Flower show: అట్టహాసంగా ఊటీ ఫ్లవర్‌ షో

ABN , First Publish Date - 2023-05-20T11:14:53+05:30 IST

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పర్యాటక ప్రాంతం ఊటీ(Ooty)లో 125వ పుష్ప ప్రదర్శన శుక్రవారం ఉదయం అట్టహాసంగా ప్రారంభమైంది.

Flower show: అట్టహాసంగా ఊటీ ఫ్లవర్‌ షో

చెన్నై, (ఆంధ్రజ్యోతి): ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పర్యాటక ప్రాంతం ఊటీ(Ooty)లో 125వ పుష్ప ప్రదర్శన శుక్రవారం ఉదయం అట్టహాసంగా ప్రారంభమైంది. దేశ, విదేశాల నుంచి విచ్చేసిన పర్యాటకులు ఒకే చోట లక్షల సంఖ్యలో రంగురంగుల వివిధ రకాలకు చెందిన పూల సొబగులను చూసి విస్తుపోయారు. ఇటీవల రాష్ట్ర ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు నిర్వహించిన గులాబీ పూల ప్రదర్శన చూపరులకు కనువిందు చేశాయి. ఈ నేపథ్యంలో ఈ యేడాది సమ్మర్‌ సీజన్‌కు సంబంధించి 125వ ఫ్లవర్‌షోను మంత్రి రామచంద్రన్‌ ప్రారంబించారు. ఈ ప్రదర్శన ఐదు రోజులపాటు కొనసాగనున్నాయి. ఈ ప్రదర్శనలో 80వేల కార్నేషన్‌ పుష్పాలతో 45 అడుగుల ఎత్తైన నెమలి ఆకారం కనువిందు చేస్తోంది. ఇదే విధంగా నీలగిరి జిల్లాల్లో సంచరించే పులులు, చిరుతలు, బట్టమేక పిట్ల, జింకల ఆకృతులను వివిధ రకాల పూలతో రూపొందించారు. ఇక ఖడ్గమృగం, డాల్ఫిన్‌, బట్టర్‌ఫ్లై, పిచ్చుక తదితర ఆకారాలు కూడా పర్యాటకులకు కనువిందు చేస్తున్నాయి. ఈ ఫ్లవర్‌షో ప్రారంభాన్ని పురస్కరించుకుని నీలగిరి జిల్లాకు శుక్రవారం స్థానిక సెలవు ప్రకటించారు. తొలిరోజే ఈ ప్రదర్శనను చూడటానికి వేల సంఖ్యలో పర్యాటకులు తరలిరావటంతో ఫ్లవర్‌షో ప్రాంతమంతటా సందడిగా మారింది. ఈ ఫ్లవర్‌షో ప్రారంభోత్సవంలో నీలగిరి ఎంపీ రాజా, జిల్లా కలెక్టర్‌ అమృత్‌ తదితరులు పాల్గొన్నారు.

nani10.2.jpg

Powered byPerformoo logo
The video is not available or it's processing - Please check back later.

Updated Date - 2023-05-20T11:14:53+05:30 IST