Share News

Sunil Gavaskar: ప్రపంచకప్ బాధ పోయింది.. ఇప్పుడు ఐపీఎల్‌పైనే దృష్టి

ABN , Publish Date - Dec 16 , 2023 | 02:55 PM

Sunil Gavaskar: టీమిండియా మాజీ క్రికెటర్, ప్రముఖ క్రికెట్ విశ్లేషకుడు సునీల్ గవాస్కర్ హాట్ కామెంట్లు చేశాడు. టీమిండియా అభిమానులకు వన్డే ప్రపంచకప్ పోయిన బాధ ఇప్పుడు లేదని.. ఇప్పుడు వాళ్ల దృష్టంతా ఐపీఎల్‌పైనే ఉందని ఎద్దేవా చేశాడు.

Sunil Gavaskar: ప్రపంచకప్ బాధ పోయింది.. ఇప్పుడు ఐపీఎల్‌పైనే దృష్టి

టీమిండియా మాజీ క్రికెటర్, ప్రముఖ క్రికెట్ విశ్లేషకుడు సునీల్ గవాస్కర్ హాట్ కామెంట్లు చేశాడు. టీమిండియా అభిమానులకు వన్డే ప్రపంచకప్ పోయిన బాధ ఇప్పుడు లేదని.. ఇప్పుడు వాళ్ల దృష్టంతా ఐపీఎల్‌పైనే ఉందని ఎద్దేవా చేశాడు. ఈ నెల 19న దుబాయ్ వేదికగా ఐపీఎల్ వేలం జరుగుతుందని.. దీంతో వచ్చే ఐపీఎల్ సీజన్‌లో ఆటగాళ్ల బదిలీల గురించి అందరూ చర్చించుకుంటున్నారని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. ఏ ఆటగాళ్లు ఏ జట్టుకు బదిలీ అవుతారు.. వేలంలో ఏ ఆటగాడు ఏ ఫ్రాంచైజీకి వెళ్తాడు అనే అంశాలపైనే టీమిండియా అభిమానులకు ఆసక్తి పెరిగిందని గవాస్కర్ అన్నాడు.

ఐసీసీ ప్రపంచకప్ ఫైనల్‌లో ఊహించని ఓటమి ఎదురు కాగా ఆ ఓటమి తాలూకూ అభిమానుల కన్నీళ్లు ఆవిరైపోయాయని గవాస్కర్ అన్నాడు. ఎలాంటి పరిస్థితి నుంచి అయినా బయటపడి ముందుకు సాగే సత్తా భారత్ క్రికెట్‌కు ఉందని మరోసారి నిరూపితమైందన్నాడు. టీమిండియా డైహార్డ్ క్రికెట్ ఫ్యాన్స్ మినహా మిగిలిన అభిమానులు ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు టీ20ల సిరీస్ గురించి పెద్దగా పట్టించుకోలేదని గవాస్కర్ స్పష్టం చేశాడు. కాగా ఇటీవల వన్డే ప్రపంచ కప్ కోల్పోయిన బాధను మరిచిపోలేకపోతున్నానని.. ఆ ఓటమి నుంచి బయటపడలేకపోతున్నానని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ భావోద్వేగం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.


మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Dec 16 , 2023 | 02:55 PM