Yellow Teeth: పళ్లు పచ్చగా కనిపిస్తున్నాయా..? ఈ పండు తొక్కను తీసుకుని 4 నిమిషాల పాటు రుద్దితే అద్భుతమైన రిజల్ట్..!
ABN , First Publish Date - 2023-09-30T21:27:03+05:30 IST
అందం కోసం ఎంత ఖర్చు చేసినా పళ్ల వరుస సక్రమంగా లేకపోయినా.. పసుపు పచ్చగా మారిపోయినా చూడటానికి అస్సలు బాగుండదు. చాలా మంది పంటి సమస్యలను మొదట్లో తేలిగ్గా తీసుకుంటుంటారు. తీరా సమస్య ఎక్కువయ్యాక ఆస్పత్రుల చుట్టూ తిరుగుతుంటారు. ఇంకొందరు..
అందం కోసం ఎంత ఖర్చు చేసినా పళ్ల వరుస సక్రమంగా లేకపోయినా.. పసుపు పచ్చగా మారిపోయినా చూడటానికి అస్సలు బాగుండదు. చాలా మంది పంటి సమస్యలను మొదట్లో తేలిగ్గా తీసుకుంటుంటారు. తీరా సమస్య ఎక్కువయ్యాక ఆస్పత్రుల చుట్టూ తిరుగుతుంటారు. ఇంకొందరు రంగు మారిన దంతాలతో పది మందిలో మనస్ఫూర్తిగా నవ్వడానికి కూడా ఇబ్బంది పడుతుంటారు. పచ్చగా మారిన పళ్లను ఈ పండు తొక్కతో నాలుగు నిమిషాల పాటు రుద్దితే అద్భుతమైన అద్భుతమైన రిజల్ట్ వస్తుంది. ఇంతకీ అదెలాగో తెలుసుకుందాం..
దంతాలు తెల్లగా ఉండాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అయితే వివిధ కారణాల వల్ల కొందరి పళ్లు పసుపు పచ్చ రంగులోకి మారిపోతుంటాయి. పొగాకు నమలడం వల్ల కొందరికి, ఆహార అలవాట్లు, నీటిలో ఉండే ఫ్లోరైడ్ ఎక్కువ శాతం ఉండడం వల్ల మరికొందరికి చిన్న వయసులోనే పళ్లు రంగు మారిపోతుంటుంది. దీంతో వాటిని తిరిగి తెల్లగా మార్చుకునేందుకు తెగ తంటాలు పడుతుంటారు. అయితే ఈ చిన్న చిట్కా పాటించడం ద్వారా మీ పళ్లను తిరిగి తెల్లగా మార్చుకునే అవకాశం ఉంది. నారింజ పండు తొక్కలోని తెల్లటి భాగంలో విటమిన్-సి, పెక్టిన్, లిమోనెన్, గ్లూకోనేట్, కరిగే ఫైబర్ ఉంటుంది. ఇవన్నీ కలిసి పళ్లు తెల్లగా మారేందుకు సహకరిస్తాయి.
Credit Card: శాలరీ ప్రూఫ్ లేకున్నా.. మీరు అసలు జాబ్ చేయకపోయినా క్రెడిట్ కార్డు ఎలా పొందొచ్చంటే..!
నారింజ పండు తొక్కలోని తెల్లటి భాగాన్ని తీసుకుని పళ్లపై మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు రద్దాలి. ఉదయాన్నే బ్రష్ చేయడానికి ముందే నారింజ పండులోని తొక్క రసాన్ని ఇలా మర్దనా చేయాలి. ఇలా చేసే ముందు ఈ తొక్కలను శుభ్రంగా కడుక్కోవాలి. అదేవిధంగా తొక్క తెల్లటి భాగంలో కొన్ని చుక్కల నిమ్మరసం వేసి దంతాల అప్లై చేసినా ప్రయోజనం ఉంటుంది. అలాగే నిమ్మకాయ, స్ట్రాబెర్రీ, ఆపిల్, ఎండు ద్రాక్షలో కూడా పళ్లను తెల్లగా మార్చే గుణం ఉంటుంది. చికికెడు ఉప్పు, బేకింగ్ సోడాలో నిమ్మచెక్కను ముంచి దాంతో పళ్ల మీద రుద్దాలి. ఇలా చేయడం వల్ల పళ్లు క్రమక్రమంగా తెల్లగా మారిపోతాయి. అదేవిధంగా ఫ్రెష్ స్ట్రాబెర్రీని పంటిపై రుద్దడం వల్ల కూడా తెల్లగా మారే అవకాశం ఉంది. యాపిల్ సైడర్ వెనిగర్ కూడా దంతాలను తెల్లగా మార్చడంలో సహాయపడుతుంది. రెండు టేబుల్ స్పూన్ల యాపిల్ సైడర్ వెనిగర్‌ని కొన్ని నీళ్లలో వేసి కలపాలి. ఆ మిశ్రమాన్ని నోట్లో వేసుకుని పుక్కిలించాలి. రోజూ బ్రష్ చేసే ముందు ఇలా చేయడం వల్ల పళ్లు తెల్లగా మారడాన్ని గమనించవచ్చు.