-
-
Home » Sports » Cricket News » ipl auction 2024 live updates new players list mi csk rcb gt kkr lsg rr srh pbks dc sold and unsold players latest news in telugu vrv
-
IPL Auction 2024 Live Updates: ఆస్ట్రేలియా బౌలర్ స్పెన్సర్ జాన్సన్‌కు రూ.10 కోట్ల జాక్‌పాట్
ABN , First Publish Date - Dec 19 , 2023 | 11:56 AM
క్రికెట్ అభిమానులు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ మినీ వేలం ప్రారంభమైంది. మొత్తం 333 మంది ఆటగాళ్లు వేలంలో పాల్గొంటున్నారు. అన్నీ ఫ్రాంచైజీలు కలిసి 333 మందిలో 76 మంది ఆటగాళ్లను కొనుగోలు చేయనున్నాయి.
Live News & Update
-
2023-12-19T20:16:23+05:30
వేలంలో అన్‌క్యాప్డ్ ప్లేయర్స్ ధర
జాతవేద్ సుబ్రహ్మణ్యం-రూ.20 లక్షలు (SRH)
ప్రిన్స్ చౌదరి - రూ.20 లక్షలు (CSK)
రాబిన్ మింజ్-రూ.3.6 కోట్లు (GT)
తనయ్ త్యాగరాజన్-రూ.20 లక్షలు (CSK)
శశాంక్ సింగ్-రూ.20 లక్షలు (CSK)
విశ్వంత్ ప్రతాప్ సింగ్ - రూ.20 లక్షలు (CSK)
-
2023-12-19T20:05:38+05:30
ఆక్షన్‌లో మల్లిక ముద్ర.. ఇంతకీ ఆమె ఎవరు?
-
2023-12-19T19:56:37+05:30
సుమిత్ కుమార్‌కు రూ.కోటి
జార్ఖండ్ ఆటగాడు సుమిత్ కుమార్‌ను రూ.కోటికి ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది
-
2023-12-19T19:52:16+05:30
అమ్ముడుపోని ప్లేయర్స్
తైమల్ మిల్స్, ఆడమ్ మిల్నే, సందీప్ వారియర్, ల్యూక్ వుడ్, మ్యాట్ హెన్రీ, కైల్ జేమీసన్, షాయ్ హోప్, దుష్మంత చమీర, జిమ్మీ నీషమ్, ఒడియన్ స్మిత్, మిచెల్ బ్రేస్‌వెల్, వాండర్ డుసెన్, కొలిన్ మున్రో, కీమో పాల్, బెన్ డ్వార్షియస్
-
2023-12-19T19:49:05+05:30
నువాన్ తుషారకు రూ.4.8 కోట్లు
శ్రీలంక బౌలర్ నువాన్ తుషారను రూ.4.8 కోట్లకు ముంబై ఇండియన్స్ సొంతం చేసుకుంది
-
2023-12-19T19:46:57+05:30
జై రిచర్డ్‌సన్‌కు రూ.5 కోట్లు
ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ జై రిచర్డ్‌సన్‌ను రూ.5 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకుంది
-
2023-12-19T19:44:49+05:30
ముస్తాఫిజుర్ రెహ్మాన్‌కు రూ.2 కోట్లు
బంగ్లాదేశ్ సీనియర్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్‌ను రూ.2 కోట్లకు చెన్నై సూపర్ కింగ్స్ సొంతం చేసుకుంది
-
2023-12-19T19:38:30+05:30
స్పెన్సర్ జాన్సన్‌కు రూ.10 కోట్లు
ఆస్ట్రేలియాకు చెందిన బౌలర్ స్పెన్సర్ జాన్సన్‌ను రూ.10 కోట్లకు గుజరాత్ టైటాన్స్ కొనుగోలు చేసింది
-
2023-12-19T19:34:39+05:30
డేవిడ్ విల్లీకి రూ.2 కోట్లు
