TS Politics : మోదీ హైదరాబాద్ వచ్చినా ఎక్కడా కనిపించని రాములమ్మ.. ఎందుకా అని ఆరా తీస్తే..!

ABN , First Publish Date - 2023-04-11T21:21:59+05:30 IST

రాములమ్మ ఎందుకింత అసంతృప్తితో రగిలిపోతున్నారు..? ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్‌కు వచ్చినా ఆమె ఎందుకు కనిపించలేదు..?

TS Politics : మోదీ హైదరాబాద్ వచ్చినా ఎక్కడా కనిపించని రాములమ్మ.. ఎందుకా అని ఆరా తీస్తే..!

మాజీ ఎంపీ విజయశాంతి (Vijayashanti) అలియాస్ రాములమ్మ (Ramulamma) బీజేపీలో (TS BJP) తీవ్ర అసంతృప్తిగా ఉంటున్నారా..? కేంద్రంలోని మోదీ సర్కార్, రాష్ట్ర నాయకత్వం పనులు రాములమ్మకు రుచించడం లేదా..? ఇందుకు చాలా కారణాలే ఉన్నాయా..? తన సేవలను సరైన రీతిలో వినియోగించుకోవట్లేదని భావనతో ఆమె ఉన్నారా..? కాంగ్రెస్‌ను కాదనుకొని వచ్చి కాషాయ తీర్థం పుచ్చుకున్న విజయశాంతి కమలనాథుల పాలి‘ట్రిక్స్’తో సతమతం అవుతున్నారా..? తాజా పరిణామాలను చూస్తే ఇవే అక్షరాలా నిజమనిపిస్తోంది. ఇంతకీ రాములమ్మ ఎందుకింత అసంతృప్తితో రగిలిపోతున్నారు..? ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్‌కు వచ్చినా ఆమె ఎందుకు కనిపించలేదు..? అనే ఇంట్రెస్టింగ్ విషయాలపై ప్రత్యేక కథనం.

Ramulamma.jpg

అసలు కథ ఇదేనా..!?

ఎప్పుడూ నవ్వుతూ, జోరుగా, హుషారుగా ఉంటూ పార్టీ కార్యకర్తలు, ప్రజలతో ఇట్టే కలిసిపోయే రాములమ్మ ఎందుకో సైలెంట్ అయ్యారు. ఏం జరిగిందబ్బా..? అని ఆమె అభిమానులు, కార్యకర్తలు, అనుచరులు ఆలోచనలో పడ్డారు. చాలా రోజులుగా మీడియా ముందుకు రాకపోవడం.. కనీసం పార్టీ కార్యక్రమాల్లో కూడా కనిపించకపోవడంతో అటు మీడియాలో.. ఇటు సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో కథనాలు వస్తున్నాయి. సరిగ్గా ఇదే సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనకు (Modi Telangana Tour) వచ్చారు. ‘వందేభారత్’ ఎక్స్‌ప్రెస్‌ను (Vande Bharat Express) ప్రారంభించడంతో పాటు 11వేల కోట్లకుపైగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు కూడా చేశారు. ఇంత పెద్ద కార్యక్రమం జరిగితే రాములమ్మ ఎక్కడా కనిపించలేదు. పోనీ మోదీ టూర్ అనంతరం ప్రధాని చేపట్టిన కార్యక్రమాల గురించి బీజేపీ పెద్దలు మాట్లాడారు కానీ.. ఇక్కడా విజయశాంతి కనిపించలేదు. అయితే విశ్వసనీయవర్గాల సమాచారం మేరకు రాష్ట్ర, కేంద్ర నాయకత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారని తెలుస్తోంది.

మరీ ముఖ్యంగా.. ఓ వైపు కేంద్ర ప్రభుత్వం సింగరేణిని ప్రయివేటీకరణ (Singareni Privatization) అంటూ వార్తలు వస్తుండటం, మరోవైపు సింగరేణిలోని నాలుగు బొగ్గు బ్లాకులకు మరోసారి వేలం పెట్టడంపై రాములమ్మ అసంతృప్తిగా ఉన్నారట. సింగరేణిని ప్రైవేటీకరణను చేసే కుట్రలకు తెరలేపిందని బీఆర్ఎస్ ప్రభుత్వం, సింగరేణి కార్మికులు నిరసనలు, ఆందోళనలు చేపడుతున్నారు. తెలంగాణకు పెద్దగా చేసిందేమీ లేకపోగా.. ఉన్నవాటిని ఇలా ప్రైవేటీకరణ చేయడమేంటి..? సింగరేణ మీద లక్షలాది కార్మికుల కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయన్న విషయం తెలిసిందే. కేంద్రం నిర్ణయాన్ని కార్మిక లోకం తీవ్రంగా వ్యతిరేకిస్తుండటం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు, ఈ ప్రాంత ప్రజల కోసం అనేక పోరాటాలు, ఉద్యమాలు చేసిన నాయకురాలిగా విజయశాంతి కార్మికుల వైపే నిలబడటం న్యాయం అని గట్టిగా నిర్ణయించుకున్నారట. అందుకే మోదీ సభకు దూరంగా ఉండి తన అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం.

