గవర్నర్‌పై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో చిక్కుల్లో కౌశిక్‌రెడ్డి.. విచారణకు రావాలని మహిళా కమిషన్ నోటీసులు.. ఏం జరుగుతుందో..!!

ABN , First Publish Date - 2023-02-19T20:40:01+05:30 IST

బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డి (MLC Kaushik Reddy)కి జాతీయ మహిళా కమిషన్ నోటీసులిచ్చింది. తెలంగాణ గవర్నర్‌ తమిళిసై (Governor Tamilisai) పై కౌశిక్‌రెడ్డి వ్యాఖ్యలను

గవర్నర్‌పై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో చిక్కుల్లో కౌశిక్‌రెడ్డి.. విచారణకు రావాలని మహిళా కమిషన్ నోటీసులు.. ఏం జరుగుతుందో..!!

హైదరాబాద్: బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డి (MLC Kaushik Reddy)కి జాతీయ మహిళా కమిషన్ నోటీసులిచ్చింది. తెలంగాణ గవర్నర్‌ తమిళిసై (Governor Tamilisai) పై కౌశిక్‌రెడ్డి వ్యాఖ్యలను కమిషన్‌ సుమోటోగా తీసుకుంది. తమిళిసై పై కౌశిక్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. 21న ఢిల్లీ (Delhi)లో కమిషన్ ముందు హాజరుకావాలని అధికారులు ఆదేశించారు.

గవర్నర్‌పై కౌశిక్‌రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు

గవర్నర్‌పై కౌశిక్‌రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో తీర్మానం చేసిన ఫైళ్లను గవర్నర్ తన దగ్గర పెట్టుకున్నారని, ఒక్క ఫైల్‌ను కూడా కదలనివ్వడం లేదని కౌశిక్‌రెడ్డి ఆరోపించారు. దీనిపై ఈటల రాజేందర్‌ (Etala Rajender) సమాధానం చెప్పాలని కౌశిక్‌రెడ్డి డిమాండ్ చేశారు. మాజీ ఎంపీ వివేక్ (MP Vivek) దగ్గర రూ.వంద కోట్ల వరకు తీసుకుని హుజురాబాద్‌లో ఖర్చు పెట్టామని ఈటల చెప్పారని కౌశిక్‌రెడ్డి ఆరోపించారు. ఆ డబ్బులు ఏమయ్యాయని ఐటీ, ఈసీకి ఫిర్యాదు చేస్తామని కౌశిక్‌రెడ్డి పేర్కొన్నారు. తమిళసై పై కౌశిక్‌రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా కౌశిక్‌రెడ్ది దిషిబొమ్మను బీజేపీ నాయకులు దహనం చేసిన విషయం తెలిసిందే

ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డిపై ఫిర్యాదు

తమిళిసై పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కౌశిక్‌రెడ్డిపై బీజేపీ నేతలు జడ్చర్ల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. గవర్నర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కౌశిక్‌రెడ్డిని బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ఇష్టారాజ్యంగా మాట్లాడడం సరైందికాదని, వెంటనే రాష్ట్ర గవర్నర్‌కు కౌశిక్‌రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - 2023-02-19T20:40:02+05:30 IST