ఇంగ్లండ్ స్టార్ బౌలర్ డేవిడ్ విల్లీని కనీస ధర రూ.2 కోట్లకు లక్నో సూపర్ జెయింట్స్ కొనుగోలు చేసింది
-
2023-12-19T19:33:15+05:30
టామ్ కరణ్‌కు రూ.1.5 కోట్లు
ఇంగ్లండ్ పేస్ బౌలర్ టామ్ కరణ్‌ను రూ.1.5 కోట్లకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సొంతం చేసుకుంది
-
2023-12-19T19:31:49+05:30
ఆష్టన్ టర్నర్‌కు రూ.కోటి
ఆస్ట్రేలియా ఆటగాడు ఆష్టన్ టర్నర్‌ను రూ.కోటికి లక్నో సూపర్ జెయింట్స్ కొనుగోలు చేసింది
-
2023-12-19T19:25:02+05:30
రూథర్‌ఫోర్డ్‌కు రూ.1.5 కోట్లు
బిగ్ హిట్టర్ రూథర్‌ఫోర్డ్‌ను రూ.1.5 కోట్లకు కోల్‌కతా నైట్‌రైడర్స్ కొనుగోలు చేసింది
-
2023-12-19T18:40:54+05:30
అమ్ముడుపోని ప్లేయర్స్
మురుగన్ అశ్విన్, పుల్‌కిత్ నారంగ్, ఇషాన్ పొరెల్, కుల్‌దీప్ యాదవ్ (అన్‌క్యాప్డ్), విష్ణు సోలంకి
-
2023-12-19T18:36:25+05:30
శ్రేయాస్ గోపాల్‌కు రూ.20 లక్షలు
కర్ణాటక స్పిన్నర్ శ్రేయాస్ గోపాల్‌ను కనీస ధర రూ.20 లక్షలకు ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది
-
2023-12-19T18:34:08+05:30
ఎం.సిద్ధార్థ్‌కు రూ.2.4 కోట్లు
తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో ఆకట్టుకున్న ఆటగాడు ఎం.సిద్ధార్థ్‌ను రూ.2.4 కోట్లకు లక్నో సూపర్ జెయింట్స్ కొనుగోలు చేసింది.
-
2023-12-19T18:30:23+05:30
మనవ్ సుతార్‌కు రూ.20 లక్షలు
అన్‌క్యాప్డ్ స్పిన్నర్ మనవ్ సుతార్‌ను కనీస ధర రూ.20 లక్షలకు గుజరాత్ టైటాన్స్ సొంతం చేసుకుంది.
-
2023-12-19T18:27:46+05:30
కార్తీక్ త్యాగికి రూ.60 లక్షలు
బౌలర్ కార్తీక్ త్యాగిని రూ.60 లక్షలకు గుజరాత్ టైటాన్స్ సొంతం చేసుకుంది
-
2023-12-19T18:22:09+05:30
ఆకాష్ సింగ్‌కు రూ.20 లక్షలు
అన్ క్యాప్డ్ ఆటగాడు ఆకాష్ సింగ్‌ను రూ.20 లక్షలకు సన్‌రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది
-
2023-12-19T18:20:17+05:30
సుశాంత్ మిశ్రాకు రూ.2.2 కోట్లు
అండర్-19 ఆటగాడు సుశాంత్ మిశ్రాను రూ.2.2 కోట్లకు గుజరాత్ టైటాన్స్ దక్కించుకుంది
-
2023-12-19T18:15:36+05:30
కుమార్ కుషాగ్రాకు రూ.7.2 కోట్లు
జార్ఖండ్ వికెట్ కీపర్ కుమార్ కుషాగ్రాను రూ.7.2 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది.
-
2023-12-19T18:05:55+05:30
రికీ భుయ్‌కు రూ.20 లక్షలు
అన్ క్యాప్డ్ వికెట్ కీపర్ రికీ భుయ్‌ను కనీస ధర రూ.20 లక్షలకు ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది
-
2023-12-19T17:56:56+05:30
ఇంకా ఎవరి దగ్గర ఎంత పర్స్ ఉంది?
