Gujarat Vs Lucknow: లక్నోపై గుజరాత్ ఘనవిజయం.. భారీ లక్ష్య ఛేదనలో చతికిలపడ్డ లక్నో బ్యాటర్లు...

ABN , First Publish Date - 2023-05-07T19:30:51+05:30 IST

ఐపీఎల్ 2023లో (IPL2023) గుజరాత్ టైటాన్స్ (Gujarat titans) జైత్రయాత్ర కొనసాగుతోంది. విజయాల పరంపరలో దూసుకెళ్తోంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా లక్నో సూపర్. జెయింట్స్‌పై (Lucknow Super Giants) మరో గెలుపును సొంతం చేసుకుంది.

Gujarat Vs Lucknow: లక్నోపై గుజరాత్ ఘనవిజయం.. భారీ లక్ష్య ఛేదనలో చతికిలపడ్డ లక్నో బ్యాటర్లు...

అహ్మదాబాద్: ఐపీఎల్ 2023లో (IPL2023) గుజరాత్ టైటాన్స్ (Gujarat titans) జైత్రయాత్ర కొనసాగుతోంది. విజయాల పరంపరలో దూసుకెళ్తోంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌పై (Lucknow Super Giants) మరో గెలుపును సొంతం చేసుకుంది. 228 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో బ్యాటర్లను కట్టుదిట్టమైన బౌలింగ్‌‌తో కట్టడి చేసింది. దీంతో నిర్ణీత 20 ఓవర్లు ఆడిన లక్నో 7 వికెట్లు కోల్పోయి 171 పరుగులకే పరిమితమైంది. దీంతో 56 పరుగుల తేడాతో గుజరాత్ ఘనవిజయం సాధించింది. దీంతో ఈ ఐపీఎల్ సీజన్‌లో 8వ విజయం తన అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకుంది.

లక్నో బ్యాట్స్‌మెన్లలో కెయిల్ మేయర్స్ (48), క్వింటన్ డీకాక్ (70), దీపక్ హుడా (11), మార్కస్ స్టోయినిస్ (4), నికొలస్ పూరన్ (3), ఆయుష్ బదోని (21), స్వప్నిల్ సింగ్ (2 నాటౌట్), కృనాల్ పాండ్యా (0), రవి బిష్ణోయ్ (4 నాటౌట్) చొప్పున పరుగులు చేశారు. గుజరాత్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. ముఖ్యంగా మోహిత్ శర్మ లక్నో నడ్డి విరిచాడు. అత్యధికంగా 4 వికెట్లు తీశాడు. ఆ తర్వాత మహ్మద్ షమీ, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్ తలో వికెట్ తీశారు.

Updated Date - 2023-05-07T19:31:59+05:30 IST