Weather Politics: వాతావరణానికి, రాజకీయాలకు సంబంధం ఉందా?

ABN , First Publish Date - 2023-07-20T13:18:33+05:30 IST

వాతావరణం రానున్న ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకుల అంచనా. వాతావరణ పరిస్థితుల కారణంగా దేశవ్యాప్తంగా నిత్యావసరాల ధరలు మంట పుట్టిస్తున్నాయి. మార్కెట్‌లో ఎలాంటి కూరగాయలు కొన్నాలన్నా కేజీ రూ.60కి పైగా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. రూ.100 ఖర్చు చేసినా గంపెడు కూరగాయలు కూడా రావడం లేదు. అటు బియ్యం ధరలు కూడా పెరిగిపోయాయి. దీంతో సామాన్యులు అల్లాడిపోతున్నారు. ప్రభుత్వాలు ఎన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా నిత్యావసరాల ధరలు తగ్గకపోతే ప్రజలు తమ ఓటు ఆయుధంతోనే ఎన్నికల్లో సమాధానం చెప్తారని గతంలో పలు మార్లు రుజువైంది.

Weather Politics: వాతావరణానికి, రాజకీయాలకు సంబంధం ఉందా?

దేశవ్యాప్తంగా ప్రస్తుతం వాతావరణంపైనే ఎక్కువగా చర్చ నడుస్తోంది. భారీ వర్షాల కారణంగా ఉత్తర భారత దేశం అతలాకుతలం అవుతోంది. ఉత్తరాది నుంచి దక్షిణాదికి దిగుమతి కావాల్సిన పండ్లు, కూరగాయాలు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో ఇతర దేశాల నుంచి వాటిని కేంద్ర ప్రభుత్వం దిగుమతి చేసుకుంటుండటంతో ధరలు రికార్డు స్థాయిలో పెరిగాయి. వర్షాల కారణంగా చాలా ప్రాంతాల్లో పంటలు పాడైపోవడంతో కూరగాయల ధరలకు రెక్కలు వచ్చాయి.

వాతావరణ పరిస్థితుల కారణంగా దేశవ్యాప్తంగా నిత్యావసరాల ధరలు మంట పుట్టిస్తున్నాయి. మార్కెట్‌లో ఎలాంటి కూరగాయలు కొన్నాలన్నా కేజీ రూ.60కి పైగా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. రూ.100 ఖర్చు చేసినా గంపెడు కూరగాయలు కూడా రావడం లేదు. అటు బియ్యం ధరలు కూడా పెరిగిపోయాయి. దీంతో సామాన్యులు అల్లాడిపోతున్నారు. తమకు వచ్చే సంపాదనతో మధ్యతరగతి ప్రజలు, పేదవాళ్లు కూరగాయలు కొనలేక నచ్చింది తినలేక సర్దుకుపోతున్నారు. చివరకు నిత్యావసరాల ధరల ఎఫెక్ట్ ప్రభుత్వాలపై పడింది. ఇప్పటికే కొండెక్కిన టమోటా ధరలను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. పెట్రోల్ కంటే ఎక్కువ ధర పలుకుతున్న టమోటాలను చౌకగా అందించేందుకు చర్యలు చేపట్టింది. గతంలో టమోటాలను పండించిన రైతులకు రవాణా ఛార్జీలు కూడా వచ్చే పరిస్థితులు ఉండేవి కావు. దీంతో లారీల లోడు టమోటాలను రోడ్డుపైనే రైతులు పారబోసిన దృశ్యాలను ఇంకా మరిచిపోలేం. అలాంటిది ఇప్పుడు టమోటాలకు కొరత ఏర్పడటంతో గిరాకీ ఏర్పడింది. ధరల పెరుగుదల కారణంగా దేశంలో 65 శాతం మంది టమోటాలను కొనుగోలు చేసేందుకు ఇష్టపడటం లేదని ఓ సర్వేలో తేలింది.