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: 11.75 కోట్లు
కోల్‌కతా నైట్‌రైడర్స్: 6.55 కోట్లు
పంజాబ్ కింగ్స్: 13.15 కోట్లు
చెన్నై సూపర్ కింగ్స్: 3.20 కోట్లు
ఢిల్లీ క్యాపిటల్స్: 24.45 కోట్లు
రాజస్థాన్ రాయల్స్: 1.30 కోట్లు
ముంబై ఇండియన్స్: 8.15 కోట్లు
సన్‌రైజర్స్ హైదరాబాద్: 3.60 కోట్లు
లక్నో సూపర్ జెయింట్స్: 6.55 కోట్లు
గుజరాత్ టైటాన్స్: 24.45 కోట్లు
-
2023-12-19T17:55:31+05:30
అర్షిన్ కులకర్ణికి రూ.20 లక్షలు
అండర్-19 ఆల్‌రౌండర్ అర్షిన్ కులకర్ణిని కనీస ధర రూ.20 లక్షలకు లక్నో సూపర్ జెయింట్స్ కొనుగోలు చేసింది
-
2023-12-19T17:50:01+05:30
రమణ్‌దీప్ సింగ్‌కు రూ.20 లక్షలు
అన్‌క్యాప్డ్ ఆటగాడు రమణ్‌దీప్ సింగ్‌ను రూ.20 లక్షలకు కోల్‌కతా నైట్‌రైడర్స్ సొంతం చేసుకుంది
-
2023-12-19T17:48:19+05:30
షారుఖ్ ఖాన్‌కు రూ.7.4 కోట్లు
మిడిలార్డర్ బ్యాటర్ షారుఖ్ ఖాన్‌ను రూ.7.4 కోట్లకు గుజరాత్ టైటాన్స్ దక్కించుకుంది.
-
2023-12-19T17:44:57+05:30
ఐపీఎల్ వేలంలో సరికొత్త రికార్డులు
-
2023-12-19T17:43:09+05:30
శుభమ్ దూబేకు రూ.5.8 కోట్లు
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో రాణించిన అన్‌క్యాప్డ్ ఆటగాడు శుభమ్ దూబేను రాజస్థాన్ రాయల్స్ రూ.5.8 కోట్లకు సొంతం చేసుకుంది.
-
2023-12-19T17:39:10+05:30
రఘువంశీకి రూ.20 లక్షలు
అన్‌క్యాప్డ్ ఆటగాడు అంక్రిష్ రఘువంశీని కోల్‌కతా నైట్‌రైడర్స్ రూ.20 లక్షలకు దక్కించుకుంది
-
2023-12-19T17:37:40+05:30
సమీర్ రిజ్వీకి రూ.8.4 కోట్లు
అన్‌క్యాప్డ్ ఆటగాడు సమీర్ రిజ్వీని చెన్నై సూపర్ కింగ్స్ రూ.8.4 కోట్లకు కొనుగోలు చేసింది
-
2023-12-19T16:57:59+05:30
పంజాబ్ కింగ్స్‌కు కొత్త డెత్ బౌలర్
-
2023-12-19T16:33:50+05:30
వేలంలో పాల్గొన్న రిషబ్ పంత్
ఢిల్లీ క్యాపిటల్స్ రెగ్యులర్ కెప్టెన్ రిషబ్ పంత్ ఐపీఎల్ వేలంలో పాల్గొన్నాడు. గాయం కారణంగా అతడు ఈ ఏడాది జరిగిన ఐపీఎల్‌లో పాల్గొనలేదు.
-
2023-12-19T16:00:35+05:30
అమ్ముడుపోని ప్లేయర్స్
ఆదిల్ రషీద్, వకార్ సలాంకీల్, అకీల్ హుస్సేన్, ఇష్ సోథీ, తాబ్రాజ్ షాంసీ, ముజీబుర్ రెహ్మాన్, జాష్ హేజిల్‌వుడ్
-
2023-12-19T15:58:48+05:30
ఆదిల్ రషీద్‌ను కొనుగోలు చేయని ఫ్రాంచైజీలు
ఇంగ్లండ్ స్టార్ స్పిన్నర్ ఆదిల్ రషీద్‌ను వేలంలో ఫ్రాంచైజీలు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపలేదు
-
2023-12-19T15:56:19+05:30
దిల్షాన్ మధుశంకకు రూ.4.6 కోట్లు
శ్రీలంక బౌలర్ దిల్షాన్ మధుశంకను రూ.4.6 కోట్లకు ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది
-
2023-12-19T15:54:04+05:30
జైదేవ్ ఉనద్కట్‌కు రూ.1.6 కోట్లు
టీమిండియా బౌలర్ జైదేవ్ ఉనద్కట్‌ను రూ.1.6 కోట్లకు సన్‌రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది
-
2023-12-19T15:48:36+05:30
కమిన్స్ రికార్డును బ్రేక్ చేసిన మిచెల్ స్టార్క్
ప్యాట్ కమిన్స్ రికార్డును మిచెల్ స్టార్క్ బ్రేక్ చేశాడు. ఆస్ట్రేలియాకు చెందిన అతడిని కోల్‌కతా నైట్‌రైడర్స్ రికార్డు స్థాయిలో రూ.24.75 కోట్లకు కొనుగోలు చేసింది. ఐపీఎల్ చరిత్రలో ఇదే అత్యధిక ధర కావడం గమనించాల్సిన విషయం.
