Mother: చుట్టూ చీకటి.. రోడ్డు పక్కన తల్లి మృతదేహం పక్కనే ఆడుకుంటున్న 8 నెలల బాబు.. అసలేం జరిగిందంటే..!

ABN , First Publish Date - 2023-09-29T20:55:10+05:30 IST

రోజురోజుకూ మహిళలపై దాడులు పెరిగిపోవడం చూస్తూనే ఉన్నాం. ప్రేమ పేరుతో కొందరు, పెళ్లి పేరుతో మరికొందరు మహిళలను మోసం చేయడం సర్వసాధారణమైపోయింది. మరికొందరైతే తమ దారికి రాని వారిని చంపడానికీ వెనుకాడడం లేదు. ఈ క్రమంలో...

Mother: చుట్టూ చీకటి.. రోడ్డు పక్కన తల్లి మృతదేహం పక్కనే ఆడుకుంటున్న 8 నెలల బాబు.. అసలేం జరిగిందంటే..!

రోజురోజుకూ మహిళలపై దాడులు పెరిగిపోవడం చూస్తూనే ఉన్నాం. ప్రేమ పేరుతో కొందరు, పెళ్లి పేరుతో మరికొందరు మహిళలను మోసం చేయడం సర్వసాధారణమైపోయింది. మరికొందరైతే తమ దారికి రాని వారిని చంపడానికీ వెనుకాడడం లేదు. ఈ క్రమంలో కేసుల నుంచి తప్పించుకునేందుకు మరిన్ని నేరాలు చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు తరచూ ఎక్కడో చోట జరుగుతూనే ఉన్నాయి. తాజాగా, హర్యానాలో ఓ విషాద ఘటన చోటు చేసుకుంది. రాత్రి వేళ రోడ్డు పక్కన ఓ మహిళ మృతదేహం పడి ఉండగా.. పక్కనే మృతురాలి 8నెలల కొడుకు ఆడుకుంటూ ఉన్నాడు. నాలుగేళ్ల కూతురికి మాత్రల కోసం వెళ్లిన ఆమె రాత్రికి శవమై కనిపించింది. వివరాల్లోకి వెళితే..

హర్యానా (Haryana) నూహ్ బిచౌర్ పోలీస్ స్టేషన్ పరిధి బిస్రూ గ్రామ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బుధవారం రాత్రి ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో (woman Suspicious death) పడి ఉంది. ఆమె పక్కనే 8నెలల కొడుకు కూర్చుని ఏడుస్తూ ఉన్నాడు. దీంతో చుట్టుపక్కల వారు గమనించి పరుగెత్తుకుంటూ వెళ్లి చూశారు. అయితే సదరు మహిళ చనిపోయి ఉండడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. విచారణలో మృతురాలు.. కోట్లాకా జిల్లా నుహ్‌కి చెందిన న్యాయవాది భార్య శకున్నత్‌ (24) అని తెలిసింది.

Brother: సడన్‌గా బైక్‌ను ఆపి చెల్లి గొంతు కోసిన అన్న.. బతికుండగానే పెట్రోల్ పోసి నిప్పంటించిన తల్లి.. అసలు కథేంటంటే..!

సదరు మహిళ బుధవారం ఉదయం తన నాలుగేళ్ల కూతురికి గొంతు నొప్పిగా ఉండడంతో మాత్రలు తీసుకొచ్చేందుకు కొడుకును తీసుకుని వెళ్లింది. అయితే సాయంత్రం తిరిగి ఇంటికి వెళ్లలేదు. దీంతో కుటుంబ సభ్యులు చుట్టు పక్కల వెతికినా కనిపించలేదు. చివరకు తెలిసిన వారు చెప్పడంతో గురువారం ఉదయం ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే అప్పటికే పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ఆస్పత్రికి తరలించారు. ఎవరో ఆమెను హత్య చేసి, మృతదేహాన్ని అక్కడ పడేసి వెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతురాలి కుటుంబీకులను విచారిస్తున్నారు. త్వరలో నిందితులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. మొత్తానికి ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Success Story: ఈ అమ్మాయి మాట్లాడిన ఇంగ్లీషును విని నవ్వినోళ్లే.. ఇప్పుడు ఆమె ఏ స్థాయిలో ఉందో తెలిసి షాక్..!

Updated Date - 2023-09-29T20:55:10+05:30 IST