Share News

HYD: రేవంత్‏రెడ్డి కోట్ల రూపాయలు దండుకుని టికెట్ ఇచ్చారు.. అభ్యర్థిని మార్చాల్సిందే..

ABN , First Publish Date - 2023-10-20T07:42:23+05:30 IST

కోట్ల రూపాయలు, విలువైన భూములు దండుకొని పార్టీ టికెట్లు అమ్ముకుంటున్నారంటూ సొంత పార్టీ నాయకులే

HYD: రేవంత్‏రెడ్డి కోట్ల రూపాయలు దండుకుని టికెట్ ఇచ్చారు.. అభ్యర్థిని మార్చాల్సిందే..

గోషామహల్‌(హైదరాబాద్), (ఆంధ్రజ్యోతి): కోట్ల రూపాయలు, విలువైన భూములు దండుకొని పార్టీ టికెట్లు అమ్ముకుంటున్నారంటూ సొంత పార్టీ నాయకులే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి(TPCC President Revanth Reddy)పై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. గోషామహల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి సునీతారావు(Sunita Rao)ను వెంటనే మార్చాలి... స్థానికంగా ఉన్న 12మంది సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుల్లో ఎవరికైనా టికెట్‌ కేటాయించాలని గురువారం నాంపల్లిలోని గాంధీభవన్‌లో నిరసన వ్యక్తం చేశారు. సునీతారావు నాన్‌ లోకల్‌... నియోజకవర్గం భౌగోళిక ఎల్లలు తెలియని.. ఎన్ని వార్డులు ఉన్నాయో అవగాహన లేని నాయకురాలిని ఎలా ప్రకటిస్తారని వారు ప్రశ్నించారు. తాము 12 మంది పార్టీ అధిష్టానానికి దరఖాస్తు పెట్టుకున్నామని... ఆనాడు టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి ఈ గోషామహల్‌ సీటును స్థానికులకే కేటాయిస్తామని హామీ ఇచ్చి మోసం చేశారని తీవ్రస్థాయిలో ఆరోపించారు. సునీతారావును ఈ ఎన్నికల్లో ఓడించి రేవంత్‌ రెడ్డికి బుద్ధి చెబతారని హెచ్చరించారు. గోషామహల్‌ బచావో.. సునీతారావు హఠావో... జై కాంగ్రెస్‌.. జై జై కాంగ్రెస్‌ అంటూ నినాదాలు చేశారు. ఈ ధర్నాలో గోషామహల్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకురాలు ఎన్‌.వినయ్‌ ముదిరాజ్‌, కన్నయ్యలాల్‌ సాహు, ఏ బ్లాక్‌ అధ్యక్షులు సి.కె.మూర్తి, సంజయ్‌ కుమార్‌ యాదవ్‌, శ్రీధర్‌ గౌడ్‌, ఠాకూర్‌ రణవీర్‌ సింగ్‌, పృథ్వీ కుమార్‌ తివారీ పాల్గొన్నారు.

rrrr.jpg

reva.jpg

Powered byPerformoo logo
The video is not available or it's processing - Please check back later.

Updated Date - 2023-10-20T07:42:23+05:30 IST