Walking with Shari: తంజావూరులో ‘వాకింగ్‌ విత్‌ శారీ’ పోటీలు

ABN , First Publish Date - 2023-02-19T08:57:22+05:30 IST

తంజావూరులో మొట్టమొదటిసారిగా నిర్వహించిన ‘వాకింగ్‌ విత్‌ శారీ’(Walking with Shari) పోటీల్లో సుమారు 2 వేల మందికి పైగా మహిళలు

Walking with Shari: తంజావూరులో ‘వాకింగ్‌ విత్‌ శారీ’ పోటీలు

పెరంబూర్‌(చెన్నై), ఫిబ్రవరి 18: తంజావూరులో మొట్టమొదటిసారిగా నిర్వహించిన ‘వాకింగ్‌ విత్‌ శారీ’(Walking with Shari) పోటీల్లో సుమారు 2 వేల మందికి పైగా మహిళలు పాల్గొన్నారు. తంజావూరు ఇన్నర్‌ సంఘ సిల్వర్‌ జాబ్లీ వేడుకల్లో భాగంగా సంప్రదాయ దుస్తులపై ప్రజలకు అవగాహన కల్పించేలా ‘చీరతో ఒక నడక’ అనే పోటీ నిర్వహించింది. తంజావూరు బృహదీశ్వర ఆలయం ముందు నిర్వహించిన ఈ పోటీలను కలెక్టర్‌ పొన్‌రాజ్‌ ఆలివర్‌, మేయర్‌ రామనాథన్‌, కార్పొరేషన్‌ కమిషనర్‌ శరవరణ కుమార్‌(Saravaran Kumar) ప్రారంభించారు. పోటీల్లో 18 నుంచి 35 ఏళ్ల వరకు మహిళకు 4 కి.మీ, 36 నుంచి 59 ఏళ్లలోపున్న మహిళలకు 3 కి.మీ, 60 ఏళ్లు మించిన వారికి కి.మీ అని మూడు విభాగాల్లో నిర్వహించారు. పోటీల్లో విజేతలకు నగదు బహుమతి, సర్టిఫికెట్‌ అందజేశారు.

Updated Date - 2023-02-19T08:57:24+05:30 IST