-
2023-12-19T15:31:15+05:30
శివం మావికి రూ.6.4 కోట్లు
భారత్‌కు చెందిన బౌలర్ శివం మావిని రూ.6.4 కోట్లకు లక్నో సూపర్ జెయింట్స్ దక్కించుకుంది.
-
2023-12-19T15:27:08+05:30
ఉమేష్ యాదవ్‌కు రూ.3.4 కోట్లు
టీమిండియా బౌలర్ ఉమేష్ యాదవ్‌ను రూ.3.4 కోట్లకు గుజరాత్ టైటాన్స్ దక్కించుకుంది
-
2023-12-19T15:23:15+05:30
అల్జారీ జోసెఫ్‌కు రూ.11.5 కోట్లు
వెస్టిండీస్ బౌలర్ అల్జారీ జోసెఫ్‌ను రూ.11.5 కోట్లకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దక్కించుకుంది
-
2023-12-19T15:18:28+05:30
చేతన్ సకారియాకు రూ.50 లక్షలు
టీమిండియా స్పిన్నర్ చేతన్ సకారియాను రూ.50 లక్షల కనీస ధరకు కోల్‌కతా నైట్‌రైడర్స్ కొనుగోలు చేసింది
-
2023-12-19T15:15:54+05:30
అమ్ముడుపోని ప్లేయర్స్
లోకీ ఫెర్గుసన్, కుశాల్ మెండిస్, జాష్ ఇంగ్లీస్, ఫిల్ సాల్ట్
-
2023-12-19T15:14:13+05:30
కేఎస్ భరత్‌కు రూ.50 లక్షలు
టీమిండియా వికెట్ కీపర్ కేఎస్ భరత్‌ను రూ.50 లక్షల కనీస ధరకు కోల్‌కతా నైట్‌రైడర్స్ కొనుగోలు చేసింది
-
2023-12-19T15:11:44+05:30
స్టబ్స్‌కు రూ.50 లక్షలు
దక్షిణాఫ్రికాకు చెందిన వికెట్ కీపర్ ట్రిస్టాన్ స్టబ్స్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ రూ.50 లక్షలకు దక్కించుకుంది
-
2023-12-19T15:10:59+05:30
అమ్ముడుపోని ఫిల్ సాల్ట్
ఇంగ్లండ్‌కు చెందిన వికెట్ కీపర్ ఫిల్ సాల్ట్‌ను వేలంలో ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపలేదు
-
2023-12-19T15:01:06+05:30
అమ్ముడుపోని ప్లేయర్స్
స్టీవ్ స్మిత్, రిలీ రోసో, మనీష్ పాండే, కరుణ్ నాయర్
-
2023-12-19T14:45:39+05:30
పంజాబ్‌లోకి వోక్స్
ఇంగ్లండ్ ఆల్ రౌండర్ క్రిస్ వోక్స్‌ను రూ.4.20 కోట్లకు పంజాబ్ కింగ్స్ దక్కించుకుంది. కాగా ఈ వేలంలోకి క్రిస్ వోక్స్ రూ.2 కోట్ల కనీస ధరతో వచ్చాడు.
-
2023-12-19T14:15:26+05:30
ముంబైకి గెరాల్డ్ కోయెట్జీ
రూ. 2 కోట్ల కనీస ధరతో వేలంలోకి వచ్చిన గెరాల్డ్ కోయెట్జీను ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది. ఆ జట్టు రూ.5 కోట్లకు గెరాల్డ్ కోయెట్జీను దక్కించుకుంది.
-
2023-12-19T14:15:23+05:30
హర్షల్ పటేల్‌కు భారీ ధర
రూ.2 కోట్ల కనీస ధరతో వేలంలోకి వచ్చిన 33 ఏళ్ల టీమిండియా పేసర్ హర్షల్ పటేల్‌కు భారీ ధర దక్కింది. రూ.11.75 కోట్లకు పంజాబ్ కింగ్స్ కొనుగోలు చేసింది. హర్షల్ పటేల్ కోసం గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ జట్లు పోటీ పడ్డాయి. చివరికి పంజాబ్ దక్కించుకుంది.
