YSRCP : ప్రత్యక్ష రాజకీయాలకు చెవిరెడ్డి గుడ్ బై.. నెక్స్ట్ ఏం చేయబోతున్నారు.. ఓహో ఇందుకేనా..!?

ABN , First Publish Date - 2023-04-02T23:07:05+05:30 IST

వైసీపీ కీలక నేతల్లో ఒకరైన ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి (Chevireddy Bhaskar Reddy) ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నట్లు కీలక ప్రకటన చేశారు. చంద్రగిరి నుంచి తన కుమారుడు మోహిత్ రెడ్డి

YSRCP : ప్రత్యక్ష రాజకీయాలకు చెవిరెడ్డి గుడ్ బై.. నెక్స్ట్ ఏం చేయబోతున్నారు.. ఓహో ఇందుకేనా..!?

వైసీపీ కీలక నేతల్లో ఒకరైన ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి (Chevireddy Bhaskar Reddy) ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నట్లు కీలక ప్రకటన చేశారు. చంద్రగిరి నుంచి తన కుమారుడు మోహిత్ రెడ్డి (Chevireddy Mohit Reddy) ఎమ్మెల్యేగా పోటీచేస్తారని స్వయంగా చెవిరెడ్డే ప్రకటించారు. ఆదివారం నాడు నిర్వహించిన వైసీపీ (YSR Congress) నాయకులు, కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో ఎవరూ ఊహించని రీతిలో తన కుమారుడ్ని అభ్యర్థిగా ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. కుమారుడు రాజకీయాల్లోకి వస్తున్నారు సరే.. నెక్స్ట్ చెవిరెడ్డి ఏం చేయబోతున్నారు..? ఈయనకు జగన్ ఏ బాధ్యతలు అప్పగిస్తారు..? రాజకీయంగా ప్రాధాన్యత ఉండే పదవి ఉంటుందా.. లేకుంటే మరేదైనా కీలక బాధ్యతలు..? ఉంటాయా..? అనేది ఇప్పుడు అటు చంద్రగిరి నియోజకవర్గంతో పాటు.. ఏపీ రాజకీయాల్లో చర్చ నడుస్తోంది.

Chevi-Reddy.jpg

చెవిరెడ్డి బాధ్యతలు ఇవే..!

చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థిగా కుమారుడ్ని ప్రకటించిన తర్వాత ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో చెవిరెడ్డి మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు. ‘నా కుటుంబం కంటే ఎక్కువగా ప్రేమించే చంద్రగిరి ప్రజలకు కొంత దూరంగా వెళుతున్నందుకు బాధపడాలో, జననేత జగనన్న వంటి మనస్సు కలిగిన నేతకు దగ్గరవుతున్నందుకు సంతోష పడాలో తెలియట్లేదు. రాష్ట్ర స్థాయిలో పార్టీ అనుబంధ సంఘాలను బలోపేతం చేయడం, ఎన్నికల నిర్వహణ బాధ్యతలు తీసుకోవాల్సి ఉన్నందున ముఖ్యమంత్రి జగనన్నకు అతి దగ్గరగా వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే ముఖ్యమంత్రి జగనన్న సూచన మేరకు మోహిత్‌ను అభ్యర్థిగా ప్రకటిస్తున్నాను’ అని చెవిరెడ్డి చెప్పుకొచ్చారు.

Jagan-and-Chevireddy.jpg

జగన్ ఏమన్నారంటే..!

ఒకానొక సందర్భంలో.. ‘నువ్వు ఉండాల్సింది చంద్రగిరిలో కాదు నా వెంట..’ అని బహిరంగ సభావేదికగా జగన్ ప్రకటించారు. దీంతో జగన్ ఆదేశాలను శిరసా వహిస్తూ సీఎం ఎక్కడుంటే అక్కడికెళ్తున్నారు. ఆ తర్వాత వైసీపీకి చెందిన మొత్తం 23 అనుబంధ సంఘాల ఇంఛార్జ్ బాధ్యతలను చెవిరెడ్డికి జగన్ అప్పగించారు. ఇంతటి కీలక బాధ్యతలు చెవిరెడ్డికి కట్టబెట్టారంటే జగన్‌కు ఈయనంటే ఎంత నమ్మకమో. వైఎస్ ఫ్యామిలీకి (YS Family) మొదట్నుంచీ చెవిరెడ్డి అత్యంత సన్నిహితుడు. వైఎస్ హయాంలో జడ్పీటీసీ సభ్యుడిగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన చెవిరెడ్డి.. వైఎస్ జగన్ వైఎస్సార్సీపీని స్థాపించిన తర్వాత చిత్తూరు జిల్లాలో పేరుగాంచిన గల్లా ఫ్యామిలీని (Galla Family) ఓడించే స్థాయికి చేరారు. నాటి నుంచి నేటి వరకూ వైఎస్ ఫ్యామిలీకి వీర విధేయుడిగా చెవిరెడ్డి (Chevi Reddy) ఉంటూ వస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే వైసీపీ తరఫున గెలిచిన ఎంపీ, ఎమ్మెల్యేల్లో ఎవరైనా సరే జగన్ దగ్గరికి అపాయింట్మెంట్ తీసుకుని వస్తారేమో కానీ.. చెవిరెడ్డికి మాత్రం అలాంటివేమీ అక్కర్లేదు.. డైరెక్టుగానే వెళ్లేంత చనువు ఉంది. అనతి కాలంలోనే జగన్‌కు బాగా దగ్గరయ్యారని చెవిరెడ్డి అనుచరులు చెప్పుకుంటున్నారు. అంటే ఇకపై జగన్ వెంట ఉంటూ.. అన్ని పనులు చక్కదిద్దుతారన్న మాట.

