AP New Governor : ఏపీ కొత్త గవర్నర్‌కు స్వాగతం పలుకుతున్న సవాళ్లు, సమస్యలు.. పక్కా ఆధారాలతో సిద్ధమవుతున్న టీడీపీ.. వైసీపీలో మొదలైన టెన్షన్.. ఎప్పుడేం జరుగునో..!?

ABN , First Publish Date - 2023-02-23T23:03:59+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌కు కొత్త గవర్నర్‌గా (AP New Governer) నియమితులైన అబ్దుల్ నజీర్‌కు (Syed Abdul Nazeer) సమస్యలు, సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయా..? ముఖ్యంగా ఆయన బాధ్యతలు చేపట్టగానే తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన..

AP New Governor : ఏపీ కొత్త గవర్నర్‌కు స్వాగతం పలుకుతున్న సవాళ్లు, సమస్యలు.. పక్కా ఆధారాలతో సిద్ధమవుతున్న టీడీపీ.. వైసీపీలో మొదలైన టెన్షన్.. ఎప్పుడేం జరుగునో..!?

ఆంధ్రప్రదేశ్‌కు కొత్త గవర్నర్‌గా (AP New Governer) నియమితులైన అబ్దుల్ నజీర్‌కు (Syed Abdul Nazeer) సమస్యలు, సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయా..? ముఖ్యంగా ఆయన బాధ్యతలు చేపట్టగానే తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓ ఘటనకు సంబంధించి నివేదిక గవర్నర్‌ టేబుల్ మీదికి వెళ్లనుందా..? ఈ విషయం ముందే తెలుసుకున్న వైసీపీలో (YSR Congress) టెన్షన్ మొదలైందా..? ఒకవేళ ఆ నివేదిక గవర్నర్ దగ్గరికి వెళితే.. ఏం చేయాలి..? ఎలా ముందుకెళ్లాలి..? అనే దానిపై సమాలోచనలు చేసే పనిలో వైసీపీ పడిందా..? అంటే అవుననే అనిపిస్తోంది. ఇంతకీ కొత్త గవర్నర్‌కు ఎదురయ్యే సమస్యలు, సవాళ్లేంటి..? ఆ నివేదిక సంగతేంటి..? అనే విషయాలు ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.

Governer-2.jpg

ఇదీ అసలు కథ..

న్యాయ వ్యవస్థలో పండిపోయిన అబ్దుల్ నజీర్‌కు రాజకీయంగా (Politics) అనుభవం లేకపోవచ్చు కానీ.. ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనే విషయం బాగా తెలుసని ఆయన్ను దగ్గర్నుంచీ చూసిన కొందరు వ్యక్తులు చెబుతున్న మాట. ఇప్పుడు ఏపీలో ఎలాంటి సమస్యలు ఉన్నాయో ప్రత్యేకించి చెప్పడానికేమీ లేదు. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకూ ఏం చేసిందనేది ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారు. వైసీపీ చేస్తున్న అరాచకాలపై మొదటి రోజు నుంచే టీడీపీ పోరాటాలు చేస్తూ.. ముందుకెళ్తోంది. ముఖ్యంగా మూడు రాజధానులు (AP Three Capitals) కాదు.. ఏకైక రాజధానిగా అమరావతే (Amaravati) ఉండాలని టీడీపీ (Telugudesam), అమరావతి రైతులు పెద్దఎత్తునే పోరాటం చేశారు.. ఇంకా చేస్తూనే ఉన్నారు. ఇప్పుడీ వ్యవహారం సుప్రీంకోర్టులో ఉంది. అతి త్వరలోనే సుప్రీం విచారణకు రానుంది. ఈ ప్రక్రియ మధ్యలోనే ఉండటంతో, గవర్నర్ నిర్ణయాలు కీలకంగా మారనున్నాయి. మరోవైపు.. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు ఉండటంతో ఇవన్నీ గవర్నర్‌కు సవాల్‌గా మారబోతున్నాయని చెప్పుకోవచ్చు. ఈ మొత్తం వ్యవహారాల్లో గవర్నర్ పాత్ర కీలకంగా మారబోతోంది.

Governer-1.jpg

మొదట ఇలా..!