-
2023-12-19T14:15:14+05:30
ఐపీఎల్ చరిత్రలోనే ఆస్ట్రేలియా కెప్టెన్‌కు రికార్డు ధర
రూ. 2 కోట్ల కనీస ధరతో వేలంలోకి వచ్చిన ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధరకు అమ్ముడుపోయాడు. ఏకంగా రూ.20.50 కోట్లకు సన్ రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది. కమిన్స్ కోసం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు తీవ్రంగా పోటీ పడ్డాయి. కాగా కమిన్స్‌కు గత రెండు సీజన్లలో కూడా భారీ ధర లభించింది.
-
2023-12-19T14:00:55+05:30
రచిన్ రవీంద్రను ఎవరు కొన్నారంటే..?
రూ.50 లక్షల బేస్ ధరతో వేలం బరిలోకి దిగిన న్యూజిలాండ్ యువ ఆల్ రౌండర్ రచిన్ రవీంద్రను రూ.1.80 కోట్లకు చెన్నైసూపర్ కింగ్స్ కొనుగోలు చేసింది. పంజాబ్, చెన్నై జట్లు రవీంద్ర కోసం పోటీ పడ్డాయి. చివరికి చెన్నై దక్కించుకుంది.
-
2023-12-19T14:00:39+05:30
చెన్నైకి శార్దూల్
రూ.2 కోట్ల బేస్ ప్రైజ్‌తో వేలం బరిలోకి దిగిన టీమిండియా స్టార్ పేసర్ శార్దూల్ ఠాకూర్‌ను రూ.4 కోట్లకు చెన్నైసూపర్ కింగ్స్ కొనుగోలు చేసింది. సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా శార్దూల్ కోసం పోటీ పడినప్పటికీ తర్వత తప్పుకుంది.
-
2023-12-19T14:00:33+05:30
మరో ప్లేయర్‌ను కొన్న సన్‌రైజర్స్
ఐపీఎల్ వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ మరో ఆటగాడిని దక్కించుకుంది. శ్రీలంక ఆల్ రౌండర్ వసింద్ హసరంగను రూ.1.50 కోట్ల బేస్ ప్రైజ్ ధరకు కొనుగోలు చేసింది.
-
2023-12-19T14:00:24+05:30
గుజరాత్‌కు అజ్మతుల్లా
అజ్మతుల్లా ఒమర్జాయ్‌ను రూ.50 లక్షల బేస్ ప్రైజ్ ధరకు గుజరాత్ టైటాన్స్ కొనుగోలు చేసింది.
-
2023-12-19T13:45:16+05:30
సన్ రైజర్స్‌కు ట్రావిస్ హెడ్
రూ. 2 కోట్ల బేస్ ధరతో వేలంలోకి వచ్చిన ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ ట్రావిస్ హెడ్‌ను సన్ రైజర్స్ హైదరాబాద్ దక్కించుకుంది. రూ.6.80 కోట్లకు హైదరాబాద్ కొనుగోలు చేసింది.
-
2023-12-19T13:45:01+05:30
అమ్ముడుపోని తొలి ఆటగాడు ఎవరంటే..?
ఈ సీజన్ లో అమ్ముడుపోని తొలి ఆటగాడిగా కరుణ్ నాయర్ నిలిచాడు. భారత్‌కు చెందిన కరుణ్ నాయర్‌ను కొనడానికి ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపలేదు. మరో భారత ఆటగాడు మనీష్ పాండేను కూడా ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు.
-
2023-12-19T13:41:18+05:30
స్మిత్‌కు మొండి చేయి
ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్‌ను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. రూ.2 కోట్ల బేస్ ప్రైజ్‌తో వేలంలోకి వచ్చిన స్మిత్‌ను కొనడానికి ఏ ఫ్రాంచైజీ కూడా ఆసక్తి చూపలేదు.
-
2023-12-19T13:30:45+05:30
హ్యారీబ్రూక్ ఢిల్లీ సొంతం
ఇంగ్లండ్ ఆటగాడు హ్యారీ బ్రూక్ ను ఢిల్లీ క్యాపిటల్స్ రూ.4 కోట్లకు సొంతం చేసుకుంది. గత సీజన్ లో హ్యారీ బ్రూక్ సన్ రైజర్స్ హైదరాబాద్ కు ప్రాతినిధ్యం వహించాడు.
