LaLiga: గ్రామీణ ప్రాంతాల్లో ఫుట్‌బాల్‌పై పెరుగుతున్న ఆసక్తి
ABN , First Publish Date - 2023-02-17T19:18:48+05:30 IST
దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఫుట్‌బాల్‌పై ఆసక్తి క్రమంగా పెరుగుతోంది. విసెంటే ఫెర్రర్ ఫౌండేషన్, రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ (RDT), లాలిగా (LaLiga) ద్వారా
అనంతపురం: దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఫుట్‌బాల్‌పై ఆసక్తి క్రమంగా పెరుగుతోంది. విసెంటే ఫెర్రర్ ఫౌండేషన్, రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ (RDT), లాలిగా (LaLiga) ద్వారా ప్రాజెక్టులో పాల్గొనేవారి సంఖ్య క్రమంగా పెరుగుతుండడమే ఇందుకు నిదర్శనం. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో అత్యంత వెనకబడిన వర్గాల యువతలో ఫుట్‌బాల్ అభ్యాసాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో ఈ కూటమిని స్థాపించారు. 7-15 ఏళ్ల మధ్య వయసున్న 2 వేల మంది బాలబాలికలు క్రీడలను అభ్యసించే అవకాశం దీని ద్వారా లభించింది.
ప్రాజెక్ట్ పురోగతిని ఆన్‌సైట్ మూల్యాంకనం చేయడం, ప్రాజెక్ట్ భాగస్వాములతో సహకారాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో ఫండేసియన్ లాలిగా(FUNDACIÓN LaLiga) డైరెక్టర్ ఓల్గా డి లా ప్యయెంటె(Olga de la Fuente), లాలిగా మహిళా ఫుట్‌బాల్ విభాగం డైరెక్టర్ పెడ్రో మలాబియా అనంతపురంలో పర్యటించారు. వీరితో పాటు విసెంటే ఫెర్రర్ ఫౌండేషన్ డైరెక్టర్ జనరల్ లూజ్ మారియా సాన్జ్ కూడా ఉన్నారు.
విద్య, క్రీడల అభివృద్ధికి కేంద్రమైన బత్తలపల్లి ఆసుపత్రిని వీరు సందర్శించారు. సంస్థ చోదక శక్తి అయిన విసెంటే ఫెర్రర్ స్మారక చిహ్నం ఐదు దశాబ్దాలకు పైగా ఈ ప్రాంతంలో ఉంది. రెండో రోజు స్పానిష్ ప్రతినిధి బృందం ప్రాజెక్ట్ రెసిడెన్షియల్ అకాడమీలో అమ్మాయిలతో సమయాన్ని గడపగలిగింది. దీనిని గత సీజన్‌లో ఏర్పాటు చేశారు. దీని ద్వారా అనంతపురంలోని గ్రామీణ వర్గాల నుంచి 20 మంది బాలికలు సంవత్సరానికి ఆర్థిక, విద్యా స్కాలర్‌షిప్‌లు పొందేందుకు ఎంపికయ్యారు.
పర్యటన రెండో భాగంలో ఫండేసియన్ లాలిగా నుంచి సాంకేతిక శిక్షకుడు నేతృత్వంలోని ప్రాంతంలోని జట్ల నుంచి కోచ్‌లతో విభిన్న శిక్షణా వర్క్‌షాప్‌లు నిర్వహించారు. ఈ సందర్భంగా ఫండేసియన్ లాలిగా డైరెక్టర్ ఓల్గా డి లా ఫ్యుయెంటె మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో యువత అభివృద్ధికి, సామాజిక ఏకీకరణకు ప్రధాన సాధనాల్లో ఒకటిగా క్రీడ ఏకీకరణను చూడడం సంతోషంగా ఉందన్నారు. ఈ ప్రయాణంలో వారితో పాటు వెళ్లేందుకు తమను అనుమతించినందుకు విసెంటే ఫెర్రర్ ఫౌండేషన్‌కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు చెప్పారు.