Kasani: చంద్రబాబుకు భయపడే జగన్ ఇలా చేస్తున్నారు

ABN , First Publish Date - 2023-09-19T16:29:59+05:30 IST

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌ను తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ తీవ్రంగా ఖండించారు.

Kasani: చంద్రబాబుకు భయపడే జగన్ ఇలా చేస్తున్నారు

హైదరాబాద్: టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌ను (Chandrababu Arrest) తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ (TTDP Chief Kasani Gnaneshwar) తీవ్రంగా ఖండించారు. ప్రజల్లో చంద్రబాబుకి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకనే తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో తెలుగుదేశం క్లీన్ స్వీప్ చేస్తుందన్నారు. చంద్రబాబుకు భయపడే జగన్ (AP CM Jagan reddy) ఇలా చేస్తున్నారని మండిపడ్డారు. మచ్చలేని మనిషిగా చంద్రబాబు బయటికి వస్తారన్నారు. అర చేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరని అన్నారు. ఎవ్వరు ఎన్ని కుట్రలు చేసిన చంద్రబాబును ఏమీ చేయలేరని స్పష్టం చేశారు. తెలుగు రాష్ట్రాలే కాదు... ప్రపంచమంతా చంద్రబాబు అభిమానులు భగ్గుమంటున్నారని కాసాని జ్ఞానేశ్వర్ పేర్కొన్నారు.

Powered byPerformoo logo
The video is not available or it's processing - Please check back later.

Updated Date - 2023-09-19T16:29:59+05:30 IST