Share News

AP Politics: అమ్మ.. జగనా! నెక్ట్స్ లెవల్ డ్రామా.. ఫోటో వైరల్ అవడంతో షాక్..!

ABN , Publish Date - Feb 28 , 2024 | 03:44 AM

పనులు నాటకం! నీళ్లు బూటకం! చివరికి... పూజలు చేసి గేటు ఎత్తడమూ నాటకమే! ఇదీ... ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి చేసిన ‘షో’! ‘చంద్రబాబు చేయలేని పని మేం చేశాం. ఆయన సొంత నియోజకవర్గం కుప్పానికి కృష్ణా నీళ్లు ఇచ్చేశాం’ అని చెప్పుకొనేందుకు

AP Politics: అమ్మ.. జగనా! నెక్ట్స్ లెవల్ డ్రామా.. ఫోటో వైరల్ అవడంతో షాక్..!
CM YS Jagan

గేటు సెట్‌పతో నీళ్ల నాటకం.. కుప్పానికి కృష్ణా నీళ్ల పేరిట ‘షో’

బటన్‌నొక్కి నీళ్లు వదిలిన గేటు ఉత్తుత్తిదే.. పని కాగానే గేటు ఎత్తేసిన అధికారులు

ఫొటోలు వైరల్‌ కావడంతో ఉలికిపాటు.. మళ్లీ యథాతథంగా అక్కడే పెట్టి పరార్‌

నిన్న వదిలిన నీళ్లు నేడు మాయం.. నీటి చెమ్మా లేని కాల్వలో నేతల నిరసన

మంగళవారం మధ్యాహ్నం 1.00 గంట

మొదటి రెండు ఫొటోలూ సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో మళ్లీ లారీలో గేటు తెచ్చి యఽథాస్థానంలో బిగించేశారు.

27KPM-9.jpg

సోమవారం ఉదయం 11.30 గంటలు..

చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం రాజుపేట వద్ద కుప్పం బ్రాంచి కాలువ గేటును బటన్‌ నొక్కి సీఎం జగన్‌ పైకెత్తారు. అప్పటికి రెండు రోజులుగా అధికారులు ఆపసోపాలు పడి ఆపి పెట్టిన నీళ్లు ముందుకు దూకాయి.

27KPM-10.jpg

మంగళవారం ఉదయం 10.30 గంటలు

జగన్‌ బటన్‌ నొక్కి ఎత్తిన గేటును ఒక భారీ

యంత్రంతో పెకలించి, లారీలో వేసి తీసుకువెళ్లిపోయారు.

కుప్పం/రామకుప్పం, ఫిబ్రవరి 27: పనులు నాటకం! నీళ్లు బూటకం! చివరికి... పూజలు చేసి గేటు ఎత్తడమూ నాటకమే! ఇదీ... ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి చేసిన ‘షో’! ‘చంద్రబాబు చేయలేని పని మేం చేశాం. ఆయన సొంత నియోజకవర్గం కుప్పానికి కృష్ణా నీళ్లు ఇచ్చేశాం’ అని చెప్పుకొనేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ఆడిన హైడ్రామా! ఈ నాటకం 24 గంటల్లోనే బట్టబయలైంది. సోమవారం చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం రాజుపేట వద్ద కుప్పం బ్రాంచి కాలువ గేటును జగన్‌ బటన్‌ నొక్కి పైకెత్తారు. ఆ గేటును పూలతో చక్కగా అలంకరించారు. అయితే... మంగళవారం ఉదయం అధికారులు జేసీబీని తీసుకొచ్చి మొత్తం గేటును ఎత్తి లారీలో పెట్టి తరలించుకుపోయారు. ఈ ఫొటోలు కాస్తా సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. టీడీపీ హయాంలోనే దాదాపు 85 శాతం పూర్తయిన కెనాల్‌ ఇది! మిగిలిన పనులనూ జగన్‌ ప్రభుత్వం పూర్తిచేయలేకపోయింది. ఎన్నికల ముందు ‘కుప్పానికి కృష్ణా జలాలు’ పేరుతో భారీ హంగామా చేసింది. అదంతా ఉత్తుత్తిదే అని అప్పటికే తేలడంతో సగం పరువు పోయింది. ఇప్పుడు... పెట్టిన ‘గేటు సెట్‌ప’ను కూడా లేపేయడంతో పూర్తిగా పరువు పోయినట్లేనని వైసీపీ నేతలు కంగారు పడ్డారు. అప్పటికప్పుడు అధికారులను ఆదేశించడంతో... అదే గేటును మళ్లీ తీసుకొచ్చి, యథాస్థానంలో పెట్టారు. అసలు విషయం ఏమిటంటే... అక్కడ ఎలాంటి గేటూ పెట్టాల్సిన అవసరం లేదు. అది కాల్వలో నీళ్లు వాటంతట పోయే చోటు! కానీ... ‘షో’ కోసమే అక్కడ గేటు పెట్టారు. దీనికోసం నాలుగైదు రోజులు కష్టపడి, రూ.6 లక్షల దాకా ఖర్చుపెట్టారు. ‘షో’ అయిపోగానే... గేటు సెట్‌పను ఎత్తేశారు.