Vijayasai-Reddy.jpg

విజయసాయిని తప్పించి..!

వైసీపీలో నంబర్-2గా కార్యకర్తలు, నేతలు పిలుచుకునే ఎంపీ విజయసాయిరెడ్డి పార్టీలో గల్లీ నుంచి ఢిల్లీ వరకూ అన్నీ ఆయనే చూసుకునేవారు. వైఎస్ ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడు. ముఖ్యంగా వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి నమ్మిన బంటు. జగన్ పార్టీ పెట్టక ముందు నుంచే రైట్ హ్యాండ్‌గా (Right Hand) ఉంటూ వస్తున్నారు. అయితే సడన్‌గా ఏమైందో తెలియట్లేదు కానీ.. ఆయన దగ్గర్నుంచి పార్టీ అనుబంధ సంఘాలు, ఉత్తరాంధ్ర బాధ్యతలు.. వైసీపీలో అత్యంత కీలకంగా ఉన్న సోషల్ మీడియా వింగ్‌ను కూడా విజయసాయిరెడ్డి చేతుల్లో నుంచి తీసేసుకుని వీటన్నింటికీ వేరే వారికి అప్పగించారు జగన్. సోషల్ మీడియా వింగ్‌ను.. వైసీపీలో కీలకంగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు సజ్జల భార్గవ్ రెడ్డికి అప్పగించారు. ఉత్తరాంధ్ర బాధ్యతలు బాబాయ్ వైవీ సుబ్బారెడ్డికి కట్టబెట్టారు. సాయిరెడ్డి అధ్యక్షుడిగా ఉండే అనుబంధ సంఘాలకు బాధ్యులను అధిష్టానం ఆయనకు తెలియకుండానే అధిష్ఠానం నియమించిందని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. అంతేకాదు.. అనుబంధ సంఘాల అధ్యక్ష పదవిని ఎమ్మెల్యే చెవిరెడ్డికి కట్టబెట్టింది అధిష్ఠానం. నాటి నుంచి నేటివరకూ అనుబంధ సంఘాల బాధ్యతలను చెవిరెడ్డే చూసుకుంటున్నారు. ఇక ఎమ్మెల్యే పదవిని పక్కనబెట్టి.. పూర్తిగా ఇక అనుబంధ సంఘాల పనులే చూసుకోవాలని జగన్ ఆదేశించారు. దీంతో ప్రత్యక్ష రాజకీయాల నుంచి చెవిరెడ్డి తప్పుకున్నారు.

Chevireddy-Bhaskar-Reddy.jpg

మొత్తానికి చూస్తే.. చెవిరెడ్డితో మొదలైన జగన్ కొత్తటీమ్‌లోకి త్వరలోనే కొందరు సీనియర్లు, కీలక నేతలు కూడా వస్తారని తెలుస్తోంది. రానున్న ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి రావాలంటే ఇలా కొత్త టీమ్‌తో పెద్ద ప్లాన్లే జగన్ చేయిస్తారని తెలుస్తోంది. విజయసాయిరెడ్డి లాంటి సీనియర్ నేతే ఈ అనుబంధ సంఘాల విషయంలో చాలాసార్లు సమస్యలు ఎదుర్కొన్న పరిస్థితులున్నాయ్. ఇప్పుడు చెవిరెడ్డి ఏ మాత్రం వీటన్నింటినీ నడిపిస్తారో వేచి చూడాలి మరి. అయితే.. వైసీపీలో మారుతున్న రాజకీయాలకు ఇవన్నీ సంకేతాలని పార్టీ శ్రేణులు చెప్పుకుంటున్నాయ్. ఎన్నికల ముందు ఇంకా ఏమేం జరుగుతాయో వేచి చూడాల్సిందే మరి.

*****************************

ఇవి కూడా చదవండి..

*****************************

YSR Congress : ఎంపీ విజయసాయిరెడ్డి అవసరం ఇక వైసీపీకి లేదా.. వరుస ఝలక్‌లతో YS Jagan ఇస్తున్న సంకేతాలేంటి.. ఆ ఒక్క ఘటనతో..!?

****************************

YSRCP : వైసీపీ ఎమ్మెల్యేల్లో నరాలు తెగే ఉత్కంఠ.. సరిగ్గా ఇదే టైమ్‌లో సంచలన ప్రకటన చేసిన చెవిరెడ్డి.. ఇంత ధైర్యమేంటో..!?

*****************************

YSRCP : ఏప్రిల్-3న ఏం జరగబోతోందో ఒక్కరోజు ముందే పూసగుచ్చినట్లుగా చెప్పేసిన పేర్ని నాని.. ఇదే నిజమైతే..!


*****************************

YSRCP : ఏప్రిల్-3 చుట్టూ తిరుగుతున్న ఏపీ రాజకీయాలు.. వైఎస్ జగన్ బిగ్ డెసిషన్స్ తీసుకుంటారా.. ఆ ఎమ్మెల్యేలకు ఊహించని ఝలక్ ఇవ్వబోతున్నారా..!?

******************************

Jagan Team 3.0 : వైఎస్ జగన్ కేబినెట్ నుంచి ఔటయ్యేదెవరు.. కొత్తగా వచ్చేదెవరు.. ఈసారి ఊహించని రీతిలో ట్విస్ట్‌లు ఉంటాయా..!?

******************************

Jagan Team 3.0 : ఏపీ కేబినెట్‌లో మళ్లీ మార్పులు.. ఆ ఇద్దరు మాజీ మంత్రులను తీసుకునే యోచనలో వైఎస్ జగన్..!

*****************************

Updated Date - 2023-04-02T23:16:29+05:30 IST