Sruthi Shanmuga Priya: పాపం ఈ బుల్లితెర నటి.. పెళ్లైన ఏడాదికే ఎంతటి విషాదం..

ABN , First Publish Date - 2023-08-04T18:13:34+05:30 IST

తమిళ్‌లో పాపులర్ బుల్లి తెర నటి అయిన శ్రుతి షణ్ముగ ప్రియ జీవితంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఆమె భర్త అరవింద్ శేఖర్ 30 ఏళ్ల వయసులోనే హార్ట్ అటాక్ కారణంగా మరణించాడు. 2022లో మిస్టర్ తమిళనాడు టైటిల్ గెలుచుకున్న అరవింద్ శేఖర్ ఫిట్‌నెస్ మోడల్ కావడం గమనార్హం. అరవింద్ ఇంట్లో ఉన్న సమయంలో హార్ట్ అటాక్‌తో కుప్పకూలిపోయాడని, హుటాహుటిన ఆసుపత్రికి తరలించినప్పటికీ ప్రాణాలు దక్కలేదని తెలిసింది.

Sruthi Shanmuga Priya: పాపం ఈ బుల్లితెర నటి.. పెళ్లైన ఏడాదికే ఎంతటి విషాదం..

చెన్నై: తమిళ్‌లో పాపులర్ బుల్లి తెర నటి అయిన శ్రుతి షణ్ముగ ప్రియ జీవితంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఆమె భర్త అరవింద్ శేఖర్ 30 ఏళ్ల వయసులోనే హార్ట్ అటాక్ కారణంగా మరణించాడు. 2022లో మిస్టర్ తమిళనాడు టైటిల్ గెలుచుకున్న అరవింద్ శేఖర్ ఫిట్‌నెస్ మోడల్ కావడం గమనార్హం. అరవింద్ ఇంట్లో ఉన్న సమయంలో హార్ట్ అటాక్‌తో కుప్పకూలిపోయాడని, హుటాహుటిన ఆసుపత్రికి తరలించినప్పటికీ ప్రాణాలు దక్కలేదని తెలిసింది.

Sruthi.jpg

శ్రుతి షణ్ముక ప్రియ ‘నాదస్వరం’, ‘భారతి కణ్ణమ్మ’, ‘వాణిరాణి’, ‘పూనూంజల్’ లాంటి తమిళ సీరియల్స్‌తో తమిళ బుల్లితెర ప్రేక్షకుల్లో ఆదరణ సంపాదించుకుంది. సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్‌గా ఉండే శ్రుతికి ఇన్‌స్టాగ్రాంలో 185K ఫాలోవర్స్ ఉన్నారు. ఆమె భర్తతో కలిసి సందర్శించిన ప్రదేశాలను ఇన్‌‌స్టాగ్రాంలో ఫొటోలు, వీడియోల రూపంలో పోస్ట్ చేసే శ్రుతి షణ్ముగ ప్రియ తను ఇక లేడనే విషయాన్ని కూడా ఇన్‌స్టాలోనే వెల్లడించింది. అరవింద్ మృతిపై తమిళ్‌లో పలు యూట్యూబ్‌ ఛానల్స్ పుకార్లు పుట్టించాయి. ఈ పుకార్లను ఖండించిన శ్రుతి దయచేసి ఇలాంటి ప్రచారాలను ఇకనైనా మానుకోవాలని మీడియాకు, సోషల్ మీడియాకు, యూట్యూబ్ ఛానల్స్‌కు హిత బోధ చేసింది. ఒక కష్టతరమైన పరిస్థితి నుంచి బయటపడేందుకు తాను, తన కుటుంబం ప్రయత్నిస్తున్న ఈ సమయంలో తమను వేధించవద్దని కోరింది.


sruthi_shanmuga_priya-1-1.jpg

పాపం.. ఇటీవలే షణ్ముగ ప్రియ, అరవింద్ శేఖర్ తమ మొదటి వివాహ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఆ ఫొటోలను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తమ సంతోషాన్ని నెటిజన్లతో పంచుకున్నారు. మే 2022లో అరవింద్ శేఖర్, షణ్ముగ ప్రియ వివాహం జరిగింది. నిండు నూరేళ్లు కలిసి జీవించాలని ఆశపడ్డ ఈ జంట ఆశలు అడియాసలు కావడంతో షణ్ముగ ప్రియ ఇన్‌స్టా ఫాలోవర్లు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమెకు తమ ప్రగాడ సానుభూతి తెలిపారు. ఫిట్‌నెస్ మోడల్‌గా ఉన్న వ్యక్తి 30 ఏళ్లకే హార్ట్ అటాక్ కారణంగా చనిపోవడం కలకలం రేపింది. వయసుతో సంబంధం లేకుండా ఈ రోజుల్లో గుండెపోటు వస్తున్న పలు ఘటనలు వెలుగు చూస్తున్నాయి. ఒత్తిడి అనేది గుండెపోటు రావడానికి ప్రధాన కారకమవుతోంది. ఒత్తిడి స్థాయి పెరుగుతున్న కొద్దీ అధ్వానమైన ఫలితాలు వస్తున్నాయని తాజా అధ్యయనంలో వెల్లడైంది.

Sruthi1.jpg

ఒకప్పుడు 50-60 ఏళ్ల వయసులో వచ్చే హార్ట్ ఎటాక్ ఇప్పుడు అన్ని వయసుల వారిలోనూ కనిపిస్తోంది. యువత జీవనశైలిలో బాగా మార్పు వచ్చింది. చిన్నవయసులోనే అధిక ఒత్తిడితోపాటు బీపీ, షుగర్ వంటివి వస్తున్నాయి. అందుకే ఛాతినొప్పి, ఊపిరి ఆడకపోవడం, వికారం, మూర్ఛలా అనిపించడం, చెమటలు పట్టడం, అలసట, చేయి, మెడ, వీపు, దవడ, భుజాల భాగాల్లో నొప్పి ఉంటుంది. నడిచినా, మెట్లెక్కినా ఆయాసంగా ఉంటుంది. గుండెలో నొప్పి, పట్టేసినట్టుగా ఉంటుంది. ఈ లక్షణాల్లో ఏవి కనిపించినా తక్షణమే వైద్యుడిని సంప్రదించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

Updated Date - 2023-08-04T18:13:37+05:30 IST