నిజ్జంగానే నీటి మూటలు!

రాజుపేటవద్ద అట్టహాసంగా ‘గేటు’ ఎత్తిన తర్వాత... శాంతిపురం మండలం గుండిశెట్టిపల్లి వద్ద జగన్‌ బహిరంగ సభలో పాల్గొన్నారు. అక్కడ విడుదల చేసిన నీళ్లు ఇక్కడి దాకా కూడా రాలేదు. ప్రారంభోత్సవ సమయంలో సుమారు ఐదున్నర నుంచి ఆరు అడుగులున్న నీరు రెండో రోజుకే రెండూ రెండున్నర అడుగులకు చేరింది. గేటుకు అటూ ఇటూ నిశ్చలంగా నిలిచిపోయిన నీళ్లు విసురుగా గాలి కొట్టినప్పుడు మాత్రమే గేటు దిగువకు జారుతున్నాయి. సోమవారం సాయంత్రం కనిపించిన నీటి ప్రవాహం.. మంగళవారం తెల్లారేసరికి మాయమైంది. ‘కుప్పం నియోజకవర్గంలోని 54 చెరువులకు కృష్ణ నీళ్లు ఇచ్చేస్తున్నా’ అని చెప్పిన జగన్‌ మాటలను ఎగతాళి చేస్తున్నట్టుగా నీటి చెమ్మ మాత్రమే మిగిలింది. కనీసం నాలుగైదు కిలోమీటర్లు దూరం కూడా నీరు కదిలి పారలేదు.

నాట్కోలో మరో వంద పడకలు!

అమరావతి, ఫిబ్రవరి 27(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ సమగ్ర వైద్యశాలలోని నాట్కో సెంటర్‌కు లెవెల్‌-1 క్యాన్సర్‌ సెంటర్‌గా ప్రభుత్వం గుర్తింపు ఇచ్చింది. ఇప్పుడున్న వంద పడకలకు అదనంగా మరో వంద పడకలతోపాటు మరిన్ని వసతుల్ని ఏర్పాటు చేసేందుకు ఈ సెంటర్‌ను అనుకుని ఉన్న 1500 గజాల స్థలాన్ని నాట్కో ట్రస్ట్‌కు ప్రభుత్వం కేటాయించింది. ఇందుకు సంబంధించిన అవగాహన ఒప్పంద పత్రాల్ని వైద్య, ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు సమక్షంలో డీఎంఈ నరసింహం, నాట్కో ఫార్మా వ్యవస్థాపకులు, నాట్కో ట్రస్ట్‌ మేనేజింగ్‌ ట్రస్టీ వి.సి.నన్నపనేని మార్పిడి చేసుకున్నారు. నాట్కోలో మెడికల్‌, సర్జికల్‌ విభాగాల్ని ఏర్పాటు చేయడం వల్ల క్యాన్సర్‌ రోగులకు సమగ్ర చికిత్స అందుతుందని, అన్ని విభాగాల్లో వైద్యులు ఉండేట్లు చర్యలు తీసుకున్నామని కృష్ణబాబు తెలిపారు.

చుక్కనీరులేని కాలువలో టీడీపీ నిరసన

రాజుపేట నుంచి వదిలిన నీళ్లు గుండిశెట్టిపల్లె వద్దకు సన్నగా చేరుకుని మంగళవారం ఉదయానికి ఎండిపోయాయి. దీంతో కాలువ ఖాళీగా కనిపించింది. గుండిశెట్టిపల్లె నుంచి గ్రావిటీ మీద ప్రవహించే అవకాశం ఉన్నా, ఆపాటి నీళ్లు కూడా చేరలేదు. టీడీపీ శ్రేణులు ఉయ్యాల జయరామిరెడ్డి ఆధ్వర్యంలో ఎంకే పురం సమీపంలో ఖాళీగా ఉన్న కాలువలోకి దిగి మంగళవారం నిరసన తెలిపారు.

Updated Date - Feb 28 , 2024 | 07:49 AM