BRS Meeting: బీఆర్‌ఎస్ పార్టీ జనరల్ బాడీ మీటింగ్.. ఉద్యమకారుల ఆవేదన

ABN , First Publish Date - 2023-03-21T11:50:58+05:30 IST

తెలంగాణ భవన్‌లో హైదరాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ జనరల్ బాడీ మీటింగ్ మంగళవారం ఉదయం ప్రారంభమైంది.

BRS Meeting:  బీఆర్‌ఎస్ పార్టీ జనరల్ బాడీ మీటింగ్.. ఉద్యమకారుల ఆవేదన

హైదరాబాద్: తెలంగాణ భవన్‌లో హైదరాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ జనరల్ బాడీ మీటింగ్ (BRS Party General Body Meeting) మంగళవారం ఉదయం ప్రారంభమైంది. మంత్రి తలసాని శ్రీనివాస్ (Minister Talasani Srinivas yadav) అధ్యక్షతన సమావేశం మొదలైంది. నగర మంత్రి మహామూద్ అలీ, హైదరాబాద్ జిల్లా పార్టీ ఇంచార్జి దాసోజు శ్రవణ్, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లు, కార్పోరేటర్‌లు, మాజీ కార్పోరేటర్‌లు, పలువురు పార్టీ నేతలు హాజరయ్యారు. పార్టీ ఆత్మీయ సమ్మేళనాలు, వచ్చే నెలలో నిర్వహించబోయే సెక్రటేరియట్ ప్రారంబోత్సవ సభ, అంబేద్కర్ విగ్రహ ప్రారంబోత్సవ సభ విజయవంతంపై చర్చ జరుగనుంది.

అయితే ఈ సమావేశంలో ఉద్యమకారులు తమ ఆవేదనను వెలిబుచ్చారు. మొదటి నుంచి పార్టీలో ఉన్న వారికి ప్రాధాన్యత లేదని ఉద్యమకారులు ఆవేదన చెందారు. ఎక్కడ నుంచో దిగుమతి అయినవారు పదవుల్లో ఉన్నారని అసహనం వ్యక్తం చేశారు. పార్టీ కోసం తాము రక్తం ధార పోశామని తెలంగాణ వచ్చాక తమకు గుర్తింపు లేదని ఉద్యమకారులు అసంతృప్తి వ్యక్తం చేశారు.

Updated Date - 2023-03-21T11:50:58+05:30 IST