Kishan Reddy : నీతివంతులైతే ఎందుకంత గగ్గోలు? కేసీఆర్ ఇక సర్దుకోవాలి..

ABN , First Publish Date - 2023-03-08T14:00:51+05:30 IST

ఈడీ కేసు విషయంలో నీతివంతులైతే ఎందుకు గగ్గోలు పెడుతున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు జారీ చేసిన విషయమై కిషన్ రెడ్డి స్పందించారు.

Kishan Reddy : నీతివంతులైతే ఎందుకంత గగ్గోలు? కేసీఆర్ ఇక సర్దుకోవాలి..

మహబూబ్ నగర్ : ఈడీ (ED) కేసు విషయంలో నీతివంతులైతే ఎందుకు గగ్గోలు పెడుతున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) ప్రశ్నించారు. ఢిల్లీ లిక్కర్ స్కాం (Delhi Liquor Scam) కేసులో ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha)కు ఈడీ నోటీసులు జారీ చేసిన విషయమై కిషన్ రెడ్డి స్పందించారు. కవితను తలవంచమని ఎవరూ చెప్పటం లేదన్నారు. తప్పులు లేకుంటే నిజాయితీని నిరూపించుకోవాలన్నారు. తెలంగాణ సమాజం అంటే మీ కుటుంబమేనా..? అని ప్రశ్నించారు. ‘ఢిల్లీకి వెళ్లి లిక్కర్ వ్యాపారం చేసింది.. సెల్ ఫోన్ పోన్లు పగల కొట్టింది.. అక్రమార్కులతో చేయి కలిపింది ఎవరో చెప్పాలి’ అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

చట్టం తన పని తాను చేసుకుపోతుందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఈడీ కేసుతో బీజేపీకి సంబంధం లేదన్నారు. నోటీసులకే ఉలిక్కి పడితే ఎలా.. అరెస్టు చేయలేదు కదా..? అన్నారు. అసెంబ్లీలో చర్చించాల్సిన అంశాలు.. ప్రగతి భవన్ (Pragati Bhavan) డైనింగ్ టేబుల్ మీద నాలుగున్నర కోట్ల ప్రజల భవితవ్యం నిర్ణయిస్తున్నారని విమర్శించారు. దళిత బంధు.. బీఆర్ఎస్ బంధుగా మారిందన్నారు. కేంద్రం తెలంగాణకు ఏం చేసిందో చర్చించడానికి సిద్ధమన్నారు. ప్రగతిభవన్ నుంచి ఫాంహౌజ్‌కు వెళ్లేందుకు సీఎం కేసీఆర్ (CM KCR) సర్దుకోవాలన్నారు. బీఆర్ఎస్ (BRS) కంటే వందశాతం మెరుగైన పాలన అందించే సత్తా బీజేపీ (BJP)కి ఉందన్నారు. మరోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే మాఫియా రెచ్చిపోతుందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

Updated Date - 2023-03-08T14:00:51+05:30 IST