Share News

AP Assembly Speaker: స్పీకర్ ఎన్నికకు వైసీపీ ఎమ్మెల్యేల గైర్హాజరు..

ABN , Publish Date - Jun 22 , 2024 | 01:44 PM

స్పీకర్ ఎన్నికకు వైసీపీ ఎమ్మెల్యేలంతా డుమ్మా కొట్టారు. ఒక్కరంటే ఒక్కరు కూడా హాజరు కాలేదు. ముందుగానే వైసీపీ కీలక నేత, ఎమ్మెల్యే పెద్దిరెడ్డికి స్పీకర్ ఎన్నిక గురించి పయ్యావుల కేశవ్ సమాచారం అందించారు. పైగా వైసీపీ అధినేత జగన్‌కు దీనిపై సమాచారం అందించాలని కూడా తెలిపారు. అయినా సరే.. వైసీపీ నుంచి అధినేత జగన్మోహన్‌ రెడ్డితో పాటు వేరెవ్వరూ హాజరు కాలేదు.

AP Assembly Speaker: స్పీకర్ ఎన్నికకు వైసీపీ ఎమ్మెల్యేల గైర్హాజరు..

అమరావతి: స్పీకర్ ఎన్నికకు వైసీపీ ఎమ్మెల్యేలంతా డుమ్మా కొట్టారు. ఒక్కరంటే ఒక్కరు కూడా హాజరు కాలేదు. ముందుగానే వైసీపీ కీలక నేత, ఎమ్మెల్యే పెద్దిరెడ్డికి స్పీకర్ ఎన్నిక గురించి పయ్యావుల కేశవ్ సమాచారం అందించారు. పైగా వైసీపీ అధినేత జగన్‌కు దీనిపై సమాచారం అందించాలని కూడా తెలిపారు. అయినా సరే.. వైసీపీ నుంచి అధినేత జగన్మోహన్‌ రెడ్డితో పాటు వేరెవ్వరూ హాజరు కాలేదు. జగన్ ఇవాళ పులివెందుల పర్యటన పెట్టుకున్నారు. అసలే నిన్న అసెంబ్లీలో సభా మర్యాదను పాటించలేదని విమర్శలు వెల్లువెత్తుతున్న తరుణంలో జగన్ ఇవాళ అసెంబ్లీకి అసలే గైర్హాజరడం చర్చనీయాంశంగా మారింది.


మాజీ సీఎం జగన్, వైసీపీకి చెందిన మరో 10 మంది ఎమ్మెల్యేలు నిన్న ప్రమాణ స్వీకారం చేశారు. సభ ప్రారంభమైన పది నిమిషాల వరకూ జగన్ సభలోకి రాలేదు. ఆ తరువాత వచ్చినా కూడా వెనుక సీటులోనే తోటి వైసీపీ ఎమ్మెల్యేలతో కూర్చుండిపోయారు. ప్రమాణ స్వీకారాలు పూర్తయ్యే వరకూ కూడా జగన్ సభలో ఉండలేదు. తన ప్రమాణ స్వీకారం ముగియగానే సభ నుంచి వెళ్లిపోయారు. ఇక ఇవాళ స్పీకర్ ఎన్నికకు ఆయనే కాకుండా.. ఆయన పార్టీ వారెవరూ హాజరు కాకపోవడం చర్చనీయాంశంగా మారింది.

Updated Date - Jun 22 , 2024 | 01:44 PM