Peddireddy Ramachandra Reddy: ఈ సారి రాయలసీమను క్లీన్ స్వీప్ చేస్తాం
ABN , Publish Date - Jan 29 , 2024 | 12:57 PM
ఎమ్మెల్యే ఆదిమూలం మాటలు ఆయన విజ్ఞతికే వదిలేస్తున్నానని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. తాము కష్టపడి ఆదిమూలంని గెలిపించామని పేర్కొన్నారు. తిరుపతి ఎంపీగా కొత్త అభ్యర్ధులు అన్వేషణ జరుగుతోందన్నారు.
తిరుపతి: ఎమ్మెల్యే ఆదిమూలం మాటలు ఆయన విజ్ఞతికే వదిలేస్తున్నానని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. తాము కష్టపడి ఆదిమూలంని గెలిపించామని పేర్కొన్నారు. తిరుపతి ఎంపీగా కొత్త అభ్యర్ధులు అన్వేషణ జరుగుతోందన్నారు. వ్యక్తిగత కారణాలతో కొందరు మీటింగ్‌కు రాలేదని అంటున్నారు. ఏడు జిల్లాలకు సంబంధించిన ఎమ్మెల్యే, కో ఆర్డినేటర్లతో సమావేశం నిర్వహించామని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు.
అనంతపురంలో సిద్దం సభ ఉంటుందని పెద్దిరెడ్డి పేర్కొన్నారు. సభకు సంబంధించిన ఏర్పాట్లపై చర్చించామన్నారు. గత ఎన్నికలలో పొరపాటున మూడు చోట్ల ఓడిపోయామన్నారు. ఈ సారి రాయలసీమను క్లీన్ స్వీప్ చేస్తామని మంత్రి పెద్దిరెడ్డి పేర్కొన్నారు. రాయలసీమలో ఎన్నికలకు సంబంధించి సీఎం జగన్..కేడర్‌కు దశ, దిశను నిర్దేశిస్తారన్నారు. వచ్చే నెల 10, 11వ తేదీలలో సిద్దం సభ ఉంటుందని పేర్కొన్నారు. ఐదు లక్షలమంది తగ్గకుండ జనాలు వస్తారని పెద్దిరెడ్డి తెలిపారు.