ఈ నేపథ్యంలో వాతావరణానికి, రాజకీయాలకు సంబంధం ఉంటుందా అనే అంశం మరోసారి తెరపైకి వచ్చింది. 2001-03 మధ్య కాలంలో ఉమ్మడి ఏపీలో కరువు తాండవించడంతో 2004 ఎన్నికల్లో అప్పటి టీడీపీ ప్రభుత్వంపై చాలా ఎఫెక్ట్ చూపించింది. చంద్రబాబు సర్కారు ఎంత అభివృద్ధి చేసి చూపించినా తెలుగు ప్రజలు మాత్రం కరువును మరిచిపోలేకపోయారు. ఇప్పటికీ విపక్షాలు అప్పటి పరిస్థితులను అడ్డం పెట్టుకుని టీడీపీపై విమర్శలు చేస్తుంటాయి. అలాగే 2013లో విపరీతంగా పెరిగిన ధరలు కూడా అప్పటి యూపీఏ ప్రభుత్వంపై తీవ్ర ప్రభావం చూపించాయి. ఈ ఎఫెక్ట్ కారణంగా 2014లో ఏకంగా ఎన్డీఏ ప్రభుత్వానికి ప్రజలు బంపర్ మెజారిటీ అందించారు. అంతేకాకుండా 2020లో హైదరాబాద్‌లో జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కూడా వాతావరణం తీవ్ర ప్రభావం చూపింది. భారీ వర్షాలు, వరదల కారణంగా నగరమంతా నీళ్లలో చిక్కుకుపోవడంతో ప్రజలు అష్టకష్టాలు పడ్డారు. దీంతో ఆ తర్వాత వచ్చిన ఎన్నికల్లో కేసీఆర్ ప్రభుత్వంపై వ్యతిరేకత చూపించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు చాలా చోట్ల ఓడిపోయారు. 2016లో 99 స్థానాలను కైవసం చూసుకున్న కేసీఆర్ పార్టీ 2020లో కేవలం 43 స్థానాలకు కోల్పోయి కేవలం 56 స్థానాలకు మాత్రమే పరిమితమైంది.

కట్ చేస్తే ఇప్పుడు కూడా వాతావరణం రానున్న ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకుల అంచనా. గత ఏడాది రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం కారణంగా నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని తాకాయి. ముఖ్యంగా పెట్రోల్ ధరలు భారీగా పెరిగాయి. వంటనూనె ధరలు కూడా రూ.200 దాటి పరుగులు తీశాయి. ఆ సమయంలో పలు రాష్ట్రాలలో ఎన్నికలు రావడంతో మోదీ ప్రభుత్వం రంగంలోకి దిగి పెట్రోల్ ధరలను తగ్గించడంతో పాటు నిత్యావసర ధరల నియంత్రణకు చర్యలు తీసుకుంది. అయినా ఇప్పటికీ ధరల విషయంలో పెద్దగా వ్యత్యాసం లేదనేది సామాన్యుల మాటగా వినిపిస్తోంది. మరోవైపు పాల ధరలు నెలనెలా పెరుగుతున్నా పట్టించుకునే నాథుడే లేడు. దీంతో చిన్నారులకు పాలు అందించలేని పరిస్థితి దాపురించింది. ఏపీలో అయితే పాల ధరల విషయంలో జగన్ సర్కారు వ్యవహరిస్తున్న వైఖరిపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. ఫైనల్‌గా ప్రభుత్వాలు ఎన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా నిత్యావసరాల ధరలు తగ్గకపోతే ప్రజలు తమ ఓటు ఆయుధంతోనే ఎన్నికల్లో సమాధానం చెప్తారని గతంలో పలు మార్లు రుజువైంది.

తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే భారీ వర్షాల కారణంగా ఇటీవల రోడ్లు అధ్వాన్నంగా తయారయ్యాయి. దీంతో వాహనదారులు పడే ఇక్కట్లు వర్ణణాతీతం అనే చెప్పాలి. ముఖ్యంగా ఏపీలో అయితే జగన్ ప్రభుత్వం రోడ్ల విషయంలో అశ్రద్ధ వహిస్తోంది. చాలా చోట్ల రోడ్లు సరిగ్గా లేకపోవడంతో ప్రజా జీవితం అస్తవ్యస్తంగా తయారైంది. ప్రతి ఏడాది ఆర్అండ్‌బీ శాఖపై సమీక్ష సమయంలో రోడ్లు వేస్తామని సీఎం జగన్ బీరాలు పలికినా అది కాగితాలకే పరిమితం అవుతోంది. దీంతో ప్రభుత్వ తీరుపై ప్రజలు మండిపడుతున్నారు. ఈ ప్రభావం కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో పడుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తంగా చూస్తే వాతావరణానికి, రాజకీయాలకు అవినాభావ సంబంధం ఉంటుందని.. వచ్చే ఎన్నికల్లో కూడా ఎన్నికల ఫలితాలపై వాతావరణ ప్రభావం ఉంటుందని రాజకీయ పండితులు స్పష్టం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

AP Politics: పల్నాడు రాజకీయాల్లో హాట్ టాపిక్.. ఆ ఎంపీ వైసీపీకి షాక్ ఇవ్వబోతున్నారా?

AP Politics: లోకేష్‌కు భయపడుతున్న వైసీపీ.. అందుకే ఎన్టీఆర్ ప్రస్తావన తెస్తోందా?

Updated Date - 2023-07-20T13:18:33+05:30 IST