ఇతడెవరో గుర్తు పట్టలేరేమో కానీ.. ఈయన వాయిస్‌ను మాత్రం వినే ఉంటారు.. 8 సార్లు ఆర్మీ రిజెక్ట్ చేసిన ఈయన కథేంటంటే..!
ABN , First Publish Date - 2023-03-03T13:56:49+05:30 IST
బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా చేసే బిగ్ బాస్ షో (Big Boss) గురించి తెలియని వారు ఉండరు.
ఇంటర్నెట్ డెస్క్: బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా చేసే బిగ్ బాస్ షో (Big Boss) గురించి తెలియని వారు ఉండరు. ఎందుకంటే.. ఈ షో ఆ తర్వాత ఈ భాష.. ఆ భాష అనే తేడాలేకుండా చాలా భాషల్లోనే వచ్చింది. దాంతో దేశవ్యాప్తంగా బాగా పాపులర్ అయింది. ఇక ఈ షోకు సల్లూభాయ్ ఎంత స్పెషల్ ఎట్రాక్షనో.. బ్యాక్‌గ్రౌండ్‌లో వినిపించే బిగ్‌బాస్ వాయిస్ కూడా అంతే ప్రత్యేకం అని చెప్పొచ్చు. ఇందులో ఎలాంటి సందేహం లేదు కూడా. ఎందుకంటే ఆ వాయిస్ అంత అట్రాక్టివ్‌గా ఉంటది మరి. చాలా మంది ఆ వాయిస్ కోసమే షో చూసేవాళ్లు ఉన్నారంటే అతిశయోక్తి కాదేమో. ఎంతో గాంభీర్యంగా ఉండే ఆ వాయిస్ అందరినీ ఇట్టే అట్రాక్ట్ చేస్తది కూడా. ఇంతకీ ఆ వాయిస్ ఎవరిది? అది మనిషే మాట్లాడుతాడా? లేక మెషిన్ మహాత్యమా? అనే అనుమానం మనకు రాక తప్పదు. అయితే, అది కచ్చితంగా మనిషిదే. అందులో సందేహం అక్కర్లేదు. ఇలా వేర్వేరు లాంగ్వేజేస్‌లో వేర్వేరు పర్సన్స్ ఆ బిగ్‌బాస్‌కు తమ వాయిస్ అందించారు. అయితే, హిందీలో ఆ వాయిస్ మాత్రం విజయ్ విక్రమ్ సింగ్‌ది. ఆయన ఎవరికి తెలియకపోవచ్చు. కానీ, బిగ్‌బాస్ వాయిస్ మాత్రం అందిరికీ సూపరిచితమే. 13 సీజన్లు ఆయన నాన్-స్టాప్‌గా తన గాత్రంతో బిగ్‌బాస్ అభిమానులను అలరించారు.
అతను కూడా ఊహించి ఉండడు తన వాయిస్ ఇంత పాపులరై తనకు ఇంతటి పాపులారిటీని తెచ్చిపెడుతుందని. ఆ తర్వాత విజయ్ విక్రమ్ ఇటీవల యాక్టింగ్ కెరీర్‌ను కూడా ప్రారంభించారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ, ఆయన మొదట అనుకుంది ఇది కాదట. విజయ్ విక్రమ్‌కు చిన్నప్పటి నుంచి ఆర్మీలో చేరి సైనికుడిగా దేశానికి సేవ చేయాలని ఉండేదట. కానీ, ఆ కల నెరవేరలేదు. ఏకంగా 8సార్లు ఆర్మీ సెలక్షన్స్‌కు వెళ్లి రిజెక్ట్ అయ్యారు. దాని పర్యావసానంగా తాగుడుకు బానిసగా మారారు. ఎంతలా అంటే.. ఏకంగా ప్రాణాలమీదికే తెచ్చుకున్నాడు. ఒకనొక సందర్భంలో వైద్యులు కూడా ఈయన బతకడం కష్టం అని చెప్పేశారట. ఇదిగో ఆ స్థాయి నుంచి విజయ్ విక్రమ్ ఇవాళ ఏ స్థాయిలో ఉన్నాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకవైపు యాక్టింగ్.. మరోవైపు బిగ్ బాస్ షో ద్వారా ఇలా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు.
ఎవరీ విజయ్ విక్రమ్ సింగ్..
