Rains lash Telangana : వదలనంటున్న వర్షాలు.. తెలంగాణలో రేపు, ఎల్లుండి సెలవులు..!?
ABN , First Publish Date - 2023-07-23T20:56:14+05:30 IST
తెలంగాణలో ఇప్పట్లో వర్షాలు (TS Rains) తగ్గేలా కనిపించట్లేదు. ఆదివారం ఒక్కరోజు కాస్త గ్యాప్ ఇచ్చిన వర్షాలు.. సోమవారం నుంచి మరో ఐదురోజుల పాటు ఇవే వర్షాలు కంటిన్యూ కానున్నాయి. రాగల మూడు రోజుల్లో రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు (Heavy Rains) పడే అవకాశం ఉందని పేర్కొంది..
తెలంగాణలో ఇప్పట్లో వర్షాలు (TS Rains) తగ్గేలా కనిపించట్లేదు. ఆదివారం ఒక్కరోజు కాస్త గ్యాప్ ఇచ్చిన వర్షాలు.. సోమవారం నుంచి మరో ఐదురోజుల పాటు ఇలాగే కంటిన్యూ కానున్నాయి.! రాగల మూడు రోజుల్లో రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు (Heavy Rains) పడే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే 25, 26 వ తేదీల్లో భారీ నుంచి అతి భారీవర్షాలు అక్కడక్కడ వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అయితే రేపట్నుంచి పాఠశాలలు ఉంటాయని విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్లు వస్తుండటంతో వారు ఆందోళన చెందుతున్నారు. వర్షాల్లో కూడా బడికి పంపాల్సిందేనా..? స్కూల్‌కు వెళ్లేటప్పుడు గానీ.. తిరిగొచ్చేటప్పుడుగానీ ఏమైనా జరిగితే ఎవరు బాధ్యులు..? అని స్కూళ్ల యాజమాన్యంపై తల్లిదండ్రులు మండిపడుతున్నారు.
ప్రభుత్వం నిర్ణయంపై ఉత్కంఠ..!
భారీ వర్షాల నేపథ్యంలో రేపు, ఎల్లుండి (Mon, Tues Day) ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు (Govt and Private Schools) సెలవులు (Holidays) ప్రకటించాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. సెలవుల విషయంలో విద్యాశాఖ నిర్ణయం తీసుకోవాలంటూ సోషల్ మీడియా వేదికగా విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. మరోవైపు.. తెలంగాణ సీఎంవో (TS CMO), సీఎం కేసీఆర్ (CM KCR), మంత్రులు కేటీఆర్ (KTR), సబితా ఇంద్రారెడ్డి (Sabitha Indra Reddy) , హరీష్ రావులను (Harish Rao) ట్యాగ్ చేస్తూ పెద్ద ఎత్తున విద్యార్థుల తల్లిదండ్రులు ట్వీట్లు (Tweets) చేస్తున్నారు. అయితే.. సెలవులు ఇవ్వాలనే డిమాండ్ గంట గంటకూ పెరుగుతుండటంతో విద్యాశాఖ (Educational Dept) ఉన్నతాధికారులు మంత్రి సబితా ఇంద్రారెడ్డితో చర్చిస్తున్నట్లుగా సమాచారం. ఇప్పటికే మూడ్రోజులు గురు, శుక్ర, శనివారాలు వరుసగా సెలవులు ఇవ్వగా.. ఇప్పుడు మళ్లీ సెలవులు పొడిగించాలా..? వద్దా..? అనేదానిపై సమాలోచనలు చేస్తున్నట్లు తెలియవచ్చింది. అయితే.. రాత్రి పదిలోపు సెలవులపై విద్యాశాఖ నిర్ణయం వెలువడనుందని తెలుస్తోంది. అయితే రేపు, ఎల్లుండి దాదాపు సెలవులు ఇచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని సమాచారం. ప్రభుత్వం నుంచి ఎలాంటి నిర్ణయం వస్తుందా..? అని విద్యార్థులు, తల్లిదండ్రులు, స్కూల్స్ యాజమాన్యాలు సర్వత్రా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.
Rains lash Telangana : తెలంగాణలో మూడ్రోజులపాటు స్కూళ్లు, కాలేజీలకు సెలవులు..!?
రేపు ఓకే గానీ..!
హైదరాబాద్‌తో (Hyderabad) పాటు రాష్ట్రంలోని పలుజిల్లాల్లో కాసింత వర్షం తగ్గింది కానీ.. వరద మాత్రం అలానే ఉంది. కొన్ని కొన్ని ప్రాంతాల్లో రోడ్లు సరిగ్గా లేకపోవడం, రోడ్ల మీదనే చెట్లు కూలిపోవడం, కొన్ని గ్రామాలకు రాకపోకలు సైతం నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో స్కూళ్లకు వెళ్లడానికి విద్యార్థులు ఇంకెంత ఇబ్బంది పడతారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అందుకే హైదరాబాద్‌లోనే కాకుండా ఇతర జిల్లాల్లోని విద్యార్థుల తల్లిదండ్రులు సైతం వర్షాలు తగ్గే వరకూ సెలవులు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు.. సోమవారం స్కూల్స్ ఉన్నా మంగళ, బుధవారాల్లో సెలవులు ప్రకటించాలని.. ఆ రెండ్రోజులు భారీగా వర్షాలు ఉండే చాన్స్ ఉందని వాతావరణ శాఖ చెబుతున్న నేపథ్యంలో సెలవులు ప్రకటిస్తే బాగుంటుందని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఫైనల్‌గా ఈ డిమాండ్లు వినడం, సోషల్ మీడియాలో చూశాక ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే మరి.