Viral Video: ఇనుప కడ్డీతో మంట పుట్టించిన ఇతడి పనితనం చూస్తే.. అవాక్కవ్వాల్సిందే..

ABN , First Publish Date - 2023-02-12T21:19:44+05:30 IST

రాళ్ల నుంచి మంట పుట్టించవచ్చని తెలుసుకున్న మనిషి.. రాను రాను టెక్నాలజీ పరంగా ఎంతో అభివృద్ధి సాధించాడు. ఇప్పటికీ కొందరు చిత్ర విచిత్రమైన వస్తువులతో మంట వెలిగించడం చూస్తుంటాం. కొందరు చెక్కపై రాపిడి చేయడం ద్వారా మంట వెలిగిస్తే.. మరికొందరు..

Viral Video: ఇనుప కడ్డీతో మంట పుట్టించిన ఇతడి పనితనం చూస్తే.. అవాక్కవ్వాల్సిందే..

రాళ్ల నుంచి మంట పుట్టించవచ్చని తెలుసుకున్న మనిషి.. రాను రాను టెక్నాలజీ పరంగా ఎంతో అభివృద్ధి సాధించాడు. ఇప్పటికీ కొందరు చిత్ర విచిత్రమైన వస్తువులతో మంట వెలిగించడం చూస్తుంటాం. కొందరు చెక్కపై రాపిడి చేయడం ద్వారా మంట వెలిగిస్తే.. మరికొందరు ప్రత్యేకంగా తయారు చేసిన బ్యాటరీలు తదితరాల సాయంతో మంట వెలిగిస్తుంటారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం ఓ వ్యక్తి మంట వెలిగించే విధానం చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఇనుప కడ్డీతో అతడు మంట వెలిగించిన విధానం చూస్తే.. మీరు కూడా అవాక్కవుతారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ (Viral videos) అవుతోంది. ఓ వ్యక్తి ఏదో పని మీద మంట వెలిగించేందుకు సిద్ధమవుతాడు. ఇందులో విశేషమేమీ లేకున్నా.. అందరిలా కాకుండా వినూత్నంగా మంట వెలిగించడం (lighting a fire) చూసి అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ముందుగా ఓ చెక్కను తీసుకుని, సుత్తితో ముక్కలు ముక్కలు చేసి పక్కన పెట్టుకుంటాడు. తర్వాత ఓ కాగితాన్ని (paper) తీసుకుని పక్కన పెడతాడు.

Viral Video: బైకర్‌ను వెంబడిస్తున్న పోలీసులు.. గుడ్డిగా అతన్ని ఫాలో అవడంతో చివరకు ఏం జరిగిందంటే..

అనంతరం ఓ ఇనుప కడ్డీని (Iron bar) తీసుకుని, సుత్తితో చాలా సేపు దానిపై కొడతాడు. తర్వాత ఆ కడ్డీని తీసుకుని, కాగితంలో పెడతాడు. అంతే పొగలు చిమ్ముతూ మంట పుడుతుంది. తర్వాత ఆ మంటను పక్కన పెట్టుున్న చెక్క ముక్కలపై ఉంచగా.. పెద్ద మంట (Big fire) వెలుగుతుంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వ్యక్తి టాలెంట్‌ని చూసిన నెటిజన్లు.. అభినందనలతో ముంచెత్తుతున్నారు.

Viral Video: బలవంతం చేయగా బయటకు కక్కేసిన పాము.. చివరకు అది మింగిన వస్తువును చూసి అంతా షాక్...

Updated Date - 2023-02-12T21:20:04+05:30 IST