TS NEWS: హైదరాబాద్‌లో రెచ్చిపోయిన విద్యార్థులు.. ఏం చేశారంటే..?

ABN , First Publish Date - 2023-09-21T18:03:22+05:30 IST

కూకట్‌పల్లి బాలాజీనగర్ తపస్య కాలేజీ(Balajinagar Tapasya College)లో విద్యార్థుల వీరంగం సృష్టించారు. నిన్న రోడ్డుపై విద్యార్థులు రౌడీల్లా రెచ్చిపోయారు.

TS NEWS: హైదరాబాద్‌లో రెచ్చిపోయిన విద్యార్థులు.. ఏం చేశారంటే..?

హైదరాబాద్: నగరంలో విద్యార్థులు రెచ్చిపోయారు. కూకట్‌పల్లి బాలాజీనగర్ తపస్య కాలేజీ(Balajinagar Tapasya College)లో విద్యార్థుల వీరంగం సృష్టించారు. నిన్న రోడ్డుపై విద్యార్థులు రౌడీల్లా ఓ విద్యార్థిపై 10 మంది విద్యార్ధులు దాడి చేశారు. దాడిలో ఇంటర్ సెకండియర్‌ విద్యార్థి ఫర్దీన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. విద్యార్థుల దాడితో పాఠశాలలోని మిగతా విద్యార్థులు కూడా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. విద్యార్థిపై దాడి చేసిన వారిని ఇంతవరకు పోలీసులు అదుపులోకి తీసుకోకపోవడంతో బాధిత విద్యార్థి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.పోలీసుల తీరుపై కాలేజీ దగ్గర విద్యార్థి తల్లితండ్రుల ఆందోళన చేపట్టారు.

Updated Date - 2023-09-21T18:03:22+05:30 IST