2023-24 సీజన్‌లో స్వదేశంలో భారత్ ఆడే మ్యాచ్‌లు ఇవే!.. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌తో ఎప్పుడంటే..
ABN , First Publish Date - 2023-07-25T22:01:05+05:30 IST
భారత జట్టు రాబోయే 8 నెలల కాలంలో స్వదేశంలో ఆడబోయే మ్యాచ్‌ల షెడ్యూల్‌ను బీసీసీఐ ప్రకటించింది. 6 నెలల వ్యవధిలోనే టీమిండియా పలు జట్లతో 16 మ్యాచ్‌ల్లో తలపడనుంది. ఆస్ట్రేలియాతో 3 వన్డేలు, 5 టీ20 మ్యాచ్‌లు, ఆప్ఘనిస్థాన్‌తో 3 టీ20లు, ఇంగ్లండ్‌తో 5 టెస్టులు ఆడనుంది.
భారత జట్టు రాబోయే 8 నెలల కాలంలో స్వదేశంలో ఆడబోయే మ్యాచ్‌ల షెడ్యూల్‌ను బీసీసీఐ ప్రకటించింది. 6 నెలల వ్యవధిలోనే టీమిండియా పలు జట్లతో 16 మ్యాచ్‌ల్లో తలపడనుంది. ఆస్ట్రేలియాతో 3 వన్డేలు, 5 టీ20 మ్యాచ్‌లు, ఆప్ఘనిస్థాన్‌తో 3 టీ20లు, ఇంగ్లండ్‌తో 5 టెస్టులు ఆడనుంది. మొదటగా వన్డే ప్రపంచకప్‌నకు కంటే ముందు ఆస్ట్రేలియాతో స్వదేశంలో టీమిండియా 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడనుంది. సెప్టెంబర్ 22, 24, 27వ తేదీల్లో ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ మ్యాచ్‌లకు మొహాలీ, ఇండోర్, రాజ్‌కోట్ అతిథ్యమివ్వనున్నాయి. ఆ తర్వాత భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్ జరగనుంది. ఆ తర్వాత నవంబర్‌లో మళ్లీ ఆస్ట్రేలియాతోనే భారత జట్టు 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. నవంబర్ 23, 26, 28, డిసెంబర్ 1, 3 తేదీల్లో ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి. వైజాగ్, కేరళ, గౌహతి, నాగ్‌పూర్, హైదరాబాద్‌లలో ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఆస్ట్రేలియా సిరీస్‌తో ఈ సంవత్సరం స్వదేశంలో భారత్ మ్యాచ్‌లు ముగియనున్నాయి.
నూతన సంవత్సరం 2024లో ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగే 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్ ద్వారా స్వదేశంలో భారత్ మ్యాచ్‌లు ప్రారంభమవుతాయి. జనవరి 11, 14, 17వ తేదీల్లో ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి. మొహాలీ, ఇండోర్, బెంగళూరు మైదానాలు ఈ మ్యాచ్‌లకు అతిథ్యం ఇవ్వనన్నాయి. ఆ తర్వాత ఇంగ్లండ్‌తో భారత జట్టు స్వదేశంలో 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడనుంది. జనవరి 25 నుంచి మార్చి 7 మధ్య ఈ సిరీస్ జరగనుంది. హైదరాబాద్‌లో జరిగే మొదటి టెస్టు మ్యాచ్ జనవరి 25 నుంచి 29 మధ్య జరగనుంది. వైజాగ్‌లో జరిగే రెండో టెస్టు ఫిబ్రవరి 2 నుంచి 6 మధ్య జరగనుంది. రాజ్‌కోట్ వేదికగా జరిగే మూడో టెస్ట్ మ్యాచ్ ఫిబ్రవరి 15 నుంచి 19 మధ్య జరగనుంది. రాంచీ అతిథ్యం ఇవ్వనున్న నాలుగో టెస్ట్ మ్యాచ్ ఫిబ్రవరి 23 నుంచి 27 మధ్య జరగనుంది. మార్చి 7 నుంచి 11 మధ్య జరిగే చివరిదైన ఐదో టెస్ట్ మ్యాచ్ ధర్మశాల వేదికగా జరగనుంది.