AP Assembly: బ్లేడ్ బ్యాచ్, గంజాయి, రౌడీయిజంపై ఏపీ అసెంబ్లీలో చర్చ
ABN , Publish Date - Jul 25 , 2024 | 10:46 AM
ఏపీ అసెంబ్లీలో రాష్ట్రంలోని సమస్యలన్నింటపై చర్చ జరుగుతోంది. మంత్రివర్గంలో పోలవరంపై ఆసక్తికర చర్చ జరిగిన విషయం తెలిసిందే. డయాఫ్రం వాల్ దెబ్బతిన్నదంటూ నిపుణుల కమిటీ అందించిన నివేదికపై చర్చించడం జరిగింది.
అమరావతి: ఏపీ అసెంబ్లీ (AP Assembly)లో రాష్ట్రంలోని సమస్యలన్నింటపై చర్చ జరుగుతోంది. మంత్రివర్గంలో పోలవరంపై ఆసక్తికర చర్చ జరిగిన విషయం తెలిసిందే. డయాఫ్రం వాల్ దెబ్బతిన్నదంటూ నిపుణుల కమిటీ అందించిన నివేదికపై చర్చించడం జరిగింది. డయాఫ్రమ్ వాల్‌కు దెబ్బతిన్న ప్రాంతంలో రింగ్ ఫెన్సింగ్ చేస్తే సరిపోతుందని తొలుత నివేదిక అందించింది. ఇదిలా ఉండగా అసెంబ్లీలో రాష్ట్రంలో జరుగుతున్న అరాచకంపై కూడా చర్చ జరిగింది. బ్లేడ్ బ్యాచ్, గంజాయి, రౌడీయిజంపై అసెంబ్లీలో చర్చ జరిగింది. రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరాం కృష్ణ (MLA Battula Balaram Krishna) ప్రశ్నకు హోం మంత్రి అనిత (Home Minister Anitha) సమాధానం ఇచ్చారు. కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి ముందు రాష్ట్రంలో గంజాయిని అరికట్టాలని కోరారు. గంజాయి మత్తులోనే అనేక దారుణాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.
దీనికి అనిత సమాధానం ఇస్తూ.. రాష్ట్రంలో రౌడీయిజం, గంజాయి, బ్లేడ్ బ్యాచ్‌లను నిర్ధాక్షిణ్యంగా అణచి వేస్తామని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో సీసీటీవీ కెమెరాలు కూడా పని చేయలేదన్నారు. క్రిమినల్స్‌ను పట్టుకుంటే వారి పూర్వ చరిత్ర చూసుకునే సిస్టమ్ కూడా లేకుండా చేశారన్నారు. చివరకు గుడి, బడికి కూడా భద్రత లేదన్నారు. చివరకు గత ప్రభుత్వ హయాంలో నియంత్రణ లేక పాఠశాలల్లో కూడా గంజాయి వచ్చిందన్నారు. గంజాయి నియంత్రణ కోసం స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నామని అనిత తెలిపారు. ఇటీవల కేబినెట్ సబ్ కమిటీ కూడా భేటీ అయ్యిందని.. రాష్ట్రంలో జరుగుతున్న దారుణాలన్నింటి నియంత్రణకు ప్రణాళిక రూపొందిస్తున్నామని హోం మంత్రి అనిత వెల్లడించారు.
ఇదిలా ఉండగా.. ఏలూరులో దారుణం చోటు చేసుకుంది. సహచర విద్యార్థి మోరు సుధీర్ పాల్‌పై పెట్రోల్ పోసి మరో విద్యార్థి నిప్పంటించాడు. ఈ ఘటనలో విద్యార్థి మోరు సుధీర్ పాల్‌కు తీవ్ర గాయాలయ్యాయి. సుధీర్ ఏడవ తరగతి చదువుతున్నాడు. దాడికి పాల్పడిన మరో విద్యార్థి మానసికంగా ఇబ్బంది పడుతున్నట్లు స్కూల్ యాజమాన్యం చెబుతోంది. జేవియర్ హై స్కూల్ హాస్టల్లో నిన్న తెల్లవారుజామున ఘటన చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గాయపడిన విద్యార్థిని అతని కుటుంబ సభ్యులు ప్రైవేట్ హాస్పిటల్‌లో వైద్యం చేయిస్తున్నారు. అయితే ఈ విషయం బయటకు రాకుండా స్కూలు మేనేజ్‌మెంట్ జాగ్రత్త వహిస్తోంది. మరోవైపు ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. మానసిక స్థితి సరిగా లేని విద్యార్థులతో జాగ్రత్తగా ఉండాలని కానీ స్కూలు యాజమాన్యం అవేమీ పట్టించుకోలని ఆరోపిస్తోంది.
పెద్దిరెడ్డి ఖాతాలో ‘అసైన్డ్’
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read More Andhra pradesh News and Latest Telugu News