AP Elections: ఏపీ ఎన్నికలపై సీఈవో మీనా కీలక సూచనలు
ABN , Publish Date - Mar 07 , 2024 | 10:13 PM
ఏపీ ఎన్నికలపై ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా (Mukesh Kumar Meena) కీలక సూచనలు ఇచ్చారు. భారత ఎన్నికల సంఘం తాజా మార్గదర్శకాలు & సూచనలపై రాజకీయ పార్టీలు, వారి ప్రతినిధులకు సమగ్ర అవగాహన అవసరమని ఇందులో ఎలాంటి గందరగోళానికి తావు ఉండదని తెలిపారు.

అమరావతి: ఏపీ ఎన్నికలపై ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా (Mukesh Kumar Meena) కీలక సూచనలు ఇచ్చారు. భారత ఎన్నికల సంఘం తాజా మార్గదర్శకాలు & సూచనలపై రాజకీయ పార్టీలు, వారి ప్రతినిధులకు సమగ్ర అవగాహన అవసరమని ఇందులో ఎలాంటి గందరగోళానికి తావు ఉండదని తెలిపారు. గురువారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే అమల్లోకి వచ్చే ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అనుసరించడంపై పార్టీలకు అవగాహన అవసరమని చెప్పారు. నామినేషన్ల పక్రియలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, హెలికాప్టర్లు, వాహనాలు వినియోగానికి, సభలు, సమావేశాలు, ఊరేగింపులు నిర్వహణకు ముందుగా పొందాల్సిన అనుమతుల విషయం తెలుసుకోవాలని చెప్పారు. రాజకీయ పార్టీలు, అభ్యర్థులు చేసే వ్యయ పర్యవేక్షణ పోలింగ్, కౌంటింగ్ రోజుల్లో రాజకీయ పార్టీలు, వారి ప్రతినిధులు అనుసరించాల్సిన విధి విధానాలను సీఈవో మీనా తెలిపారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి