేటి కలయిక అంతా మంచే జరుగుతుందని.. ఇరువురి సామాజిక వర్గం కూడా కలిసొస్తుందని అధిష్టానం నమ్ముతోంది.. మరి ఫైనల్‌గా ఏం జరుగుతుందో..? ఈ ఇద్దరు జిల్లాలో ఎన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ జెండా ఎగరేస్తారో..? అనేది తెలియాలంటే ఎన్నికల ఫలితాల వరకూ వేచి చూడక తప్పదు మరి.

ponguleti-thummala-C.jpg


ఇవి కూడా చదవండి


TS Cabinet : ఇంకా జ్వరంతోనే సీఎం కేసీఆర్.. కేబినెట్ భేటీ వాయిదా


TS Politics : బీఆర్ఎస్‌కు బిగ్ షాక్.. కాంగ్రెస్‌లో చేరిన సిట్టింగ్ ఎమ్మెల్యే, ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు


Jagan Adani : వైఎస్ జగన్ రెడ్డితో అదానీ భేటీ.. ప్రేమతో ఈసారి బిగ్ డీల్..!?


YuvaGalam : నాన్నకు ప్రేమతో.. నారా లోకేష్ యువగళం పాదయాత్ర వాయిదా


CBN Case : చంద్రబాబును మరింత ఇబ్బంది పెట్టేందుకు జగన్ సర్కార్ మరో కుట్ర..!



Updated Date - 2023-09-29T20:20:53+05:30 IST