అన్నవరంలో అవినేతి!
ABN , Publish Date - Sep 24 , 2024 | 01:20 AM
అన్నవరం దేవస్థానంలో వినియోగించే నెయ్యి నాణ్యతపై ఆలయ అధికారుల ఉదాసీనత అనేక అనుమానాలకు తావి స్తోంది. గత వైసీపీ ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో అడ్డగోలు కంపెనీకి నెయ్యి సరఫరా కాంట్రాక్టు కట్టబెట్టిన ఆలయ అధి కారులు అసలు నాణ్యతను పట్టించుకోలేదు. అంతేకాదు.. నెయ్యి నాణ్యతపై జిల్లా ఆహార కల్తీ
దేవస్థానంలో నెయ్యికి ‘నోట్ల’ తడి
నెయ్యి నాణ్యతపై అనుమతులు నిల్
జిల్లా ఆహార కల్తీ నిరోధకశాఖ తనిఖీల్లేవ్
నేటికీ అనామక కంపెనీ నుంచే నెయ్యి
కాంట్రాక్టర్‌కు అడ్డగోలు సహకారం
తిరుపతి ఘటనతో మేల్కొన్న ప్రభుత్వం
నెయ్యి సరఫరాలో సమూల మార్పులు
ప్రస్తుత కంపెనీని తప్పించాలని నిర్ణయం
వచ్చే నెల నుంచి కొత్త కాంట్రాక్టర్ రాక
ఇకపై విజయ డెయిరీ నెయ్యి కొనుగోలు?
సింహాచలానికి విశాఖ డెయిరీ నెయ్యి
డిప్యూటీ సీఎం పవన్‌తో చర్చలు
అన్నవరం నెయ్యి శాంపిళ్లు బెంగళూరుకు
మరో 20 రోజుల్లో రానున్న నివేదిక
(కాకినాడ-ఆంధ్రజ్యోతి)
అన్నవరం దేవస్థానంలో వినియోగించే నెయ్యి నాణ్యతపై ఆలయ అధికారుల ఉదాసీనత అనేక అనుమానాలకు తావి స్తోంది. గత వైసీపీ ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో అడ్డగోలు కంపెనీకి నెయ్యి సరఫరా కాంట్రాక్టు కట్టబెట్టిన ఆలయ అధి కారులు అసలు నాణ్యతను పట్టించుకోలేదు. అంతేకాదు.. నెయ్యి నాణ్యతపై జిల్లా ఆహార కల్తీ నిరోధకశాఖ అనుమతు లు లేవు. తాజాగా తిరుపతి లడ్డూలో వినియోగించి నెయ్యిలో జంతువుల కొవ్వు ఉందని తేలిన నేపథ్యంలో అన్నవరంలో నెయ్యి నాణ్యతపై ఆరా తీస్తే అనేక చేదు నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అన్నవరం నెయ్యిని సైతం ప్రక్షాళనచేయాలని నిర్ణయించింది. కమీషన్లకు కక్కుర్తి పడి అనామక కంపెనీకి కట్టబెట్టిన నెయ్యి కాంట్రాక్టును పూర్తి గా తొలగించాలని భావిస్తోంది. ఇక ప్రభుత్వ డెయిరీ నుంచే నేరుగా నెయ్యి కొనుగోలు చేయాలని నిర్ణయించింది. డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ ఆదేశాలతో విజయ డెయిరీని రంగంలోకి దించబోతున్నారు. ప్రస్తుత నెయ్యి నాణ్యత నిగ్గుతేల్చడానికి శాంపిళ్లను బెంగళూరు ల్యాబ్‌కు తరలించారు.
నెయ్యి పేరుతో నోట్లు మింగుడు...
ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అన్నవరం దేవస్థానం ఎంతో ప్రఖ్యాతి చెందింది. ఏటా లక్షల్లో భక్తులు స్వామివారిని దర్శిం చుకోవడానికి వస్తారు. ఒక్క ప్రసాదమే ఏటా రెండు కోట్ల ప్యాకెట్లు అమ్ముడవుతాయి. ఇక్కడి ప్రసాదం అంటే భక్తులకు అంత ప్రీతి. అందుకే దేవస్థానంలో ప్రసాదం తయారీకి ఏటా 18 లక్షల కిలోల నెయ్యి అవసరం ఉంటుంది. కానీ అధికా రులు ఈ నెయ్యిలో కోట్లలో నోట్ల వేట సాగించారు. ఆరు నెలలకోసారి ఒక్కొక్క కాంట్రాక్టర్ నుంచి నెయ్యి సరఫరా జర గాల్సి ఉంటే.. గత వైసీపీ ప్రభుత్వంలో ఓ అనామక కంపెనీ నుంచి ఏకంగా రెండేళ్ల పాటు అధికారులు నెయ్యి కొనుగోలు చేశారు.అసలు ఆ కంపెనీకి అంత నెయ్యి సరఫరా చేసే సామర్థ్యం లేకపోయినా కాంట్రాక్టు కట్టబెట్టేశారు. ఇదే కాం ట్రాక్టరు పక్కనే సింహాచలం దేవస్థానానికి కిలో నెయ్యి రూ.344కి సరఫరా చేస్తే అన్నవరం దేవస్థానానికి ఏకంగా రూ.538కి విక్రయించారు. ఈ రెండేళ్లలో సదరు కాంట్రాక్టర్‌కు సింహాచలంతో పోల్చితే ఏకంగా రూ.7.80 కోట్ల వరకు గీకే శాడు. అంతేకాదు తాజాగా మరో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. దేవస్థానానికి సరఫరా అయిన నెయ్యిని నిబంధనల ప్రకారం ఆలయ అధికారులు జిల్లా ఆహార కల్తీ నియంత్రణ శాఖ ద్వారా తనిఖీ చేయించాలి. నెయ్యి వచ్చిన వెంటనే ఆ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలి. అధికారులు వచ్చి నెయ్యి నాణ్యత పక్కాగా ఉందని ధ్రువీకరించిన తర్వాతే విని యోగించాలి.కానీ దేవస్థానం అధికారులు అసలు ఈ పని చేయలేదు.ఆ శాఖతో సంప్రదిం పులు చేయ లేదు. నెయ్యి సర ఫరా అయిన ప్రతిసారీ తని ఖీ చేయిస్తే ఎక్కడ నాణ్యత బయటపడి తమ బండారం బట్టబయలు అవుతుందోన నే భయంతో అడ్డగోలుగా వ్యవహరించారు. పూర్తిగా నిబంధనలకు తూట్లు పొడి చారు. అనామక నెయ్యి సరఫరా కాంట్రాక్టరు తనకు అనుకూలంగా తెచ్చుకున్న దొంగ నాణ్యత సర్టిఫికెట్‌నే నమ్మి నెయ్యి కొనుగోలు చేయడం అనేక అనుమానాలకు తావిస్తోంది. అసలే ఆరు నెలలకో సారి మారాల్సిన కాంట్రాక్టర్ మారకపోవడం, ఇతర ఆలయా లతో పోల్చితే అధిక చెల్లింపులు, పైగా నెయ్యికి తనిఖీలు చేయించకపోవడం వెనుక ఎన్ని కోట్ల లో కమీషన్లు చేతులు మారాయనేదానిని రుజువు చేస్తోంది.
