Viral Video: పాపం జాయింట్ వీల్ ఎక్కి సరదా తీర్చుకుందామనుకుంది కానీ.. ఈ యువతి చేసిన ఒకే ఒక్క మిస్టేక్ ఎంత ప్రమాదం తెచ్చిపెట్టిందో మీరే చూడండి!

ABN , First Publish Date - 2023-10-01T13:31:19+05:30 IST

సరదా తీర్చుకుందామని జాయింట్ వీల్ ఎక్కింది కానీ ఆమె చేసిన ఒకే ఒక్క మిస్టేక్ ఎంత పని చేసిందంటే..

Viral Video:  పాపం  జాయింట్ వీల్ ఎక్కి సరదా తీర్చుకుందామనుకుంది కానీ.. ఈ యువతి చేసిన ఒకే ఒక్క మిస్టేక్ ఎంత ప్రమాదం తెచ్చిపెట్టిందో మీరే చూడండి!

ఎగ్జిబిషన్లు, జాతరలు, పార్కులలో జాయింట్ వీల్ ఉంటుంది. రంగులరాట్నం అని పిలుచుకునే వీటిని ఎక్కి గాలిలో వేగంగా తిరగడం అదొక థ్రిల్. ఈ జాయింట్ వీల్స్ కూడా వివిధ పరిమాణాలలో ఉంటాయి. పెద్ద పెద్ద జాయింట్ వీల్స్ ఎక్కాలంటే కొందరు భయపడతారు. మరికొందరు ఎంజాయ్ చేస్తారు. ఓ యువతి కూడా పాపం జాయింట్ వీల్ ఎక్కి సరదా తీర్చుకుందామని అనుకుంది. అయితే ఆమె చేసిన ఒకే ఒక్క మిస్టేక్ ఆమె ప్రాణాలనే ప్రమాదంలో పడేసింది. ఈ సంఘటన గురించి తెలిసిన నెటిజన్లు కూడా ఇక మీద జాయింట్ వీల్ ఎక్కాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలని, పలు జాగ్రత్తలు తీసుకోవాలని అంటున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది. దీని గురించి పూర్తీగా తెలుసుకుంటే..

జాయింట్ వీల్ లేదా ఫెర్రస్ వీల్ (joint wheel or ferries wheel) ఎక్కడమంటే పిల్లల నుండి పెద్దల వరకు అందరికీ సరదానే. కొందరు దీన్ని ఎక్కిన తరువాత ఆరోగ్య సమస్యలు ఫేస్ చేస్తారు. కానీ ఆ తరువాత మళ్లీ దాన్ని ఎక్కడానికి ఇష్టపడతారు. గుజరాత్(Gujarat) రాష్ట్రం ద్వారక(Dwarka)లో వినాయకచవితి ఉత్సవాలలో భాగంగా జాయింట్ వీల్ ఏర్పాటు చేసారు. ఓ యువతి ఆ జాయింట్ వీల్ ఎక్కి సరదా తీర్చుకుందామని అనుకుంది. జాయింట్ వీల్ ఎక్కి కూర్చున్న తర్వాత రెండు రౌండ్లు పూర్తవగానే ఆ అమ్మాయి ఉన్నట్టుండి తన జుట్టును విప్పేసింది(women loose hair while joint wheel running). జాయింట్ వీల్ వేగం పుంజుకున్నాక ఉన్నట్టుండి గాలికి ఆమె జుట్టు జాయింట్ వీల్ కడ్డీలలో లో ఇరుక్కుపోయింది. ఒక్కసారిగా జుట్టు లాగినట్టు కావడంతో ఆమె గట్టిగా కేకలు వేసింది. ఆ ప్రాంతమంతా ఆమె కేకలతో గందరగోళం ఏర్పడింది. నిర్వహకులు వెంటనే జాయింట్ వీల్ ఆపేశారు. ఆమె చాలా పైన ఉండటంతో ఇద్దరు ధైర్యవంతులైన కుర్రాళ్లు జాయింట్ వీల్ ఎక్కారు. ఆమె జుట్టును జాయింట్ వీల్ కడ్డీల నుండి విడదీయడానికి ప్రయత్నం చేశారు కానీ అది చాలా దారుణంగా చిక్కుకుపోయింది. దీంతో వారు ఆమె జుట్టును కత్తి సహాయంతో కత్తిరించి ఆమెను విడిపించారు. ఈ సంఘటన ఆ ప్రాంతమంతా భయాందోళన కలిగించింది.

Smart Phone: స్మార్ట్ ఫోన్ తెగ వాడుతుంటారా? అయితే మీకూ ఈ జబ్బు వచ్చే అవకాశం ఉంది..



యువతి జుట్టు విడిపించడానికి కుర్రాళ్ళు రెస్క్యూ చేస్తున్న వీడియోను amazingdwarka అనే ఇన్స్టాగ్రామ్(Instagram) అకౌంట్ నుండి షేర్ చేశారు. ఈ వీడియో చూసిన పలువురు షాకవుతున్నారు. 'అమ్మాయిలు, చిన్న పిల్లలు ఇప్పటి ఫ్యాషన్ లో భాగంగా జుట్టు వదులుగా ఉంచుకుంటారు. జాయింట్ వీల్ రైడ్ లో అదెంత ప్రమాదమో ఈ సంఘటన రుజువుచేస్తోంది' అని ఒకరు కామెంట్ చేశారు. 'ఆ అమ్మాయి అదృష్టం ప్రాణాలు పోలేదు. వేగంగా వెళుతున్న జాయింట్ వీల్ లో చిక్కుకుంటే చాలా దారుణం జరుగుతుంది' అని మరొకరు కామెంట్ చేశారు. 'ఆడవారు, చిన్న పిల్లలు జాయింట్ వీల్ రైడ్ లో జాగ్రత్తగా ఉండాలి. జుట్టు వదిలేసి జాయింట్ వీల్ ఎక్కడానికి నిర్వాహకులు అనుమతి ఇవ్వకూడదు' అని మరొకరు కామెంట్ చేశారు.

Laptop: ల్యాప్‌టాప్ కొనే ఆలోచనలో ఉన్నారా? ఈ 6 తప్పులు చేశారంటే భారీగా నష్టపోవడం ఖాయం!


Updated Date - 2023-10-01T13:31:19+05:30 IST