Share News

YSR AASARA : ఇంకెప్పుడు ఆసరా..?

ABN , Publish Date - Apr 22 , 2024 | 12:15 AM

సీఎం జగన బటన నొక్కి మూడు నెలలు అవుతున్నా పొదుపు మహిళల ఖాతాల్లోకి వైఎస్సార్‌ ఆసరా సొమ్ము జమకాలేదు. జిల్లా వ్యాప్తంగా 5,190 మహిళా సంఘాలకు ఇప్పటి వరకూ ఒక్క పైసా అందలేదు. ఇవన్నీ ఓసీ, బీసీ సామాజికవర్గ మహిళల గ్రూపులేనని సమాచారం. జిల్లా వ్యాప్తంగా వీరికి రూ.41.36 కోట్లు రావాల్సి ఉంది. డబ్బులు ఎప్పుడు పడతాయో తెలియని దిక్కు తెలియని స్థితిలో మహిళలు ఉన్నారు.

YSR AASARA : ఇంకెప్పుడు ఆసరా..?
Kranti village community in Gadekallu

బటన నొక్కి మూడు నెలలు

సీఎం జగనపై పొదుపు మహిళల ఆగ్రహం

విడపనకల్లు, ఏప్రిల్‌ 21: సీఎం జగన బటన నొక్కి మూడు నెలలు అవుతున్నా పొదుపు మహిళల ఖాతాల్లోకి వైఎస్సార్‌ ఆసరా సొమ్ము జమకాలేదు. జిల్లా వ్యాప్తంగా 5,190 మహిళా సంఘాలకు ఇప్పటి వరకూ ఒక్క పైసా అందలేదు. ఇవన్నీ ఓసీ, బీసీ సామాజికవర్గ మహిళల గ్రూపులేనని సమాచారం. జిల్లా వ్యాప్తంగా వీరికి రూ.41.36 కోట్లు రావాల్సి ఉంది. డబ్బులు ఎప్పుడు పడతాయో తెలియని దిక్కు తెలియని స్థితిలో మహిళలు ఉన్నారు. విడపనకల్లు మండలంలో 56 మహిళా సంఘాలకు, వజ్రకరూరు మండలంలో 49 సంఘాలకు, ఉరవకొండ మండలంలో 99 సంఘాలకు,


బెళుగుప్ప మండలంలో 100 సంఘాలకు ఆసరా సొమ్ము రావాల్సి ఉంది. ఓసీ, బీసీ మహిళలకు మాత్రమే ఆసరా సొమ్ము ఇవ్వకపోవడం విమర్శలకు తావిస్తోంది.

ఇస్తారనే నమ్మకం లేదు..

ఓసీ, బీసీ మహిళలకు ఆసరా సొమ్ము రాలేదు. డబ్బులు వస్తాయని ఎదురు చూశాం. ఇంక వాస్తయన్న నమ్మకం లేదు. వైసీపీ కార్యక్రమాలకు రావాల్సిందే అని ఆ పార్టీ నాయకులు ప్రతి కార్యాక్రమానికీ తీసుకెళ్లారు. కానీ డబ్బులు ఇవ్వకుండా మోసగించారు.

- జె.తులసి లక్ష్మి, గడేకల్లు క్రాంతి మహిళా సంఘం


సభకు రావాలని బెదిరించారు

‘జనవరి నెలలో సీఎం జగన ఉరవకొండకు వస్తున్నారు.. మీకు ఆసరా డబ్బులు వేస్తాడు. మహిళా సంఘం సభ్యురాలందరూ ఆ సభకు రావాలి’ అని ఇంటింటికి తిరిగి చెప్పారు. సీఎం సభకు రాకపోతే ఆసరా డబ్బులు రావు అని బెదిరించారు. సభ అయిపోయి మూడు నెలలు గడిచినా మా గ్రామైక్య సంఘానికి ఒక్క రూపాయి కూడా రాలేదు. మా సంఘానికి రూ.రెండు లక్షలు రావాల్సి ఉంది. ఇంక వచ్చే పరిస్థితి కనబడటం లేదు.

- పి.రమాదేవి, గడేకల్లు క్రాంతి సంఘం

ఉత్తుత్తి బటన..

సీఎం జగన బటన నొక్కి మూడు నెలలైనా ఓసీ, బీసీ మహిళలకు ఆసరా సొమ్ము ఇవ్వలేదు. మా సంఘానికి నాలుగో విడత రూ.2 లక్షలు రావాల్సి ఉంది. గడేకల్లు గ్రామంలోనే 13 సంఘాలకు చెందిన 130 మందికి ఆసరా డబ్బులు రావాల్సి ఉంది. సీఎం జగన నిలువునా మోసం చేశాడు.

- కె.కళ్యాణమ్మ, గడేకల్లు మహిళా సంఘం సభ్యురాలు

మరిన్ని అనంతపురం వార్తల కోసం...

Updated Date - Apr 22 , 2024 | 12:51 AM