ఇకపై సమూల మార్పులు..
తిరుపతి లడ్డు తయారీలో గత వైసీపీ ప్రభుత్వం జంతు కొవ్వులు కలిసిన నెయ్యిని వినియోగించిన ఘటన బట్టబ యలు కావడంతో రాష్ట్రప్రభుత్వం అప్రమత్తమైంది. అన్నవరం దేవస్థానంలోను ఇకపై నెయ్యి నాణ్యత పెంచాలని నిర్ణయిం చింది. వైసీపీ హయాం నుంచి అడ్డగోలుగా కొనసాగుతున్న ప్రస్తుతం రైతు డెయిరీ కాంట్రాక్టర్‌కు నెయ్యి సరఫరా గడువు ఈనెలతో ముగుస్తోంది. తిరిగి వచ్చే నెల నుంచి మరో కొత్త కాంట్రాక్టర్ రంగంలోకి దిగుతున్నారు. ఈలోపే నెయ్యి నాణ్యతపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతోంది. అం దులో భాగంగా ప్రభుత్వ విజయ డెయిరీ నుంచి మొత్తం నెయ్యిని కొనుగోలు చేయాలని దాదాపు నిర్ణయానికి వచ్చింది. ఈ మేరకు జిల్లా మంత్రి అయిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దృష్టికి విజయ నుంచి నెయ్యి కొనుగోలు ప్రతిపాదన తీసుకువెళ్లారు. అదే సమయంలో సింహాచలం దేవస్థానానికి అన్నవరం ఆలయానికి సరఫరా చేస్తున్న కాంట్రాక్టరే నెయ్యి సరఫరా చేస్తుండడంతో ఆయన్ను తప్పించి విశాఖ డెయిరీ నుంచి కొనుగోలు చేయాలని సోమవారం నిర్ణయం తీసుకు న్నారు.ఈ నేపథ్యంలో పవన్ దృష్టికి ఈ వ్యవహారాన్ని తీసు కువెళ్లబోతున్నారు. తద్వారా విజయ, విశాఖలో ఏదనేది నిర్ణ యించనున్నారు. విజయ డెయిరీ వైపే మొగ్గు చూపే అవ కాశాలున్నాయి. అన్నవరం దేవస్థానంలో జిల్లా ఆహార కల్తీ నిరోధకశాఖ అధికారులు ఆదివారం తనిఖీలు చేసి నాలుగు నెయ్యి శాంపిళ్లు సేకరించారు. నాణ్యతను నిగ్గు తేల్చడానికి హైదరాబాద్‌లోని స్టేట్ ల్యాబ్, మరింత లోతైన విశ్లేషణకు బెంగళూరులోని కేంద్ర ల్యాబ్‌కు పంపించారు. 20 రోజుల్లో వీటికి సంబంధించి పూర్తిస్థాయి నివేదికలు రానున్నాయి.
కాకినాడ కలెక్టర్ ఆగ్రహం..
కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్‌మోహన్ నెయ్యి నాణ్యత విషయమై ఆగ్రహంగా ఉన్నారు. ఇప్పటికే జిల్లా ఆహారకల్తీ నియంత్రణశాఖ అధికారులను పిలిపించి మాట్లాడగా అసలు నెయ్యి నాణ్యతపై ఏ రోజూ తమ ద్వారా తనిఖీలు జరగలేదనే విస్తుగొలిపే వాస్త వాలు బయటకు వచ్చాయి. తమకు దేవస్థానం నుంచి అసలు ఎప్పుడూ సమాచారం లేదని కలెక్టర్‌కు వివరించారు. ఒకరకంగా ఇది పూర్తిగా నిబంధనల ఉల్లంఘనే అని తేల్చిచెప్పాలి. తిరుపతి ఘటన నేపథ్యంలో ఇకపై ఆలయానికి వచ్చే నెయ్యిని ఆహార కల్తీ నియంత్రణశాఖ అనుమతించి పక్కాగా ఉందని నిర్ధారించిన తర్వాతే వినియోగించేలా జిల్లా ఆహార కల్తీ నిరోధక శాఖ ఆలయ ఈవోకు రాతపూర్వకంగా లేఖ రాయబోతోంది.