ఇవన్నీ ఒక ఎత్తయితే.. ఇటీవల గన్నవరం టీడీపీ ఆఫీసుపై (Gannavaram TDP Office) జరిగిన దాడి ఘటన తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) సంచలనమే సృష్టించింది. మొదట ఈ ఘటన గురించే గవర్నర్‌కు ఫిర్యాదు చేయాలని టీడీపీ భావిస్తోందట. శుక్రవారం నాడు గన్నవరం నియోజకవర్గంలో చంద్రబాబు (Chandrababu)పర్యటించనున్నారు. వైసీపీ కార్యకర్తలు ధ్వంసం చేసిన టీడీపీ కార్యాలయాన్ని పరిశీలించనున్నారు. అనంతరం వైసీపీ నాయకుల చేతిలో దాడి, అక్రమ కేసుల్లో జైలు పాలైన రామినేని రమేష్‌ , దొంతు చిన్నాల కుటుంబ సభ్యులను చంద్రబాబు పరామర్శిస్తారు. అదే రోజు సాయంత్రం టీడీపీ ముఖ్యనేతలతో సమావేశమై ఈ ఘటన గురించి ఓ నివేదిక తయారు చేసి.. పక్కాగా వీడియోలు, ఫొటోలు ఆధారాలుగా చూపి పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్న తీరును కళ్లకు కట్టినట్లు చూపించాలని టీడీపీ అనుకుంటోందట. అంతేకాదు.. దాడులు చేయడంతో పాటు బాధితులపైనే కేసులు నమోదు చేయడాన్ని కూడా కొత్త గవర్నర్ దృష్టికి తేవాలని టీడీపీ నేతలు నిర్ణయించారట. అంటే అబ్దుల్ నజీర్ బాధ్యతలు చేపట్టగానే గన్నవరం ఘటనే ఆయన టేబుల్ మీదికి వెళ్లనుందన్న మాట.

Ganna-04.jpg

ఏ నిర్ణయం తీసుకుంటారో..!

అబ్దుల్ సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా పనిచేసి ఉండటం, ఆయన దృష్టికి వచ్చే తొలి సమస్యే శాంతి భద్రతలకు సంబంధించి కావడంతో గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారా..? అని ఏపీ ప్రజలు సర్వత్రా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు.. తమకు కచ్చితంగా న్యాయచేస్తారని విపక్ష పార్టీలు నమ్ముతున్నాయి. ఈ ఒక్కటే కాదు.. ఏపీలో అసలేం జరుగుతోంది..? వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు, కూల్చివేతలు మొదలుకుని ఇప్పటి వరకూ ఏం జరిగిందనేది స్పష్టంగా వరుస నివేదికలను టీడీపీ సిద్ధం చేసి గవర్నర్‌కు ఇవ్వాలని టీడీపీ భావిస్తోందట.

Gannavaram.jpg

కొరడా ఝళిపిస్తారా..?

గత గవర్నర్‌ భిశ్వభూషన్ హరిచందన్.. (Biswabhusan Harichandan) వైసీపీకి అనుకూలంగా వ్యవహరించారనే ఆరోపణలు చాలానే వచ్చాయి. దీంతో టీడీపీ ఏం ఫిర్యాదు చేసినా పెద్దగా పట్టించుకోలేదని ఆ పార్టీ నేతలు మీడియా ముందే వెల్లడించారు. అయితే కొత్త గవర్నర్ దృష్టికి ఏ సమస్యలు తెచ్చినా శ్రద్ధగా విని సానుకూలంగా స్పందిస్తారనే గట్టి నమ్మకంతో టీడీపీ నేతలు ఉన్నారని తెలుస్తోంది. రూల్ ప్రకారం పాలన లేకుంటే.. న్యాయపరంగా జగన్ ప్రభుత్వం ముందుకెళ్లకపోతే కచ్చితంగా కొరడా ఝళిపించే అవకాశాలూ మెండుగానే ఉన్నాయి. ముఖ్యంగా.. ఏపీ గవర్నర్‌గా అబ్దుల్ నజీర్‌ను కేంద్రం ప్రకటించగానే ఏపీ ముఖ్య నేతలు కొందరు ఢిల్లీకెళ్లి మరీ కలవడానికి పోటీ పడ్డారట. ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ సౌరబ్ గౌర్, రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు (MP Raghu Rama Krishnam Raju ), ఎంపీ విజయసాయిరెడ్డితో (MP Vijayasai Reddy ) తప్ప ఎవర్నీ కలవడానికి ఛాన్స్ ఇవ్వలేదట. దీంతో గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టక ముందే తానేంటో, తన ప్రాధాన్యతలేంటో చెప్పకనే స్పష్టంగా చెప్పేశారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తునే చర్చ జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏపీ ప్రభుత్వంపై.. కొత్త గవర్నర్ ఎలా వ్యవహరించబోతున్నారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.

