Viral Video: వారెవ్వా.. ఏం ట్రైనింగ్ ఇచ్చావు బాసూ.. కుర్రాడితో బ్యాట్మింటన్ ఆడుకుంటున్న మూడు పిల్లులు..!

ABN , First Publish Date - 2023-04-12T15:07:47+05:30 IST

ఈ వీడియోను చూసిన నెటిజన్లు తమ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. సూపర్.. వావ్ గ్రేట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. వారెవ్వా.. ఏం ట్రైనింగ్ ఇచ్చావు బాసూ అంటూ మురిసిపోతున్నారు. ఈ క్యాట్స్ బ్యాడ్మింటన్‌ను

Viral Video: వారెవ్వా.. ఏం ట్రైనింగ్ ఇచ్చావు బాసూ.. కుర్రాడితో బ్యాట్మింటన్ ఆడుకుంటున్న మూడు పిల్లులు..!

బ్యాడ్మింటన్‌ (Badminton)కు ప్రపంచ వ్యాప్తంగా ఎంత ప్రజాదరణ ఉందో వేరే చెప్పక్కర్లేదు. ఈ ఆటకు కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. ఆట జరిగినంత సేపు టీవీకి అతుక్కుపోతారు. అంతగా ఈ గేమ్‌కు క్రేజ్ ఉంది. ఈ ఆటను మనుషులు ఆడటం చూశాం గానీ.. జంతువులు ఆడటం ఎప్పుడైనా చూశారా? వింటేనే ఆశ్చర్యంగా ఉంది కదూ? కానీ ఇది నిజం. ఓ కుర్రాడు.. క్యాట్స్‌తో బ్యాడ్మింటన్ ఆడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ (Viral Video) అవుతోంది.

సర్కస్‌లో జంతువులను ట్రైనర్ ఎలా ఆడిస్తే అలా ఆడుతుంటాయి. ప్రదర్శనశాలలో జంతువులు చేసే కొన్ని విన్యాసాలతోనే సంబరపడిపోతాం. ఈలలు, చప్పట్లతో ఉత్సాహపరుస్తాం. కానీ పిల్లులు ఎప్పుడైనా బ్యాడ్మింటన్ ఆడటం చూశారా? ఈ వీడియో చూశాక.. మీరేం చేస్తారో ఆలోచించండి.

వీడియోలో ఓ కుర్రాడు బ్యాడ్మింటన్ (Badminton) రాకెట్ పట్టుకుని ఉండగా.. అతని ఎదురుగా మూడు పిల్లులు (Three Cats) ఉన్నాయి. ఓ పిల్లి డస్ట్‌బిన్‌పై కూర్చోగా మరో రెండు పిల్లలు కింద ఉన్నాయి. ఆ అబ్బాయి (Human Playing) బ్యాడ్మింటన్ రాకెట్‌తో కాక్‌ను కొట్టగానే డస్ట్‌బిన్‌పై కూర్చున్న క్యాట్ దాని చేతులతో రివర్స్ కొడుతుంది. కింద ఉన్న పిల్లి చేతికి ఆ కాక్ అందకపోయినప్పటికీ ఎగిరి మరీ కాళ్లతో తన్నుతుంది. ఇంకో పిల్లి ఎగిరి డస్ట్‌బిన్‌ ఓపెన్ చేసేదానిపై కాల్ వేయగానే దాని మీద ఉన్న క్యాట్ ఎగిరి ముందు పడింది. ఇలా మూడు పిల్లలు ఆడిన ఆట తెగ ముచ్చటేస్తోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు తమ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. సూపర్.. వావ్ గ్రేట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. వారెవ్వా.. ఏం ట్రైనింగ్ ఇచ్చావు బాసూ అంటూ మురిసిపోతున్నారు. ఈ క్యాట్స్ బ్యాడ్మింటన్‌ను మీరూ చూసేయండి.

ఇది కూడా చదవండి: అన్నీ మర్చిపోదాం.. ఇంటికి రండని పిలిస్తే.. ప్రేమ పెళ్లయిన 4 ఏళ్లకు భార్యతో సహా ఇంటికి వెళ్లాడా భర్త.. 10 రోజుల తర్వాత..

Updated Date - 2023-04-12T15:07:47+05:30 IST