Snake vs Birds Video: పిట్టలే కదా.. ఏం చేస్తాయ్‌లే అనుకుంటే చుక్కలు చూపించాయిగా.. ఏడు పక్షులు ఆ పామును రౌండప్ చేసి మరీ..!

ABN , First Publish Date - 2023-04-16T14:44:57+05:30 IST

బలవంతుడితో బలహీనుడు పోటి పడితే గెలిచేది బలవంతుడే ఇది అందరికీ తెలిసిన సత్యమే.

Snake vs Birds Video: పిట్టలే కదా.. ఏం చేస్తాయ్‌లే అనుకుంటే చుక్కలు చూపించాయిగా.. ఏడు పక్షులు ఆ పామును రౌండప్ చేసి మరీ..!

ఇంటర్నెట్ డెస్క్: బలవంతుడితో బలహీనుడు పోటి పడితే గెలిచేది బలవంతుడే ఇది అందరికీ తెలిసిన సత్యమే. కానీ, కొన్నిసార్లు దీనికి వ్యతిరేక ఫలితాలు కూడా వస్తుంటాయి. దీనికి బెస్ట్ ఉదాహరణ తాజాగా సోషల్ మీడియలో వైరల్ అవుతున్న ఓ వీడియో.. అందులోని సంఘటన. వీడియోలో కొన్ని పక్షలు కలిసికట్టుగా పోరాడి పాముపై గెలిచాయి. ఇంకా చెప్పాలంటే మంచి టీం వర్క్ ప్రదర్శించాయి అన్నమాట. పక్షులే కదా నన్ను ఏం చేస్తాయిలే అనుకుంది పాము. కానీ, దానికి చుక్కలు చూపించేశాయి. రౌండప్ చేసి పామును కన్‌ఫ్యూజ్‌లో పడేసి మరీ దాడికి దిగాయి. పక్షుల తెలివికి పాము తెల్లమోహం వెసిందంటే నమ్మండి. అలా రౌండప్ చేసి దాడిచేస్తుంటే పాపం పాము పడగ దించుకోవాల్సి వచ్చింది. రౌండప్ చేసి ఒకదాని తర్వాత ఒకటి పాముపై దాడి చేయడం చూస్తుంటే.. అరేరే పక్షులు ఏమన్నా తెలివిని ప్రదర్శించాయని చెప్పకుండా ఉండలేం.

వీడియో పాతదే అయినా పక్షుల టీం వర్క్ చూస్తుంటే మాత్రం ముచ్చటవేయకమానదు. దీనిపై నెటిజన్లు తమదైనశైలిలో స్పందిస్తున్నారు. "తమ శుత్రువుపై పక్షులు ఒక జట్టుగా పోరాడాయి" అని ఒకరు అంటే.., "నిజంగా ఇది చాలా గొప్ప అటాక్. కలిసికట్టుగా పోరాడితే ఫలితం ఇలాగే ఉంటది" అని మరోకరు, "వావ్.. పక్షులు పోరాడిన తీరు అద్భుతం. చూస్తుంటే రెండు వేర్వేరు జాతులకు చెందిన పిట్టలా కనిపిస్తున్నా.. తమ ప్రాణాలపై రావడంతో కలిసికట్టుగా పోరాడి పామును దెబ్బ తీశాయి" అని ఇంకోకరు, "సూపర్.. యానిమల్ కింగ్‌డమ్‌లో మునుపెన్నడూ చూడని వార్" అని మరో నెటిజన్ కామెంట్ చేశారు. ఇంకేందుకు ఆలస్యం పామును రౌండప్ చేసి కన్‌ఫ్యూజ్ చేస్తూ తెలివిగా దాడి చేసిన పక్షుల అమేజింగ్ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.

Viral Video: ఎన్ని సార్లు అడిగినా ముఖానికి చుట్టుకున్న స్కార్ఫ్‌ను తీసేయని ప్రేయసి.. అనుమానంతో ఆ ప్రియుడు ముసుగు తీసేసి చూస్తే..

ABN ఛానల్ ఫాలో అవ్వండి
Powered byPerformoo logo
The video is not available or it's processing - Please check back later.

Updated Date - 2023-04-16T14:53:44+05:30 IST