ధోనీ, యువీ, మిథాలీకి అరుదైన గౌరవం

ABN , First Publish Date - 2023-04-06T01:02:20+05:30 IST

టీమిండియా మాజీ కెప్టెన్లు ఎంఎస్‌ ధోనీ, మిథాలీరాజ్‌తోపాటు మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌కు అరుదైన గౌరవం దక్కింది. ప్రతిష్ఠాత్మక మెరిల్‌బోన్‌

ధోనీ, యువీ, మిథాలీకి అరుదైన గౌరవం

ఎంసీసీ జీవితకాల సభ్యత్వం జూ రైనా, జులన్‌కు కూడా..

లండన్‌ : టీమిండియా మాజీ కెప్టెన్లు ఎంఎస్‌ ధోనీ, మిథాలీరాజ్‌తోపాటు మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌కు అరుదైన గౌరవం దక్కింది. ప్రతిష్ఠాత్మక మెరిల్‌బోన్‌ క్రికెట్‌ క్లబ్‌ (ఎంసీసీ) ఈ ముగ్గురికి తమ క్లబ్‌ గౌరవ జీవితకాల సభ్యత్వాన్ని ప్రకటించింది. వీరితోపాటు సురేశ్‌ రైనా, జులన్‌ గోస్వామికి కూడా ఆ గౌరవం లభించింది. టెస్ట్‌లు ఆడుతున్న ఎనిమిది దేశాల నుంచి పురుష, మహిళా క్రికెటర్లకు ఎంసీసీ ఈ ఏడాది గౌరవ జీవితకాల సభ్యత్వాన్ని బుధవారం ప్రకటించింది. భారత్‌తోపాటు ఇంగ్లండ్‌నుంచి ఐదుగురికి ఈ గౌరవం దక్కింది. అలాగే ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్‌, న్యూజిలాండ్‌, పాకిస్థాన్‌, సౌతాఫ్రికా, వెస్టిండీస్‌ ఆటగాళ్లు ఈ జాబితాలో ఉన్నారు. మోర్గాన్‌, కెవిన్‌ పీటర్సన్‌, డేల్‌ స్టెయిన్‌, రాస్‌ టేలర్‌, రాచెల్‌ హేన్స్‌, మహ్మద్‌ హఫీజ్‌, మష్రఫే మోర్తజా తదితరులు సభ్యత్వం అందుకోనున్నారు.

Updated Date - 2023-04-06T06:55:42+05:30 IST