-
2023-12-19T13:15:24+05:30
రాజస్థాన్ కు పావెల్
వెస్టిండీస్ ఆటగాడు రోవ్‌మన్ పావెల్‌ను రూ.7.40 కోట్లకు రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు చేసింది.
-
2023-12-19T13:00:31+05:30
సెకండ్ సెట్‌లో ఎవరెవరంటే..?
ఐపీఎల్ 2024 వేలంలో మొదటి సెట్ ముగిసింది. రెండో సెట్‌లో పాట్ కమిన్స్, వసిందు హసరంత, డారిల్ మిచెల్, హర్షల్ పటేల్, శార్దూల్ ఠాకూర్, రచీన్ రవీంద్ర, క్రిస్ వోక్స్, గెరాల్డ్ కోయెట్జీ, అజ్మతుల్లా ఒమర్జాయ్ ఉన్నారు.
-
2023-12-19T13:00:00+05:30
ఐపీఎల్ వేలం ప్రారంభం
క్రికెట్ అభిమానులు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ మినీ వేలం ప్రారంభమైంది. మొత్తం 333 మంది ఆటగాళ్లు వేలంలో పాల్గొంటున్నారు. అన్నీ ఫ్రాంచైజీలు కలిసి 333 మందిలో 76 మంది ఆటగాళ్లను కొనుగోలు చేయనున్నాయి.
-
2023-12-19T12:30:00+05:30
ఐపీఎల్ 2024 ఎప్పుడు మొదలవుతుంది?
ఐపీఎల్ 2024 సీజన్ వచ్చే ఏడాది మార్చి 22 నుంచి ప్రారంభయ్యే అవకాశాలున్నాయి. మే చివరలో ఈ సీజన్ ముగియనుంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఐపీఎల్ జరిగే సమయంలోనే దేశంలో సాధారణ ఎన్నికలు కూడా ఉండనున్నాయి. దీంతో చివరి నిమిషంలో ఐపీఎల్ వేదిక మార్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.
-
2023-12-19T12:15:00+05:30
ఎవరికి డిమాండ్ ఉండనుంది?
ఈ మినీ వేలంలో అన్ని జట్లూ విదేశీ ఆటగాళ్లపైనే దృష్టి సారించబోతున్నాయి. దీంతో వీరికే జాక్‌పాట్ తగలవచ్చు. ముఖ్యంగా ట్రావిస్ హెడ్, రచిన్ రవీంద్ర, మిచెల్ స్టార్క్, కొట్జీ, అజ్మతుల్లా ఒమర్జాయ్, హసరంగల కోసం గట్టి పోటీ ఖాయమే. భారత్ నుంచి శార్దూల్, హర్షల్, షారుక్, చేతన్ సకారియాలపై దృష్టి సారించవచ్చు.
-
2023-12-19T12:06:00+05:30
మొత్తం ఉన్న డబ్బు ఎంత?
ఈ వేలంలో ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు అన్ని ఫ్రాంచైజీల దగ్గర కలిపి రూ.262 కోట్లు ఉన్నాయి. 333 మంది ఆటగాళ్లు వేలంలోకి దిగుతున్నప్పటికీ అన్ని ప్రాంచైజీలకు కలిపి 77 మంది ఆటగాళ్లను కొనుగులు చేయడానికి మాత్రమే అవకాశం ఉంది. అది కూడా స్వదేశీ ఆటగాళ్లను 47 మందిని, విదేశీయులను 30 మందిని కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
-
2023-12-19T12:00:03+05:30
ఐపీఎల్ వేలానికి అంతా సిద్ధం
ఐపీఎల్ వేలానికి అంతా సిద్ధమైంది. తొలిసారిగా ఓ మహిళ వేలాన్ని నిర్వహించనుండడం గమనార్హం. ఇటీవల ముగిసిన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలాన్ని నిర్వహించిన మల్లికా సాగర్ ఈ వేలాన్ని కూడా నిర్వహించనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రారంభంకానున్న ఈ వేలంలో మొత్తం 333 మంది ఆటగాళ్లు అదృష్టం పరీక్షించుకోనున్నారు. ఇందులో 214 మంది స్వదేశీ, 119 మంది విదేశీ ఆటగాళ్లున్నారు.