Prakash Javadekar: ఉదయనిధి వ్యాఖ్యల్ని ఇండియా కూటమి ఎందుకు ఖండించట్లేదు

ABN , First Publish Date - 2023-09-06T15:20:06+05:30 IST

అన్ని ధర్మాలను సంరక్షించాలి.. అవమానించకూడదు. ఉదయనిధి స్టాలిన్ వెంటనే క్షమాపణ చెప్పాలి. ఉదయనిధి కామెంట్స్‌పై రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఎందుకు నిశబ్దంగా ఉన్నారు. కేంద్రానికి వ్యతిరేకంగా ఇండియా పేరిట వారంతా కూటమి ఏర్పాటు చేసుకున్నారు. ఆ కూటమిలో

Prakash Javadekar: ఉదయనిధి వ్యాఖ్యల్ని ఇండియా కూటమి ఎందుకు ఖండించట్లేదు

హైదరాబాద్: సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin) చేసిన వ్యాఖ్యలను బీజేపీ జాతీయ నేత ప్రకాష్ జవడేకర్ (Prakash Javadekar) ఖండించారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘అన్ని ధర్మాలను సంరక్షించాలి.. అవమానించకూడదు. ఉదయనిధి స్టాలిన్ వెంటనే క్షమాపణ చెప్పాలి. ఉదయనిధి కామెంట్స్‌పై రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఎందుకు నిశబ్దంగా ఉన్నారు. కేంద్రానికి వ్యతిరేకంగా ఇండియా పేరిట వారంతా కూటమి ఏర్పాటు చేసుకున్నారు. ఆ కూటమిలో ఒకరు.. దేశాన్ని అవమానించేలా వ్యాఖ్యానించారు. అందుకే రాహుల్ తన మౌనం వీడి దీనిపై మాట్లాడాలి. ఖర్గే కూడా దీనిపై స్పందించాలి. ఉదయనిధి సనాతన ధర్మాన్ని మాత్రమే అవమానించలేదు.. అన్ని ధర్మాలను అవమానించారు. భారత్ పేరుపై అంత రాద్దాంతం ఎందుకు? భారత్ గతంలో నుంచి ఉన్న పదమే కదా?, కలకత్తా.. చెన్నై.. మద్రాస్.. ముంబై.. బాంబే.. ఇవన్నీ మారాయి కదా?, భారత్ పదం మనది.. ఎప్పటి నుంచో భారత్ మాతాకి జై అంటున్నాం. భారత్ ప్రెసిడెంట్ అంటే వచ్చిన నష్టం ఏంటి?.’’ అని ప్రకాష్ జవడేకర్ ప్రశ్నించారు.

Updated Date - 2023-09-06T15:20:06+05:30 IST