Ramulamma-1.jpg

చాలా రోజులుగా ఇలా..!

కాషాయ కండువా కప్పుకున్నాక బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలిగా రాములమ్మకు అధిష్ఠానం పదవి ఇచ్చింది. అయితే ఆ పదవి పెద్దగా ప్రాధాన్యత లేనిదని ఆమె భావిస్తున్నారట. అంతేకాకుండా తెలంగాణలో తన సేవలను సరిగ్గా వినియోగించుకోలేదని చాలా రోజులుగా అసంతృప్తితో ఉన్నారని టాక్ నడుస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్‌ (Congress) పార్టీలో తనకు మంచి విలువ, ప్రాధాన్యత ఉన్నప్పటికీ బీజేపీలో చేరిన రాములమ్మ కాషాయ పార్టీలో పరిస్థితులు అస్సలు నచ్చట్లేదట. ఆ మధ్య పార్టీ రాష్ట్ర నాయకత్వం తన పట్ల చూపుతున్న ఓ విధమైన అలసత్వమో, నిర్లక్ష్యమో మొత్తానికి తెలియదు కానీ, పార్టీ రాష్ట్ర నాయకత్వంపై మీడియా వేదికగానే అసంతృప్తిని వ్యక్తం చేశారు. అసలు తనను ఎందుకు మీడియాతో మాట్లాడనివ్వలేదో తెలియదని.. తాను అసంతృప్తిగా ఉన్నానో, లేనో పార్టీ నేతలు క్లారిటీ ఇస్తారని అన్నారు. అయితే రాములమ్మను చూసి అభద్రతగా ఫీలయ్యే వాళ్లు ఎవరు..? అనే విషయానికి మాత్రం ఇంతవరకూ సమాధానం రాలేదు. వాస్తవానికి విజయశాంతి మీడియా ముందుకొచ్చినా రాకపోయినా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న తప్పులను నిత్యం సోషల్ మీడియా వేదికగా తూర్పారబడుతూ, ప్రజా సమస్యలపై పోరాడుతూనే వస్తున్నారు.

Modi-Tour-OVer.jpg

మొత్తానికి చూస్తే.. ఇప్పుడున్న తెలంగాణ బీజేపీలో పరిస్థితులను బట్టి చూస్తే కచ్చితంగా విజయశాంతి తీవ్ర అసంతృప్తితో ఉన్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. విజయశాంతి రాజకీయ ప్రస్తానాన్ని గమనిస్తే... బీజేపీతో రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన ఆమె తెలంగాణ ఉద్యమంలోకి దిగాక స్థాపించిన తల్లి తెలంగాణ పార్టీని అప్పట్లో టీఆర్ఎస్ పార్టీలో విలీనం చేశారు. కొద్దిరోజుల తర్వాత తనకు గులాబీ బాస్ కేసీఆర్ ప్రాధాన్యతను తగ్గించారని ఆరోపణలు చేశారు. ఆ తర్వాత పార్టీ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొంటున్నారని అధిష్ఠానం ఆమెను సస్పెండ్ చేసింది. ఆ తర్వాత రాములమ్మ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. హస్తం పార్టీలో పరిస్థితులు నచ్చక కాషాయ కండువా కప్పుకున్నారు. ఏ పార్టీలోకి వెళ్లినా విజయశాంతికి మాత్రం కష్టాలు తప్పట్లేదనే విషయాన్ని ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. బీజేపీలోని తాజా పరిస్థితుల మధ్య రాములమ్మ తన పొలిటికల్ ఫ్యూచర్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.

*****************************

ఇవి కూడా చదవండి..

*****************************

Bandi Sanjay Vs Ranganath : బండి సంజయ్‌ చేసిన ప్రతి ఆరోపణకు స్ట్రాంగ్ రియాక్షనిస్తూ.. ఛాలెంజ్ చేసిన సీపీ రంగనాథ్..

*****************************

Ponguleti : మరికొన్ని గంటల్లో పొలిటికల్ ఫ్యూచర్ తేల్చేయనున్న పొంగులేటి.. ఆ తర్వాత నేరుగా ఢిల్లీకెళ్లి..!

*****************************

TS Politics : పొంగులేటి, జూపల్లికి టచ్‌లోకి వెళ్లిన బీజేపీ.. సరిగ్గా ఇదే టైమ్‌లో రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

*****************************

TS Politics : పొంగులేటి, జూపల్లి అడుగులు ఎటువైపు.. ఇద్దరి దారి ఒకటేనా.. వేర్వేరా.. టచ్‌లోకి వెళ్లిందెవరు..!

*****************************

Kiran Reddy : కిరణ్ రెడ్డిని ఒప్పించి దగ్గరుండి బీజేపీలో చేర్చింది.. కథ మొత్తం నడిపింది ఈయనే..!

*****************************

Updated Date - 2023-04-11T22:46:33+05:30 IST