1977 నవంబర్ 26న ఉత్తర ప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఓ మధ్యతరగతి కుటుంబంలో పుట్టారు విజయ్ విక్రమ్. ఆయన పుట్టినప్పుడు వాళ్ల ఫ్యామిలీ ఆర్థిక పరిస్థితులు బాగానే ఉందట. కానీ, ఆ తర్వాత విజయ్ విక్రమ్ తండ్రికి బిజినెస్‌లో లాస్ రావడంతో ఇబ్బందులు మొదలయ్యాయి. అయితే, పిల్లలకు చదువులు మాత్రం మాన్పియలేదు విజయ్ విక్రమ్ తండ్రి. ఇక ఆయన తాత మాజీ సోల్జర్. దాంతో మనవడిని కూడా ఆర్మీ జవాన్‌గానే చూడాలనేదే ఆయన ఆశ. దానికి తగ్గట్టుగానే మనవడిని చిన్నప్పటి నుంచి ఆ దిశగానే ప్రోత్సహించాడు. మనోడిని బ్రిగేడియర్ విజయ్ విక్రమ్ సింగ్ అని పిలిచేవాడట ఆయన తాత. అలా చిన్నప్పటి నుంచి విజయ్ విక్రమ్ కూడా సైన్యంలో చేరాలనే కలతోనే ఉండేవాడు.
ఇది కూడా చదవండి: 'లగ్జరీ రిసార్ట్స్ కా బాప్'.. ఆస్తులు అమ్ముకున్నా ఇందులో ఒక్కరాత్రి బస చేయలేం బాస్..!
8 సార్లు ఆర్మీ సెలక్షన్స్‌లో రిజెక్ట్..
ఇక 18 ఏళ్ల వయసులో తొలిసారి మనోడు ఆర్మీ సెలక్షన్‌కు వెళ్లాడు. కానీ, రిజెక్ట్ అయ్యాడు. ఆ బాధతో తాగడం మొదలెట్టాడు. ఆ తర్వాత ఐదేళ్లలో మరో 7సార్లు కూడా మనోడు సెలెక్ట్ కాలేదు. ఇలా మొత్తంగా ఎనిమిది సార్లు తాను అనుకున్న జాబ్ రాకపోవడంతో 24-25 ఏళ్లు వచ్చేసరికి పూర్తిగా తాగుడుకు బానిసయ్యాడు. ఇంకేముంది ఆరోగ్యం చెడిపోయింది. దాంతో ఆస్పత్రిలో జాయిన్ అయ్యాడు. అక్కడ విజయ్ విక్రమ్‌ను పరీక్షించిన వైద్యులు 90శాతం బతకడం కష్టమని తేల్చేశారు. లీవర్ పూర్తిగా దెబ్బతిందని, 10శాతం మాత్రమే బతికే అవకాశం ఉందని చెప్పారు. కానీ, మనోడి అదృష్టం బాగుండి ఆ గండం నుంచి బయట పడ్డాడు. 35 రోజులు ఆస్పత్రి బెడ్డుపైనే ఉన్నాడు. ఆ తర్వాత కొలుకున్నాడు. అప్పటి నుంచి మళ్లీ మద్యం జోలికి వెళ్లలేదు.
ఇది కూడా చదవండి: ఇదేక్కడి వింత ఆచారంరా బాబోయ్.. హోలీ పేరిట మగాళ్ల తాట తీస్తున్నారుగా..!
ఆ తర్వాత ప్రభుత్వ ఉద్యోగం.. ఎఫ్ఎం రేడియా.. బిగ్‌బాస్ ఛాన్స్..
ఇది పునర్జన్మ అని భావించిన విజయ్ విక్రమ్.. ఆ తర్వాత పట్టుదలతో చదివి ప్రభుత్వ ఉద్యోగం సాధించారు. ఆ తర్వాత ముంబైకి మకాం మార్చారు. అయితే, తన జీవితాన్ని సరైన మార్గంలో పెట్టింది మాత్రం తన భార్యే అంటారాయన. ఆమె ప్రోత్సాహంతోనే ప్రభుత్వ ఉద్యోగం వదిలిపెట్టి మరీ ఎఫ్ఏం రేడియోలో పని చేశారట. దానికి ఆయన వాయిసే కారణమట. ఆ తర్వాత అశీష్ గోవరికర్ సాయంతో డ్యాన్స్ ఇండియా డ్యాన్స్‌లోని పనిచేసే అవకాశం దక్కింది. అక్కడ పని చేసే సమయంలోనే చాలా మందితో పరిచయాలు పెరిగాయి. ఈ క్రమంలోనే ఆయనకు బిగ్‌బాస్‌లో అవకాశం రావడం.. అందులో తన వాయిస్‌తో మెస్మరైజ్ చేయడం.. 13 సీజన్లు కొనసాగడంతో ఆయన లైఫే మారిపోయింది. ఇదే గుర్తింపుతో 2018లో యాక్టింగ్ అవకాశాలు వచ్చాయి. అలా ఫ్యామిలీ మ్యాన్, స్పెషల్ ఓపీఎస్ 1.5, ఫేక్ వంటి వెబ్ సిరీస్‌లో నటించారు. ప్రస్తుతం మరిన్ని ప్రాజెక్టులలో తనకు అవకాశాలు వస్తున్నట్లు విజయ్ విక్రమ్ చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: వామ్మో.. డ్రైవర్ లేకుండానే స్టార్ట్ అయిన ట్రాక్టర్.. ఆ తర్వాత ఏం జరిగిందో మీరే చూడండి..!