Governer-4.jpg

మొత్తానికి చూస్తే.. గన్నవరం వ్యవహారం ఇప్పుడు పెద్ద చర్చకే దారితీసేలా ఉంది. అటు టీడీపీ నివేదికలతో రెడీ అవుతోందన్న విషయం ముందే పసిగట్టిన ఇంటలిజెన్స్ ప్రభుత్వానికి చేరవేసిందట. దీంతో కౌంటర్‌గా ఏం చేస్తే బాగుంటుంది..? అసలు ఈ గవర్నర్ ప్రభుత్వంతో ఎలా ఉంటారు..? అని సమాలోచనలు చేసే పనిలో జగన్ సర్కార్ నిమగ్నమయ్యిందట. గవర్నర్‌కు ఫిర్యాదు వెళితే.. ఆయన ఏం తీసుకుంటారు..? ప్రభుత్వంపై ఎలా రియాక్ట్ అవ్వబోతున్నారనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే మరి.

Governer-and-babu.jpg

**********************************

ఇవి కూడా చదవండి

**********************************

Kanna Joined TDP : కన్నా టీడీపీలో చేరిన కొన్ని గంటల్లోనే చంద్రబాబు కీలక బాధ్యతలు అప్పగించారా.. ఆయనకు ఇచ్చిన హామీ ఇదేనా.. !?


**********************************

Lokesh YuvaGalam : మీసం మెలేసి చెబుతున్నా.. ఒక్కొక్కడికీ ప‌గిలిపోద్ది.. నారా లోకేష్ ఛాలెంజ్

**********************************

Warangal KMC: సీనియర్ల వేధింపులు.. విషపు ఇంజక్షన్ తీసుకున్న కేఎంసీ మెడికో

**********************************

Telugudesam : TDP లో చేరేందుకు సిద్ధమైన ప్రముఖ విద్యాసంస్థల అధినేత.. గతంలో జస్ట్ మిస్ట్.. ఈసారి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ప్లాన్.. వర్కవుట్ అయ్యేనా..!?

**********************************

TS Congress : రేవంత్‌రెడ్డిపై కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు.. టీపీసీసీ చీఫ్ రియాక్షన్ ఇదీ.. ఈ కామెంట్స్‌తో కాంగ్రెస్‌లో ఒక్కసారిగా..!

**********************************

Telugudesam : టీడీపీలో చేరబోతున్న కన్నాపై వైసీపీకి ఎందుకింత పైత్యం.. ఏపీ మంత్రి ఇంత మాట అనేశారేంటి..!

**********************************

YSRCP ALI : ఆ నాలుగు నియోజకవర్గాలపై అలీ కన్ను.. సొంతంగా సర్వేలు.. టికెట్ ఇస్తే చాలు గెలిచేస్తానని ధీమా.. అన్నీ సరే అయ్యే పనేనా..!?
**********************************

AP BJP : కన్నా లక్ష్మీనారాయణ బాటలో మరో కీలకనేత అడుగులు.. బీజేపీకి గుడ్ బై చెప్పేస్తారా..!?

**********************************

YSRCP MLC Candidates : లక్ అంటే ఈయనదే.. వైసీపీలో చేరిన రెండ్రోజులకే ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించిన YS Jagan.. ఓహో అసలు ప్లాన్ ఇదా..!


**********************************

MLC Candidates: వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన.. మర్రి రాజశేఖర్‌కు ఎన్నాళ్లకెన్నాళ్లకు ! లిస్ట్ ఇదే..


**********************************

#RIPTarakaRatna : నందమూరి తారకరత్న పాత జ్ఞాపకాలు.. ఈ వీడియో చూస్తే ఎవరికైనా కన్నీరు ఆగదు..!

**********************************

BRS : బీఆర్ఎస్‌ను వెంటాడుతున్న విషాదాలు.. సాయన్న మరణవార్త మరువకముందే మరో సీనియర్ నేత కన్నుమూత..


**********************************

MLA Sayanna: గుండెపోటుతో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సాయన్న మృతి


**********************************

#RIPTarakaRatna : రాజకీయాలను పక్కనపెట్టి నందమూరి తారకరత్న ఇంటికి వైఎస్ షర్మిల..

**********************************

TarakaRatna : తారకరత్నను ఐసీయూలో పరామర్శించిన మాజీ మంత్రి.. బయటికొచ్చాక...!


**********************************

Taraka Ratna Death : బాలయ్యా.. మీరు సూపరయ్యా.. తారకరత్న కోసం నిద్రాహారాలు మాని.. దండం పెడుతున్న ఫ్యాన్స్.. రూపాయితో సహా..!


**********************************

TarakaRatna : ఎమ్మెల్యేగా పోటీచేయాలనుకున్న తారకరత్న... చంద్రబాబు, లోకేష్‌తో కూడా చర్చ.. అయ్యో పాపం చివరికోరిక తీరకుండానే..!

**********************************

Updated Date - 2023-02-23T23:33:18+05:30 IST