Share News

Actor Suman: కూటమి ప్రభుత్వం ఏర్పాటుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సుమన్

ABN , Publish Date - Jun 15 , 2024 | 02:56 PM

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి(Kutami) ఘన విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేయడం శుభపరిణామం అని నటుడు సుమన్(Actor Suman) అన్నారు. గత ప్రభుత్వ పాలనలో రాష్ట్రం ఐదేళ్లు వెన్నక్కి వెళ్లిందని, ఏపీ అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమని ఆయన చెప్పారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సందర్భంగా కూటమి గెలుపుపై సుమన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Actor Suman: కూటమి ప్రభుత్వం ఏర్పాటుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సుమన్

తిరుమల: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి(Kutami) ఘన విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేయడం శుభపరిణామం అని నటుడు సుమన్(Actor Suman) అన్నారు. గత ప్రభుత్వ పాలనలో రాష్ట్రం ఐదేళ్లు వెనక్కి వెళ్లిందని, ఏపీ అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమని ఆయన చెప్పారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సందర్భంగా కూటమి గెలుపుపై సుమన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో నూతన పరిశ్రమలు, ఐటీ సంస్థలు ఏర్పాటు చేసి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఆయన సీఎం చంద్రబాబును కోరారు.


హైదరాబాద్ అభివృద్ధి చెందిందంటే కారణం చంద్రబాబే అన్నారు. అమరావతిని కాస్మోపాలిటన్ సిటీగా అభివృద్ధి చేయాలని కోరారు. తిరుపతితోపాటు ఈస్ట్, వెస్ట్ గోదావరి జిల్లాల్లో ఫిల్మ్ సిటీ ఏర్పాటు చేయాలని సూచించారు. ఏపీలో సినిమాల చిత్రీకరణకు ప్రభుత్వం సహకారం అందించాలన్నారు. బీసీలకు కూటమి ప్రభుత్వంలో పెద్ద పీఠ వేసిందని చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి:

Pawan Kalyan: ఐఏఎస్ కృష్ణతేజకు అభినందనలు తెలిపిన డిప్యూటీ సీఎం పవన్

Minister Ravindra: నాసిరకం మద్యంతో ప్రాణాలు తీసిన ఏ ఒక్కరినీ వదలను: మంత్రి కొల్లు రవీంద్ర

Updated Date - Jun 15 , 2024 | 05:36 PM