TS Politics : పొంగులేటి, జూపల్లికి టచ్‌లోకి వెళ్లిన బీజేపీ.. సరిగ్గా ఇదే టైమ్‌లో రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2023-04-10T19:33:48+05:30 IST

బీఆర్ఎస్ (BRS) నుంచి సస్పెండ్ అయిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (onguleti Srinivasa Reddy) , మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుల...

TS Politics : పొంగులేటి, జూపల్లికి టచ్‌లోకి వెళ్లిన బీజేపీ.. సరిగ్గా ఇదే టైమ్‌లో రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

బీఆర్ఎస్ (BRS) నుంచి సస్పెండ్ అయిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivasa Reddy) , మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుల (Jupally Krishna Rao) గురించి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (TPCC Chief Revanth Reddy) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పొంగులేటి, జూపల్లికి బీజేపీ (BJP) పెద్దలు టచ్‌లోకి వెళ్లారన్న వార్తలు వస్తున్న టైమ్‌లో రేవంత్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. సోమవారం నాడు హైదరాబాద్‌లో మీడియా మీట్ నిర్వహించిన రేవంత్.. ఆ ఇద్దరు నేతలతో పాటు పలు విషయాలను ప్రస్తావనకు తెచ్చారు. కేసీఆర్ (CM KCR) చేతిలో మోసపోయిన వారికి నేను సానుభూతి తెలియజేస్తున్నాను. జూపల్లి, పొంగులేటి కేసీఆర్‌ను నమ్మి మాజీలు అయ్యారు. బీఆర్ఎస్ కోటకు బీటలు వారాయి. ఇద్దరూ తిరుగుబాటు జెండా ఎగరేశారు. ఇంకా చాలామంది ఉన్నారు పొంగులేటి, జూపల్లి ఇద్దరూ ఎటు వెళ్తారో చూద్దాం. ఎవరు, ఎవరి దగ్గరకు వస్తారో కాలమే నిర్ణయిస్తుంది. జూపల్లి, పొంగులేటి ఇద్దరూ నాకు మిత్రులు. కేసీఆర్ జాతీయ స్థాయిలో ప్రతిపక్షాల కూటమికి నాయకత్వం వహించాలని కేసిఆర్ ఆసక్తిగా ఉన్నట్లు రాజ్ దీప్ చెప్పారు. బాధ్యతలు ఇస్తే రాబోయే ఎన్నికల్లో ఖర్చులు భరిస్తామని ఆఫర్ చేసినట్లు చెప్పారు. అందుకోసం పార్టీల వద్దకు వెళ్లి బేరసారాలు చేస్తున్నారుఅని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

ఓహో ఇందుకేనా..!

బీఆర్ఎస్‌తో ఈ ఇద్దరి బంధం తెగిపోయిన తర్వాత కాంగ్రెస్ పెద్దలు టచ్‌లోకి వెళ్లారని వార్తలు గుప్పుమన్నాయి. ఆ తర్వాత అటు పొంగులేటికి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ టచ్‌లోకి వెళ్లగా.. ఇటు జూపల్లిని డీకే అరుణ డైరెక్టుగా వెళ్లి బీజేపీలోకి రావాలని ఆహ్వానించారు. పొంగులేటి చాలా రోజులుగా బీజేపీ పెద్దలతో టచ్‌లో ఉన్నారని ఆ పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. అయితే కేడర్ మాత్రం కాంగ్రెస్‌లో చేరాలని పొంగులేటిపై ఒత్తిడి తెస్తోంది. ఇటు జూపల్లి మూలాలు కూడా కాంగ్రెస్‌వే కాబట్టి ఆయన హస్తం పార్టీవైపే చూస్తున్నారని వార్తలు వస్తున్నాయి. దీంతో ఈ ఇద్దరూ కూడా కాంగ్రెస్‌లో చేరతారని పార్టీ నాయకత్వం ధీమా వ్యక్తం చేస్తోంది. పైగా రేవంత్ రెడ్డి కూడా ఇద్దరూ మిత్రులేననడం, ఎటు వెళ్తారో చూద్దాం అనడాన్ని బట్టి చూస్తే లోలోపల ఏదో జరుగుతోందని స్పష్టంగా అర్థమవుతోంది. కచ్చితంగా ఆ ఇద్దరూ కాంగ్రెస్‌లోనే చేరతారు కాబట్టి రేవంత్ ఇలా కామెంట్స్ చేశారని కూడా వార్తలు వస్తున్నాయి.

ఒకవేళ ఇదేగానీ జరిగితే ఖమ్మం, మహబూబ్‌నగర్‌లో కాంగ్రెస్‌కు మంచిరోజులు వచ్చినట్లేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే రెండు మూడ్రోజుల్లో భవిష్యత్ కార్యాచరణ ప్రకటించాలనే యోచనలో పొంగులేటి ఉన్నారు. ఇటు జూపల్లి కూడా రేపో, మాపో కార్యకర్తలు, అభిమానులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించబోతున్నారని తెలుస్తోంది. ఫైనల్‌గా పొంగులేటి, జూపల్లి ఎటువైపు అడుగులేస్తారో.. ఇద్దరూ వేర్వేరు పార్టీలో చేరుతారా లేకుంటే ఒకే పార్టీలో చేరతారా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడక తప్పదు.

*****************************

ఇవి కూడా చదవండి..

*****************************

TS Politics : పొంగులేటి, జూపల్లి అడుగులు ఎటువైపు.. ఇద్దరి దారి ఒకటేనా.. వేర్వేరా.. టచ్‌లోకి వెళ్లిందెవరు..!

*****************************

Kiran Reddy : కిరణ్ రెడ్డిని ఒప్పించి దగ్గరుండి బీజేపీలో చేర్చింది.. కథ మొత్తం నడిపింది ఈయనే..!

*****************************

Kiran Reddy : ఢిల్లీలో బిజిబిజీగా కిరణ్ రెడ్డి.. కీలక పదవి ఇవ్వబోతున్నారా.. పోటీ ఎక్కడ్నుంచో..!?


*****************************

Kiran Reddy : ఏపీలో బీజేపీకి ఆశా ‘కిరణ్’మా.. ఈయన్ను పార్టీ ఎలా వాడుకోబోతోంది.. అధిష్ఠానం ప్లానేంటి..!?


*****************************

Updated Date - 2023-04-10T21:46:19+05:30 IST