Viral Video: వామ్మో.. ఈమె నిజంగా లేడీ బాహుబలే.. అంత బలమైన దుంగలను ఎలా మోసుకెళ్తోందో చూడండి..

ABN , First Publish Date - 2023-08-29T13:35:21+05:30 IST

ఆరడుగుల ఆజానుబాహుడు ప్రభాస్ ``బాహుబలి`` సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులను ఆకర్షించాడు. అతడి అద్భుతమైన నటనతోపాటు అతడి ఫిజక్‌, లుక్స్‌కు అభిమానులు ఫిదా అయిపోయారు. శివలింగం ఎత్తడం, రథాన్ని లాగడం, భల్లాలదేవ విగ్రహం ఎత్తడం మొదలైన బలప్రదర్శనతో బాహుబలి అంటే ఇలా ఉండాలి అని ముద్ర వేశాడు.

Viral Video: వామ్మో.. ఈమె నిజంగా లేడీ బాహుబలే.. అంత బలమైన దుంగలను ఎలా మోసుకెళ్తోందో చూడండి..

ఆరడుగుల ఆజానుబాహుడు ప్రభాస్ ``బాహుబలి`` (Bahubali) సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులను ఆకర్షించాడు. అతడి అద్భుతమైన నటనతోపాటు అతడి ఫిజక్‌, లుక్స్‌కు అభిమానులు ఫిదా అయిపోయారు. శివలింగం ఎత్తడం, రథాన్ని లాగడం, భల్లాలదేవ విగ్రహం ఎత్తడం మొదలైన బలప్రదర్శనతో బాహుబలి అంటే ఇలా ఉండాలి అని ముద్ర వేశాడు. నిజ జీవితంలో కూడా ఎవరైనా అలాంటి పనులు చేస్తే వారిని ``బాహుబలి``తో పోల్చడం రివాజుగా మారిపోయింది.

ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియోలో లేడీ బాహుబలి (Lady Baahubali) అందరినీ షాక్‌కు గురి చేస్తోంది. ఆమె బలం చూసి అందర్నీ నివ్వెరపోయేలా చేస్తోంది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ యువతి అడవిలో ఉంది. రెండు బలమైన దుంగలను (Huge wooden logs) ఎవరి సహాయమూ లేకుండా పైకి ఎత్తి ఓ తాడుతో కట్టింది. అనంతరం ఆ భారీ దుంగలను కట్టిన తాడును తన భుజాలకు తగిలించుకుంది. ఆ ఘటనను ఆమె స్నేహితురాలు వీడియో తీసి సోసల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో బాగా వైరల్ (Viral Video) అవుతోంది.

Viral Video: నా చెల్లితో రొమాన్స్ చేస్తూ నన్నే మోసం చేస్తావా?.. బాయ్‌ఫ్రెండ్‌కు ఓ అమ్మాయి ఎలా బుద్ది చెప్పిందో చూడండి..

@FunnyXPost అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. ఈ వీడియోను ఇప్పటివరకు 20 వేల మందికి పైగా వీక్షించారు. ఈ వీడియోలోని మహిళపై నెటిజన్లు ప్రశంసలు కురిపించారు. ``ఆమె రియల్ బాహుబలి``, ``సూపర్ పవర్``, ``అడవి మీద ఆధారపడి జీవించేవాళ్ల భుజాలు చాలా బలంగా ఉంటాయి`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

Updated Date - 2023-08-29T13:35:21+05:30 IST