Telugu scientist : ఐఏఆర్‌ఐ డైరెక్టర్‌గా తొలి తెలుగు శాస్త్రవేత్త
ABN , Publish Date - Dec 27 , 2024 | 03:59 AM
ఢిల్లీలోని భారత వ్యవసాయ పరిశోధన సంస్థ(ఐఏఆర్‌ఐ) డైరెక్టర్‌గా తొలి తెలుగు శాస్త్రవేత్త డాక్టర్ చెరుకుమల్లి శ్రీనివాసరావు నియమితులయ్యారు.

బాధ్యతలు చేపట్టిన డాక్టర్ సీహెచ్ శ్రీనివాసరావు
అమరావతి, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి): ఢిల్లీలోని భారత వ్యవసాయ పరిశోధన సంస్థ(ఐఏఆర్‌ఐ) డైరెక్టర్‌గా తొలి తెలుగు శాస్త్రవేత్త డాక్టర్ చెరుకుమల్లి శ్రీనివాసరావు నియమితులయ్యారు. ఇప్పటివరకు హైదరాబాద్‌లోని జాతీ య వ్యవసాయ పరిశోధన నిర్వహణ అకాడమీ(నారమ్) డైర్‌క్టర్‌గా ఉన్న శ్రీనివాసరావు గురువారం ఐఏఆర్‌ఐ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. కృష్ణా జిల్లా అనిగండ్లపాడులో 1965 అక్టోబరు4న జన్మించిన శ్రీనివాసరావు స్థానిక ప్రాథమిక పాఠశాలలో ప్రాథమిక విద్య, జడ్పీ హైస్కూల్‌లో మాద్యమిక విద్య చదివారు. బాపట్ల వ్యవసాయ కళాశాలలో అగ్రికల్చర్ బీఎస్సీ, ఎమ్మెస్సీ పూర్తి చేసి, ఢిల్లీలోని ఐఏఆర్‌ఐలో పీహెచ్‌డీ చేశారు. వ్యవసాయరంగంలో ఆయన సేవలకు గుర్తింపుగా 2010లో రాష్ట్రపతి, 2015లో ప్రధాని నుంచి అవార్డులు అందుకున్నారు. కాగా.. డాక్టర్ శ్రీనివాసరావుకు వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు గురువారం ’ఎక్స్’ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.